ఆస్ట్రియా
»ఆస్ట్రియా నామము రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా. మధ్య ఐరోపాలోని ఒక భూపరివేష్టిత దేశం. ఈ దేశము స్లొవేనియా మరియు ఇటలీలకు ఉత్తర దిశలో, స్విట్జర్లాండ్ మరియు లీక్టెన్స్టెయిన్లకు తూర్పులో, స్లొవేకియా మరియు హంగేరీలకు పశ్చిమాన, జర్మనీ మరియు చెక్ రిపబ్లిక్లకు దక్షిణ దిశలో ఉన్నది. ఈ దేశ రాజధాని నగరమైన వియన్నా డానుబే నదీ తీరాన ఉన్నది. |
»ప్రస్తుత ఆస్ట్రియా భూభాగం చాలా చిన్నది. క్రీస్తు పూర్వం 500లో కెల్ట్ అనే తెగ ప్రజలు ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకొని తమ ఆధిపత్యాన్ని చూపించారు. ఆ తర్వాత రోమన్‌లు, వండాల్‌లు, విసిగోత్‌లు, హన్‌లు, హంగేరియన్ మాగ్యార్‌లు, జర్మనీ తెగలు ఈ ప్రాంతాన్ని వందలాది సంవత్సరాలు పరిపాలించారు. అప్పుడు ఆస్ట్రియా భూభాగంలో చెకొస్లోవేకియా, హంగేరి, యుగోస్లావియా దేశ భూభాగాలు కలిసి ఉండేవి. |
»క్రీస్తుశకం 1246లో స్విట్జర్లాండ్‌కు చెందిన ఆల్సేసియన్ కుటుంబం ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని పరిపాలన ఆరంభించింది. ఆ కుటుంబమే హాప్స్‌బర్గ్ కుటుంబం. ఈ రాజులే ఆ కాలంలో ఆ భూభాగానికి వియన్నాను రాజధానిగా నిర్మించింది. 1530 నాటికి వియన్నా ఒక గొప్పనగరంగా విస్తరించింది. ఈ రాజులు ఇటలీ, నెదర్‌లాండ్, స్పెయిన్ వరకు తమ భూభాగాన్ని విస్తరించారు. ప్రతిసారీ రాజకుటుంబం పవిత్ర రోమన్ చక్రవర్తిని ఎన్నుకునేది. ఈ హాప్స్‌బర్గ్ కుటుంబం ఆస్ట్రియాను దాదాపు 600 సంవత్సరాల వరకు పరిపాలించింది. |
»దేశంలో 8% ప్రజలు రోమన్ క్యాథలిక్కులు. ఇక్కడి సమాజంలో చర్చి ఒక గొప్ప శక్తిమంతమైన కేంద్రం. ఇక ప్రతీ కుటుంబానికి తప్పకుండా ఇల్లు ఉంటుంది. దేశంలో నిరుద్యోగ సమస్య లేదు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ మాతృభూమి ఆస్ట్రియా. కాని ఆయన జర్మనీకి వలస వెళ్లి అక్కడ అధికారం చూపించాడు. దేశంలో జర్మన్ల జనాభా అధికం కావడం వల్ల జాతీయ భాషగా జర్మనీ భాషను గుర్తించారు. |
»ఆస్ట్రియా దేశంలో ప్రజల ముఖ్య ఆహారం మాంసం. మాంసంతో చేసిన వంటకం పూర్వ కాలం నుండీ ఒక ప్రధాన వంటకంగా వస్తోంది. దీనిని రాయల్ క్యూసిన్ ‘హాఫ్‌కాచి’ అంటారు. ఆఫ్రికాట్ జామ్‌తో చేసిన క్రాప్‌ఫెన్, ఆపిల్స్‌తో చేసిన ఆఫ్‌ఫెల్ స్ట్రుడెల్, టాప్‌ఫెన్ లాంటి పేర్లు గల వంటకాలను భుజిస్తారు. |
»వియన్నా నగరం దేశానికి రాజధాని. ఇది 12 శతాబ్దంలో నిర్మితమైంది. ఎందరో రాజులు ఈ నగరం నుండే తమ పరిపాలనను కొనసాగించారు. దేశంలో అతి పెద్ద నగరం వియన్నానే. 1275లో నిర్మితమైన ఈ నగరం నడిబొడ్డున అద్భుతమైన హాఫ్‌బర్గ్ రాజప్రాసాదం నగరానికే తలమానికమైన రాజప్రాసాద భవనం. 88 సంవత్సరాల తర్వాత కూడా ఈ భవనం చెక్కు చెదరకుండా నిలిచి ఉంది. |
»ఆల్పైన్ పర్వత పాదాల వద్ద నెలకొన్న ఇన్స్‌బ్రక్ నగరం ప్రకృతి శోభను వెదజల్లే ఒక అందమైన నగరం. ఈ నగరంలోనే ఎక్కువగా వింటర్ ఒలింపిక్స్ జరుగుతూ ఉంటాయి. స్కై రిసార్సులు అనేకం ఇక్కడ ఉన్నాయి. ఆస్ట్రియా దేశంలో ఈ నగరం ఆటలకు ప్రసిద్ధి. చలికాలంలో ఈ నగరంలో మంచు పరుచుకుని ఎంతో అందంగా కనబడుతుంది. |
»ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త జొహన్నన్ కెప్లర్ ఈ నగరంలోనే
పుట్టాడు. ఇక్కడ నివాస గృహాలు ఎంతో విచిత్రంగా ఉంటాయి. పైకప్పులు ఎరుపు రంగులో
ఉంటాయి. పాతనగరంలో టౌన్‌హాల్ భవనం, స్ల్కాస్‌బర్, క్లాక్‌టవర్, ఆర్ట్ మ్యూజియం,
లాండ్‌హౌస్, లాండెస్ జుగాస్, ఓపెర్నాస్, క్యాథడ్రల్, ఫెర్డినాండ్ మాసోలియం,
ఫ్రెడరిక్ బుర్జ్, పెయింటింగ్ హౌస్, ఆధునిక ఆర్ట్ మ్యూజియం మొదలైన పురాతన
కట్టడాలు, దాదాపు 21 మ్యూజియంలు, 228 అతి ఎత్తై భవనాలు ఉన్నాయి. |
ఆస్ట్రియా అధికార నామము :
రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా ఆస్ట్రియా జాతీయగీతం : లాండ్ డెర్ బెర్గ్, లాండ్ ఆమ్ స్ట్రోమ్ (జర్మన్)- పర్వతాల నేల, నదీతీర నేల ఆస్ట్రియా రాజధాని: వియన్నా ఆస్ట్రియా ప్రభుత్వం: పార్లమెంటరీ రిపబ్లిక్ President : en:Heinz Fischer Chancellor : en:Werner Faymann ఆస్ట్రియా వైశాల్యం: 83,879 చదరపు కిలోమీటర్లు ఆస్ట్రియా జనాభా: 85,72,895 ఆస్ట్రియా మతం: క్రైస్తవులు 88% ఆస్ట్రియా భాషలు: జర్మన్, మాగ్యార్, స్లోవీన్‌లు ఆస్ట్రియా స్వాతంత్య్రం: మొదటిసారి 1918లో... రెండోసారి 1945లో. ఆస్ట్రియా సరిహద్దులు: పశ్చిమ జర్మనీ, చెకొస్లోవేకియా, హంగేరి, యుగోస్లోవియా, స్విట్జర్లాండ్ ఆస్ట్రియా కరెన్సీ: షిల్లింగ్ |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment