బోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనలో విడుదలైన విషవాయువుఏది? - బిట్‌బ్యాంక్‌ (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌)




bhopal gas కోసం చిత్ర ఫలితం



. బోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన ఎప్పుడు జరిగింది?
-1984

. బోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనలో విడుదలైన విషవాయువుఏది?
- మిథైల్‌ 

. విపత్తు లేదా వైపరీత్యాలు సాధారణంగా వేటి ఆధారంగా సంభవిస్తాయి?
 - భౌగోళిక లక్షణాలు, వాతావరణ పరిస్థితులు, భూగర్భంలో కదలికలు

. విపత్తుల వలన ఒక ప్రాంతంలో వెంటనే సంభవించే మార్పులు ఏవి?
- దైనందిన కార్యక్రమాలు పూర్తిగా దెబ్బతింటాయి. అత్యవసర వ్యవస్థ విధ్వంసం అవుతాయి, ఆహారం, ఆవాసం, తాగునీరు, ఆరోగ్యానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి.

. విపత్తుల లక్షణాలు ఏవి?
- అకస్మాత్తుగా సంభవిస్తాయి, అతివేగం, తీవ్రమైన నష్టాలను కలిగిస్తాయి

. ప్రాణ, ఆస్తి, జీవనోపాధిని, వాతావరణ పరిస్థితులను దెబ్బతీసే వాటిని ఏమని పేర్కొంటారు?
- విపత్తు

. విపత్తుల లక్షణాలు ఏవి?
- అకస్మాత్తుగా సంభవిస్తాయి, అతివేగం తీవ్రనష్టాలను కలిగిస్తాయి

. ప్రధాన పకృతి వైపరిత్యాలు ఏవి?
- భూకంపాలు, తుపాన్లు

. మానవ తప్పిదాల వల్ల కలిగే విపత్తులు ఏవి?
- అగ్నిప్రమాదాలు, అంటువ్యాధులు ప్రబలడం పారిశ్రామిక, రసాయనిక కాలుష్యం, రోడ్డు ప్రమాదాలు, కాలుష్యం, వాతావరణ మార్పులు, గ్లోబుల్‌ వార్మింగ్‌, ఆల్లర్లు, ఘర్షణలు, యుద్ధాలు, తీవ్రవాద దాడులు.

. 1995-2004 సంవత్సరాల మధ్య భారత్‌లో సంభవించిన వివిధ రకాల విపత్తులలో అధికంగా సంభవించిన విపత్తు ఏది?
- వరదలు

. కీటకాల వల్ల వ్యాపించే వ్యాధులు?
- 1 శాతం

. విపత్తులను కారణాల ద్వారా వర్గీకరించాలని 1999 ఆగస్టులో సూచించిన కమిటీ ఏది?
- భారత ప్రభుత్వం జె.బి. పంత్‌ అధ్యక్షతన వేసిన కమిటీ

. భారత్‌లో ఎంత భూమి భూకంపాలు సంభవించడానికి అనుకూలంగా ఉంది?
- 65 శతం భూమి

. భూకంపాలు అధికంగా సంభవించే ప్రాంతాలు ఏవి?
- హిమాలయాలు, గుజరాత్‌లోని కచ్‌, అండమాన్‌, నికోబార్‌ దీవులు

. గుజరాత్‌ భుజ్‌ ప్రాంతంలో ఎప్పుడు భూకంపం సంభవించింది?
- 2001 జనవరి 28

. భారత్‌లో వరదకు ఎన్ని హెక్టార్ల భూమి ప్రభావితం అవుతుంది? 
- 40 మిలియన్‌ హెక్టార్లు

. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ భారతదేశాన్ని ఎన్ని భూకంప మండలాలుగా విభజించింది?
- 4 మండలాలు

 భారత్‌ వరదల నిర్వహణకు జాతీయ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 
- 1954






0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment