స్టీఫెన్ హాకింగ్ (Stephen Hawking) - మహా మహులు - (ఇలాంటి మేధో సంపత్తి గల వారు మన దేశం లో ఉన్నా వాళ్ళను గుర్తించే వాళ్ళు లేరు, బుజం తట్టి ప్రోత్సహించే వాళ్ళు లేరు . లంచం, అవినీతి కన్నా ఇండియా కున్న పెద్ద రోగం ఓర్వలేనితనం )






stephen hawking కోసం చిత్ర ఫలితం


**  1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు. ఆయన తండ్రి వృత్తి రీత్యా లండన్ లో వైద్య శాస్త్ర పరిశోధకుడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లండన్ లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల వల్ల స్టీఫెన్ తల్లిని ఆక్స్ ఫర్డ్ లోని సురక్షిత ప్రాంతానికి పంపించారు
 ** స్టీఫెన్ తన విద్యార్థి జీవితాన్ని లండన్ లోని హైగేట్స్ లో ప్రారంభించాడు. తర్వాత అంటే 1950లో ఆయన తండ్రి కుటుంబాన్ని మిల్ హిల్ ప్రాంతానికి మార్చాడు.  అక్కడి సెయింట్ ఆల్బన్స్ పాఠశాలలో చేర్చాడు. 
** 1959లో నేచురల్ సైన్స్ విద్య కోసం స్కాలర్ షిప్ పరీక్ష రాశాడు. అందులో సఫలీకృతుడు కాగలిగినా... భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశాడు స్టీఫెన్. 1962లో కేవలం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు కాగలిగాడు.


stephen hawking కోసం చిత్ర ఫలితం
** స్టీఫెన్ తన 17 వ యేట,1959వ సంవత్సరం 10వ నెలలొ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం లొ చేరినాడు.
**  కాస్మాలజి, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ కి వెళ్ళాడు అప్పటి నుంచి ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి (Motor Neuron Disease) అనే భయంకర వ్యాధి ఉన్నట్టు తెలిసింది. దీనినే Amyotrophic Lateral Sclerosis (ALS) వ్యాధి అని కూడా అంటారు. 
** అన్నం తినాలన్నా... కనీసం బూట్ల లేసు కట్టుకుందామన్నా... స్టీఫెన్ శరీరం సహకరించేది కాదు భోజనం చేయడానికి ఆయన పడుతున్న ఇబ్బంది... తల్లిని మధనపెట్టింది.
** నాడీ మండలం పై అంటే నరాలు, వెన్నుపూస పై ఇది ప్రభావం చూపుతుంది. డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా... కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది. మళ్లీ విశ్వవిద్యాలయానికి తిరిగివచ్చిన హాకింగ్ తన పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. 
stephen hawking కోసం చిత్ర ఫలితం
** విశ్వవిద్యాలయంలో తనకు పరిచయమున్న మహిళను స్టీఫెన్ వివాహం చేసుకున్నాడు. ఆక్స్ ఫర్డ్ లో ఉన్నప్పుడు దగ్గర లోనే ఇల్లు తీసుకుని ఉండేవాడు. స్టీఫెన్ కు వ్యాధి బాగా ముదిరిన తరువాత విడాకులు తీసుకున్నాడు. అప్పటికే వారి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల కలిగారు. విడాకుల అనంతరం హాస్పటల్లో తనకు సేవలు చేస్తున్న ఓ నర్స్ తో స్టీఫెన్ సహజీవనం ప్రారంభించాడు.
** ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పని చేసిన స్టీఫెన్ కు, వ్యాధి అడ్డంకిగా మారలేదు. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా... మెదడు సహకరించడాన్ని స్టీఫెన్ గమనించాడు. 1970 నుంచి కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించాడు. 1971నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ పుస్తకరచన ప్రారంభించాడు.
computer wheel chair కోసం చిత్ర ఫలితం
** అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నాడు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించాడు. అది అమ్మకాల్లో సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూ... కాలం కథ పేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది.
computer brain కోసం చిత్ర ఫలితం
** మనిషి మెదడు కూడా కంప్యూటర్‌ వంటిదే. విడిభాగాలు పాడైన తర్వాత కంప్యూటర్‌ పని చేయటం ఆగిపోయినట్టే మెదడు ఆగిపోతుంది. ఒక్కసారి మెదడు నిలిచిపోయిన తర్వాత ఏమీ ఉండదు. 49 ఏళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటోంది. అయినప్పటికీ నేను మృత్యువు కు భయపడటం లేదు. త్వరగా మరణించాలని నేను భావించటం లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి" అన్న గొప్ప మనిషి స్టీఫెన్ హాకింగ్ 
డిగ్రీలు - పదవులు - పురస్కారాలు

1975 -  ఎడిటంగ్ మెడల్
1976 -  రాయల్ సొసైటి హ్యుగ్స్ మెడల్
1979 -  అల్బర్ట్ ఐన్ స్టీన్ మెడల్
1982 -  ఆర్డర్ ఆఫ్ బ్రీటీష్ ఎఒపైర్ (కమాండర్)
1985  - రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ బంగారు పతకం
1986 -  పొంటిఫిషియల్ అకాడమి ఆఫ్ సైన్స్ లో సభ్యత్వం
1988 -  భౌతిక శాస్త్రంలో అంతర్జాతీయ బహుమతి
1989 -  కన్ కర్డ్ లొ 
ఆస్ట్రియా ప్రిన్స్ అవార్డ్
1989 -  కంపానియన్ ఆఫ్ ఆనర్
1999 -  అమెరికా భౌతిక శాస్త్ర సమితి వారి జూలియస్ ఎడ్గర్ లిలెన్ ఫెల్ద్ ప్రైజ్
2003 -  కేస్ వెస్ట్రెన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం వారి మైకెల్ సన్ మోర్లీ అవార్డ్
2006 -  రాయల్ సొసైటీ కాప్లి మెడల్
** కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్ఛీకి అతుక్కు పోయిన మనిషి, కనీసం మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం. . . .   మోతార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా... చేస్తున్న పనికి శరేరం సహకరించక పోయినా... కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి
**   స్టీఫెన్ హాకింగ్ ఓ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం మనం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే..
కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం
** ఇలాంటి మేధో సంపత్తి గల వారు  మన దేశం లో ఉన్నా వారికి తగిన ప్రోత్సాహం లేదు .
మన దేశంలో తెలివి తేటలు గలవారు చాలా మందే ఉన్నారు. కాని వాళ్ళను గుర్తించే వాళ్ళు లేరు, బుజం తట్టి ప్రోత్సహించే వాళ్ళు లేరు . 
** నాయక్ సినిమా లో పోసాని కృష్ణ మురళి  చెప్పినట్లు "మనం నాశనం అయిపోయినా పర్వాలేదు కాని ఎదుటి వాడు బాగుపడకూడదు" .
** లంచం, అవినీతి కన్నా ఇండియా కున్న పెద్ద రోగం ఓర్వలేనితనం. ఇది మనుషుల్లో పొతే అప్పుడు మనం చైనా నుంచి, జపాన్ నుంచి వస్తువులు దిగిమతి చేసుకోవలసిన అవసరం లేదు. మనమే చేసుకోవచ్చు. మనమే ఇవ్వచ్చు. అలాంటి  రోజు రావాలి.  వస్తుందా . ? మీరు ఏమంటారు? 
 

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment