దుబాయ్ ( DUBAI ) - ప్రపంచ దేశాల సమాచారం - ప్రతి రోజు ఒక దేశం గురించిన సమాచారం


దుబాయ్ ( DUBAI )



దుబాయ్ ని మొదట వెనిస్ ముత్యాలు వ్యాపారి Gaspero Balbi 1580 లో ఈ ప్రాంతాన్ని సందర్శించాడు
ఆయనే మొదట దీనిని డుబై (Dibei) అని   ప్రస్తావించాడు.
దుబాయ్ 18 వ శతాబ్దం లో ఒక మత్స్యకార గ్రామం గా  ఉండేది , అబూ ధాబీ యొక్క షేక్ బానియాస్ తెగలు ఇక్కడ చేపలు పట్టుకొని జీవనం సాగించేవి.
1833 లో, గిరిజన తేగల మధ్య  విరోధం తరువాత, అల్ బు ఫలస  తెగ సభ్యులు అబూ ధాబీ నుండి విడిపోయి దుబాయ్ లో స్థిరపడ్డాయి.
దుబాయి లో1800 ల్లో మశూచి మహమ్మారి వ్యాపించింది. 
1969 నుండి దుబాయి లో చమురు రాబడి మొదలు అయింది 
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశంలోని ఏడు ఎమిరేట్స్ లలో దుబాయ్ ఒకటి 
 అబుధాభి, షార్జా, అలైన్, రాస్ అల్ ఖైమా, పుజైరా, ఉమ్మ్ అల్ క్వయిన్ మొదలయినవి కలిపి దుబాయి గా పిలుస్తారు 
దుబాయ్ సిటీగా పిలిచే ఇది ఆ దేశంలోని ప్రధాన అభివృద్ది కలిగిన పట్టణము. 
డిసెంబర్ 2 1971 న అబుధాబి మరియు మిగిలిన ఐదు ఎమిరేట్స్ దుబాయితో కలసి యునైటెడ్ ఎమిరేట్స్ (UAE) అనే సమూహ దేశంగా ఏర్పడ్డాయి.
దుబాయ్ పర్సియన్ గల్ఫ్ సముద్రతీరము వెంబడి కలదు. 
ఈ పట్టణము సముద్రమునకు దాదాపు సమానమైన ఎత్తుకలిగి ఉన్నది. దుబాయ్ యొక్క సరిహద్దులు దక్షణాన అబుదాభి, ఉత్తర తూర్పుగా షార్జా, దక్షణౌత్తరంగా ఒమన్ , పశ్చిమాన అజమాన్, తూర్పుగా రస్ అల్ ఖైమా, దుబాయ్ పట్టణాన్ని కొంత చుట్టినట్టుగా హత్తా పర్వతశ్రేణి గలవు 
2006 జనాభా లెక్కలననుసరించి దుబాయ్ యొక్క జనాభా 1,422,000. పురుషులు, 1,070,000. స్త్రీలు 349,000. ఉన్నారు 
దుబాయ్ యొక్క అధిక జనాభా ఆసియా వారు ( దాదాపు 85%. ఇందులో భారతీయులు 51%, పాకిస్తానీయులు 16%, బంగాలీలు 9%, పిలిప్పీనీయులు 3% ). మొత్తం ఎమిరేట్స్ యొక్క జనాభాలో 71% ఆసియా వారే ఉన్నారు).
దుబాయ్ పట్టణంలో ప్రధాన భాష అరబిక్. అరబిక్ కాకుండా పర్షియన్, మళయాళం, ఆంగ్లం, హిందీ, తెలుగు, ఉర్దూ, బెంగాలీ అధికంగా మాట్లాడుతారు.
ఇక్కడ ఉన్న జబెల్ అలి పోర్ట్ జబల్ అలి 1970 లో నిర్మింపబడినది. ఇది ప్రపంచంలోనే మనుషులతో నిర్మింపబడిన అతిపెద్ద పోర్ట్. 
దుబాయ్ ఇంటర్నెట్ సిటీ  ,  దుబాయ్ మీడియా సిటీ, నాలెడ్జ్ విలేజ్ , దుబాయ్ ఇంటర్ నేషనల్ ఫైనాన్స్ సెంటర్ మొదలగునవి కలిపి టెకమ్ అని పిలుస్తారు .
 ఇంటర్ నెట్ సిటీలో ప్రముఖ సంస్థలైన ఇ యమ్ సి కార్పోరేషన్ , ఒరాకిల్, మైక్రోసాప్ట్ ,ఐ బి యమ్  కలవు 

దుబాయ్ యొక్క ప్రధాన రవాణాలు విమానం, బస్సు. రైలు సౌకర్యం కలవు 
దుబాయ్ నగరానికి ప్రధాన రహదారి షేఖ్ జాయద్ రోడ్. ఇది మొత్తం ఆరు+ఆరు పన్నెండు లైనుల రోడ్.
ఈ రహదారిపై వాహనాలకు సిటీలోపల 120, సిటీ బయట 140 కిలోమీటర్ల వేగం వరకూ పరిమితి కలదు. ఈ రహదారికి కంప్యూటరు అనుసంధానము గలదు 
టాల్ గేట్స్ లో డబ్బు చెల్లించే పద్దతిలో కాక వాహనము ముందు భాగమున ఒక ట్యాగ్ అతికించి ఉంచుతారు.
అందులోనుండి వాహనం టోల్ గేట్ నుండి ప్రయాణించినపుడు డబ్బు మినహాయింపబడుతుంటుంది . ఎంత వేగంలో వెళ్ళే వాహనాన్నయినా టోల్ గేట్ దగ్గర కల స్కానర్ కెమెరాలు ట్యాగులను స్కాన్ చేస్తాయి.

అత్యంత రద్దీ ఎయిర్ పోర్టుగా దుబాయి విమానాశ్రయం అరుదైన రికార్డు సాధించింది. తర్వాత స్థానంలో లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నిలిచింది. 2013తో పోలిస్తే 6.1% వృద్ధితో గత ఏడాది 7 కోట్ల 4 లక్షల మంది దుబాయి విమానాశ్రయం మీదుగా రాకపోకలు నెరిపారు. అదే హీత్రూ ఎయిర్‌పోర్టు మీదుగా ఎటువంటి వృద్ధి లేకుండా 6.8 కోట్ల మంది రాకపోకలు సాగించారు
దుబాయిలో ప్రారంభించబడిన ప్రపంచములోనే అతిఎత్తయిన మానవ నిర్మిత కట్టడం--బుర్జ్ ఖలీఫా టవర్. (బుర్జ్ దుబాయి). ప్రారంభోత్సవానికి ముందు బుర్జ్ దుబాయ్‌ గా సుపరిచితమైన ఈ నిర్మాణం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో ఉన్న ఒక ఆకాశసౌధం, 828 మీ (2,717 అడుగులు) ఎత్తుతో ఉన్న ఈ భవనం అత్యంత ఎత్తైన మానవ నిర్మిత కట్టడంగా గుర్తింపు పొందింది. సెప్టెంబర్ 21 2004న దీని నిర్మాణం ప్రారంభమైంది, అక్టోబర్ 1 2009నాటికి భవనం యొక్క వెలుపలి భాగం నిర్మాణం పూర్తయింది. ఈ భవనం అధికారికంగా 4 జనవరి 2010న ప్రారంభమైంది.

ఎమిరేట్  : దుబాయి

దుబాయి అమీర్ (రాజు )  :  షేక్ ముహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్
దుబాయి వైశాల్యము  :  4,114 km² (1,588.4 sq mi)
దుబాయి జనాభా (2006)  :  14,92,000

కరెన్సీ :  దిర్హామ్  ( Dirham)







0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment