ద్రవ్యోల్బణం వల్ల నష్టపోయేది ఎవరు? ద్రవ్యోల్బణం వల్ల ప్రయోజనం పొందేవారు ఎవరు? - జనరల్ నాలెడ్జ్ బిట్స్





. ప్రణాళికా సంఘం అనేది-
జవాబు :  సలహా మండలి 

. దేశంలో బీమా వ్యాపారాన్ని క్రమబద్ధం చేయడానికి ప్రభుత్వం దేన్ని ఏర్పాటు చేసింది?
జవాబు :  బీమా క్రమబద్దీకరణ, అభివృద్ధి సంస్థ

. ఆర్థిక వ్యవస్థలో 'టేకాఫ్ దశ' అంటే-
జవాబు :  స్థిరమైన వృద్ధి ప్రారంభమవడం 

. ప్రణాళికా సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు?
జవాబు :  జవహర్‌లాల్ నెహ్రూ

. ఆర్థిక సర్వేను ఎవరు ప్రచురిస్తారు?
జవాబు :  ఆర్థిక మంత్రిత్వ శాఖ

. ప్రణాళికా సంఘం విధి కానిది-
జవాబు :  వార్షిక కేంద్ర బడ్జెట్‌ను తయారుచేయడం 

. ఎప్పటిలోగా దేశంలో గ్రామీణ టెలీ సాంద్రత 10 శాతం (ప్రస్తుతం 9 శాతం) సాధించాలని 11వ ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకుంది?
జవాబు :  2010

. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి హోదా-
జవాబు :  క్యాబినెట్ మంత్రి 

. స్థూల దేశీయోత్పత్తిలో వివిధ రంగాల తోడ్పాటుకు సంబంధించి, సరైన అవరోహణ క్రమం ఏది?
జవాబు :  సేవలు - పరిశ్రమలు - వ్యవసాయం

. భారతదేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వ్యక్తులను ఏ ప్రాతిపదికన వర్గీకరిస్తున్నారు?
జవాబు :  నిర్ణయించిన కనీస స్థాయి మేరకు వారికి ఆహారం లభించడం 

. కార్మికులు ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారేటప్పుడు ఏర్పడే నిరుద్యోగితను ఏమంటారు?
జవాబు :  సంఘృష్ట నిరుద్యోగిత

. దేశంలో వృత్తి స్వరూపం ఏళ్ల తరబడి ఒకేలా ఉండటానికి కారణం- 
జవాబు :  ఆర్థిక అభివృద్ధి కోసం ప్రజలు వ్యవసాయం నుంచి పరిశ్రమలకు తరలివెళ్లే పరివర్తన లేకపోవడం

. భారత ప్రభుత్వానికి చెందిన వివిధ కార్యక్రమాలకు సంబంధించి 'నిర్మల్ గ్రామ పురస్కారం' అనేది-
జవాబు :  పంచాయతీరాజ్ సంస్థలకు ఇచ్చే ప్రోత్సాహక పథకం 

. ద్రవ్యోల్బణం వల్ల ప్రయోజనం పొందేవారు-
జవాబు :  రుణ గ్రహీతలు

. ద్రవ్యోల్బణం వల్ల నష్టపోయేది ఎవరు?
జవాబు :  రుణదాతలు

. ద్రవ్యోల్బణం దేన్ని సూచిస్తుంది?
జవాబు :  సాధారణ ధరల సూచీలో పెరుగుదల

. పెరుగుతున్న నిరుద్యోగిత, ద్రవ్యోల్బణ స్థితిని ఏమంటారు?
జవాబు :  స్టాగ్‌ఫ్లేషన్

. ద్రవ్యోల్బణం నుంచి రక్షణ పొందనివారు ఎవరు?
జవాబు :  వ్యవసాయదారులు 

. అధిక ద్రవ్యోల్బణం, అల్ప ఆర్థిక వృద్ధి దశను ఏమంటారు?
జవాబు :  స్టాగ్‌ఫ్లేషన్

. స్టాగ్‌ఫ్లేషన్ లక్షణం-
జవాబు :  మాంద్యం + ద్రవ్యోల్బణం

. వ్యయం రాబడి మధ్య అంతరాన్ని పూడ్చడానికి, లోటు బడ్జెట్ విధానం అదనపు కాగితాల కరెన్సీని సృష్టిస్తుంది. దీని లక్ష్యం ఆర్థికాభివృద్ధి. ఈ విధాన వైఫల్యం దేన్ని కల్పిస్తుంది?
జవాబు :  ద్రవ్యోల్బణం

. సమష్టి సరఫరాతో పోలిస్తే సమష్టి డిమాండ్‌లో మితిమీరిన పెరుగుదల ఫలితంగా సాధారణ ధరల స్థాయిలో స్థిరమైన పెరుగుదలను ఏమంటారు?
జవాబు :  డిమాండ్‌పుల్ ద్రవ్యోల్బణం

. ఇటీవల భారతదేశ ఆర్థిక వ్యవస్థలో రెండంకెల ద్రవ్యోల్బణ రేటును సాపేక్షంగా అదుపు చేసిన చర్య-
జవాబు :  బడ్జెట్ లోటును, అనుత్పాదక వ్యయాన్ని తగ్గించడం

. ప్రభుత్వ పెట్టుబడికి ఆర్థిక సహాయం అందించే అత్యల్ప ద్రవ్యోల్బణ పద్ధతి-
జవాబు :  పన్ను విధింపు 

. మూల్య న్యూనీకరణం (డీవాల్యుయేషన్) అంటే-
జవాబు :  మరో విదేశీ కరెన్సీతో పోలుస్తూ ఒక కరెన్సీ విలువను తగ్గించడం

Q .. భారతదేశంలో దశాంశ కరెన్సీ విధానం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 
జవాబు :  1957 

Q . నది పేరుతో ఉన్న గ్రామీణ బ్యాంకు-
జవాబు :  వరద గ్రామీణ బ్యాంకు 


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment