ఫిబ్రవరి - 2015 కమిటీలు - కమిషన్లు- February 2015 - Committes & Commissions



ఫిబ్రవరి - 4 
¤ కంపెనీల చట్టం కింద కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిబంధనలను కంపెనీలు సరిగ్గా అమలు చేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని పర్యవేక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.       » లాభాల్లో నడుస్తున్న కంపెనీలు, తమ మూడేళ్ల సగటు లాభాల్లో కనీసం 2% వరకు సామాజిక సేవల కోసం వెచ్చించాల్సి ఉంటుంది.       » ఈ నిబంధనల అమలు పర్యవేక్షణ మెరుగుపరచడానికి హోంశాఖ మాజీ కార్యదర్శి అనిల్ బజ్జాల్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు.       » అపోలో టైర్స్ సీఎండీ ఓంకార్ ఎస్.కన్వర్, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్యులు దీపక్ నయ్యర్, నాస్కామ్ మాజీ అధ్యక్షులు కిరణ్ కార్నిక్, ప్రభుత్వ రంగ సంస్థల, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ప్రతినిధులు సహా మొత్తం ఆరుగురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. 
ఫిబ్రవరి - 12 
¤ జాతీయ ఆహార భద్రత చట్టాన్ని (ఎన్ఎఫ్ఎస్ఏ) 67% జనాభాకు కాకుండా 40% జనాభాకు మాత్రమే వర్తింపజేయాలని జాతీయ ఉన్నతస్థాయి కమిటీ (హై లెవెల్ కమిటీ) సిఫార్సు చేసింది. ఇలా చేయడం వల్ల దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలన్నింటికీ ఈ పథకం చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.       » పట్టణ ప్రాంతాల్లో 50%, గ్రామీణ ప్రాంతాల్లో 75% జనాభాకు మొత్తం మీద 67% జనాభాకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.       » దేశంలో ఇప్పటికే ఈ పథకాన్ని (67% జనాభాకు వర్తించేలా) హరియాణా, దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, చండీగఢ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.       » 40% జనాభాకే ఎన్ఎఫ్ఎస్ఏ ను వర్తింపజేయడం వల్ల ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.30,000 కోట్లు ఆదా అవుతుందని కమిటీ ప్రకటించింది.       » కేంద్ర మాజీ ఆహార శాఖా మంత్రి శాంతకుమార్ ఈ కమిటీకి నేతృత్వం వహించారు.       » ఎరువులపై ఇచ్చే సబ్సిడీని రైతులకు ప్రత్యక్షంగా ఇవ్వాలని కమిటీ సూచించింది.¤ 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లపై విచారణకు కేంద్ర ప్రభుత్వం సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ను ఏర్పాటు చేసింది.       » ఇందిర హత్యానంతరం దిల్లీ, పలు ఇతర రాష్ట్రాల్లో సిక్కులపై చోటు చేసుకున్న హింసకు సంబంధించిన అన్ని కేసులను ఈ త్రిసభ్య బృందం పునర్విచారణ చేసి, ఆరు నెలల్లోగా నివేదిక సమర్పిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.       » ఈ సిట్‌కు ఐపీఎస్ అధికారి ప్రమోద్ ఆస్థానా నేతృత్వం వహిస్తారు. 

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment