తుఫానులను ముందుగానే పసిగట్టేలా తూర్పు, పశ్చిమ తీరాల వెంట ఏ రకమైన అధునాతనమైన వ్యవస్థను నెలకొల్పారు? - బిట్‌బ్యాంక్‌ (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌)



Q   . నేల కోతకు గల కారణాలు ఏవి?
- ఊహించని వరదలు, వ్యవసాయ సంబంధాల వినాశనం, అడవులు నరికివేయడం, నదులు మార్గాలను మార్చుకోవడం

Q  . భారతదేశంలోని ఏ రకమైన అడవులలో అధికంగా అగ్ని పర్వతాలు సంభవిస్తాయి?
- గంగానది

Q  . వరదల వల్ల నష్టాలు కింది వానిలో దేనివల్ల అధికమవుతాయి?
- డ్రైనేజీ వ్యవస్థ లోపించడం

Q  . విపరీతమైన అలలతో తీర ప్రాంతాలకు నష్టాన్ని కలిగించే విపత్తు ఏది?
- సునామీ

Q  . పెద్ద ఎత్తున ఎవరూ ఊహించని సమయంలో ఎదురయ్యే వరదలను ఏమంటారు?
- డిజాస్టర్‌ లేదా విపత్తు

Q  . విపత్తులను ఎదుర్కోవడానికి వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సేవా సంస్థలు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టి విపత్తుల తీవ్రతను తగ్గించడానికి, బాధితులకు పునరావాసం ఏర్పాటుచేసి, సహాయక చర్యలు చేపట్టడాన్ని ఏమంటారు?
- డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (విపత్తు నిర్వహణ)

Q  . నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటి ఏ విధంగా ఏర్పాటయింది?
- కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వు, ద్వారా

Q  . నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటి ఎప్పటి నుండి అమలులోనికి వచ్చింది?
- సెప్టెంబర్‌ 27, 2008 నుంచి

Q  . నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంత మంది సభ్యులుంటారు?
- 9 మంది

Q  . జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మఖ్య విధులు ఏమిటి?
- విపత్తు నిర్వహణపై విధానాలు రూపొందించడం, జాతీయ ప్రణాళికను ఆమోదించడం

Q  . దేశంలో భూకంపాలు సంభవించినపుడు ఆ విపత్తు నిర్వహణను చేపట్టే మంత్రిత్వ శాఖ.
- కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

Q  . ప్రపంచంలో ఉన్న మొత్తం మంచినీటి వనరులలో మన దేశం ఎంత శాతం కలిగి ఉంది?
- 4 శాతం

Q  . మన దేశంలో ప్రకృతి పరమైన విపత్తులు పెరగడానికి ముఖ్య కారణం?
- అధికంగా పెరుగుతున్న జనాభా

Q  . ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఫర్‌ రెడ్‌ క్రాస్‌ అండ్‌ రెడ్‌ క్రిసెంట్స్‌ సొసైటీస్‌ 1998లో విడుదల చేసిన ప్రపంచ విపత్తుల నివేదిక వరల్డ్‌ డిజాస్టర్స్‌ రిపోర్టు ప్రకారం భారతదేశంలో 1987-96 మధ్య దశాబ్ధ కాలంలో సగటున ప్రతి యేటా ఎన్ని కోట్ల మంది ప్రజలు ఏదో ఒక విపత్తు బారీన పడ్డారని తెలిపింది?
- 5.6 కోట్ల మంది

Q  . సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ టూ ఎపిడెమాలజీ ఆఫ్‌ డిజాస్టర్‌ ఎక్కడ ఉంది?
 - బ్రసెల్స్‌లో

Q  . ఐక్య రాజ్య సమితి ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయంగా ప్రకృతి వైపరీత్యాలను తగ్గించాల్సిన దశాబ్దం?
- 1990 దశాబ్దాన్ని

Q  . ఏ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సంక్షోభ యాజమాన్య కమిటీ ఏర్పాటు అయింది?
- కేంద్ర వ్యవసాయ శాఖ

Q  . కరువు యాజమాన్యం కాదు కావలసింది రుతుపవన యాజమాన్యం అన్న ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త?
- ఎం.ఎస్‌ స్వామినాథన్‌

Q  . దేశంలోని ఎంత శాతం వరకు భూములు భూకంపాలకు, కొండచరియలూ విరిగిపడే ప్రమాదాలకు నెలవుగా ఉన్నాయి?
- సుమారుగా 60 శాతం

Q  . తుఫానులను ముందుగానే పసిగట్టేలా తూర్పు, పశ్చిమ తీరాల వెంట ఏ రకమైన అధునాతనమైన వ్యవస్థను నెలకొల్పారు?
- డాప్లర్‌ రాడార్‌ వ్యవస్థను

Q  . నదులు, రిజర్వాయర్లలో నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్య వేక్షించేందుకు దేశంలోని ప్రధాన నదీ పరివాహక ప్రాంతాల్లో ఎన్ని వరద సూచన కేంద్రాలు ఏర్పాటు చేశారు?
- 166 వరద సూచన కేంద్రాలు

Q  . అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా ఇండియా డిజాస్టర్‌ రీసోర్స్‌ నెట్‌వర్క్‌ పేరిట దేశంలో ఎన్ని జిల్లాలను ఆన్‌లైన్‌ ద్వారా అనుసందానం చేశారు?
- 565 జిల్లాలు





0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment