'గణతంత్ర
దినోత్సవా'న్నే ఆంగ్లంలో 'రిపబ్లిక్ డే' అంటారు. ఇది జాతీయ పండుగ. మనం కూడా ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవానికి, జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి చిన్న తేడా ఉంది. ప్రతి దేశానికీ రాజ్యాంగం ఉంటుంది. అలా ఒక రాజ్యాంగ విధానాన్ని నిర్దేశించుకుని మొదలుపెట్టిన రోజునే 'గణతంత్ర దినోత్సవం' అంటాం. |
మన
దేశాన్ని 200 ఏళ్ల క్రితం ఆంగ్లేయులు పరిపాలించారు. వారు పాలించినంత కాలమూ దేశపరిపాలన బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారమే జరిగేది. వాళ్లు వెళ్లిపోయారు. అప్పుడు మన దేశాన్ని మనమే పాలించుకోవాలి . అందుకు తగ్గట్టు రాజ్యాంగాన్ని కూడా తయారుచేసుకోవాలి. అలా మన దేశానికీ ఓ రాజ్యాంగం తయారైంది. అలా తయారైన రాజ్యాంగాన్ని మొదలుపెట్టిన రోజే... 1950, జనవరి 26. ఆ రోజు నుంచి మనము ప్రతి ఏడాది జనవరి 26న 'గణతంత్ర' దినోత్సవాన్ని 'జాతీయ పండుగ' గా జరుపుకుంటున్నాం. |
మనకు
1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. రాజ్యాంగం తయారుచేయడానికి ఎంతో మంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. ఎన్నో అంశాలతో చాలాకాలం పాటు కృషి చేసి రూపొందించారు. ఈ రాజ్యాంగము తయారుచేయటానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. అనేక సవరణల అనంతరం 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలములో పూర్తి చేశారు. ప్రపంచములోనే అతి పెద్ద రాజ్యాంగంగా మనదేశ రాజ్యాంగం పేరుపొందింది. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచారు. నాటి నుండి భారతదేశము 'సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యము'గా రూపొందింది. |
ఏఏ దేశాల్లో.. ఏయే తేదీల్లో..
|
ఇటలీ-
జూన్ 2, చైనా - అక్టోబర్ -10, రొడీషియా - అక్టోబరు 24, కజకిస్తాన్ - అక్టోబరు 25, మాల్దీవులు - నవంబరు - 11, బ్రెజిల్ - నవంబర్ 15, యుగోస్లేవియా - నవంబరు 29, మాల్టా - డిసెంబరు 13, నైజర్ - డిసెంబరు 18, రొమానియా - డిసెంబరు - 30, అల్బేనియా - జనవరి 11 (1946), ఆర్మేనియా - మే 28 (1918), అజర్‌బైజాన్ - మే 28 (1918), బుర్కినా ఫాసో - డిసెంబరు 11 (1958), తూర్పు జర్మనీ - అక్టోబరు 7, గాంబియా-ఏప్రిల్ 24 (1970, ఇంకో పేరు మష్ర్‌మాని), ఐస్‌లాండ్- జూన్ 17 (1944), ఇరాన్- ఏప్రిల్ 1 (ఇస్లామిక్ రిపబ్లిక్ డే), ఇరాక్ - జులై 14, కెన్యా - డిసెంబరు 12 ,1963, లిథువేనియా - మే 15 ,1920, మాల్దీవులు - నవంబర్ 11 (1968), నేపాల్- మే 28(2008), నైగర్ - డిసెంబరు 18 (1958), ఉత్తరకొరియా- సెప్టెంబరు 9 (1948), పాకిస్తాన్ - మార్చి 23 (1956), పోర్చుగల్ - నవంబర్ 15 (1991), సియెర్రా లియోన్ - ఏప్రిల్ 27, (1961), ట్యునీషియా - జులై 25, (1957), టర్కీ - అక్టోబర్ 29 (1923). |
స్వాతంత్య్ర దినోత్సవానికి , గణతంత్ర దినోత్సవానికి తేడా ఏమిటి ? మీకు తెలుసా ?
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment