మాల్దీవులు
మాల్దీవుల గణతంత్రరాజ్యం భారతదేశానికి నైఋతిన హిందూ మహాసముద్రంలో 26 పగడపు దిబ్బలలో మొత్తం 1,196 పగడపు దీవులు సముదాయాలతో ఏర్పడిన దేశం. |
కోయిమాలే అనే ఒక సింహళ యువరాజు తన పెండ్లికూతురైన శ్రీలంక చక్రవర్తి కుమార్తెతో పాటు ఒక మాల్దీవుల లగూన్ లో చిక్కుకొని అక్కడే స్థిరపడి మాల్దీవుల మొదటి సుల్తాన్‌గా పరిపాలించాడని ప్రతీతి. |
కేరళ తీరానికి చెందిన మోప్లా అనే సముద్రపు దొంగలు ఈ దీవులను ఎన్నో కష్టాలకు గురి చేసారు . 6వ శతాబ్దములో పోర్చుగీసు వాళ్ళు ఈ దీవులను తమ ఆధీనములోనికి తెచ్చుకుని 15 సంవత్సరాలు (1558-1573) వరకూ పాలించారు. వారిని మహమ్మద్ అల్ ఆజమ్ అనే దేశభక్తి గల వీరుడు తరిమివేశాడు. |
బ్రిటీషు వారి నుండి 1965లో స్వాతంత్ర్యము పొందినా సుల్తాను రాజ్యమే తరువాతి 3 సంవత్సరాలు పరిపాలన సాగించింది. నవంబరు 11,1968 లో దాన్ని రద్దు చేసి ఇప్పటి పేరుతో గణతంత్ర రాజ్యముగా మార్చడం జరిగింది |
1978లో మౌమూన్ అబ్దుల్ గయూమ్ మాల్దీవులు మొదటి అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు. అప్పటి నుండి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన అధికారదర్పముతో పరిపాలించాడు. 1988లో ఆయనకు వ్యతిరేకముగా జరిగిన ఒక కుట్రనుండి భారత రక్షక దళాల సహాయముతో తప్పించుకున్నాడు |
ప్రస్తుతం మహ్మద్ "అన్నీ" నషీద్ దీనికి అధ్యక్షుడు గా ఉన్నారు |
మాల్దీవులు ప్రపంచములోనే అతి చదునైన దేశముగా పేరుగాంచింది. |
26 డిసెంబరు 2004లో హిందూ మహాసముద్రములో వచ్చిన భూకంపము వలన ఏర్పడిన సునామీ వల్ల మాల్దీవులకు అపార నష్టం వాటిల్లింది. |
ఈ దీవుల సమూహము సముద్ర మట్టానికి క్రిందుగా ఉండటము మూలంగా ఈ ఉపద్రవం సంభవించింది. సుమారు 75 మంది, ఆరుగురు విదేశీయులతో సహా గల్లంతయ్యారు. ప్రజలు నివసించే 13 దీవులలో, 29 విహార దీవులలో మొత్తం వసతులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. |
మాల్దీవుల అర్ధికవ్యవస్థ మత్స్య, మరియు సముద్ర ఉత్పత్తులపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నది. నేటికీ ఇవే ప్రజల ప్రధాన జీవనాధారాలు. అందువల్లే ప్రభుత్వము మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. |
చాపల అల్లకం, లక్కపని, హస్తకళలు మరియు కొబ్బరితాళ్ళ తయారీ వంటి అనేక సాంప్రదాయక కుటీర పరిశ్రమలు కూడా ఉన్నాయి . |
మాల్దీవులు
విస్తీర్ణం పరంగా ప్రపంచంలో 185 వ స్తానం , జనాబా పరంగా ప్రపంచంలో 175 వ స్థానం
లోను ఆర్ధిక పరంగా ప్రపంచంలో 183 వ స్థానం లోను ఉంది . |
మాల్దీవుల పూర్తి పేరు : రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ |
మాల్దీవుల జాతీయగీతం : Gavmii mi ekuverikan matii tibegen kuriime salaam(జాతీయ సమైక్యతతో మన దేశానికి వందనం చేద్దాం) |
మాల్దీవుల రాజధాని : మాలే |
మాల్దీవుల అధికార భాషలు : ధివేహి |
మాల్దీవుల ప్రభుత్వం : గణతంత్రము |
మాల్దీవుల అధ్యక్షుడు : మౌమూన్ అబ్దుల్ గయూమ్ |
మాల్దీవుల స్వాతంత్ర్యము : యునైటెడ్ కింగ్‌డం నుండి జూలై 26,1965 |
మాల్దీవుల విస్తీర్ణం 300 కి.మీ² (ప్రపంచంలో 185వది) |
మాల్దీవుల జనాభా : 329,000 (ప్రపంచంలో175వది) |
మాల్దీవుల జీడీపీ : 1.25 బిలియన్ డాలర్లు (ప్రపంచంలో183వది) |
మాల్దీవుల
కరెన్సీ : Rufiyaa రుఫియా (MVR) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment