ఫిబ్రవరి - 2015 వార్తల్లో వ్యక్తులు - February - Persons in News



ఫిబ్రవరి - 1
¤ లండన్ పార్లమెంట్ స్క్వేర్‌లో ప్రతిష్ఠించబోయే మహాత్మా గాంధీ విగ్రహానికి భారత సంతతికి చెందిన 'నైన్ హాస్పిటాలిటీ లిమిటెడ్' హోటళ్ల వ్యాపారి వివేక్ చందా లక్ష పౌండ్ల (సుమారు రూ.93,55,000)ను విరాళంగా ప్రకటించారు.
        » గాంధీ విగ్రహం ప్రాజెక్టు స్థాపకుడు లార్డ్ మేఘనాథ్ దేశాయ్. మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి ఫిలిప్ జాక్సన్ చెక్కుతారు
.
¤ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రముఖ రియాలిటీ షో 'బిగ్‌బాస్ హల్లాబోల్ విజేతగా బుల్లితెర నటుడు గౌతమ్ గులాటి నిలిచారు
.
        » బిగ్‌బాస్‌లో ఎనిమిదో సీజన్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు
.
        » విజేతగా నిలిచిన గౌతమ్ గులాటీకి రూ.50 లక్షలు బహుమతి లభించింది.
ఫిబ్రవరి - 3 
¤ అమెరికా అందించే ప్రతిష్ఠాత్మక 'హయేక్' బహుమతి బరిలో భారత్‌కు చెందిన హిందోల్ సేన్ గుప్తా నిలిచారు. వివిధ దేశాల నుంచి ఆరుగురు రచయితలు ఈ బహుమతికి పోటీపడుతున్నారు. విజేతకు మాన్ హటన్ సంస్థ యాభైవేల యూఎస్ డాలర్ల నగదు (సుమారు రూ.31 లక్షలు) బహుమతి ఇస్తుంది.        » ఆర్థికశాస్త్రంలో నోబెల్ గెలుచుకున్న ఫెడరిక్‌వాన్ హయేక్ సూత్రీకరణాలపై వచ్చిన పుస్తకాల్లో మేటి రచనను ఈ బహుమతికి ఎంపిక చేస్తారు.        » పారిశ్రామికవేత్తలు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నారో 'రీకాస్టింగ్ ఇండియా' అనే పుస్తకంలో గుప్తా కూలంకషంగా వివరించారు.
ఫిబ్రవరి - 4 
¤ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సీఎండీగా వారణాసి ఉదయ భాస్కర్ నియమితులయ్యారు.¤ నవ్యాంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి, జానపద సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా ప్రముఖ జానపద, విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు నియమితులయ్యారు.      » ఈ సంఘానికి అధ్యక్షుడిగా శాసనసభ డిప్యుటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నియమితులయ్యారు.¤ టీమ్ ఇండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌కు టెరి విశ్వవిద్యాలయం ఏడో స్నాతకోత్సవం సందర్భంగా గౌరవ డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేసింది.
ఫిబ్రవరి - 5
¤ ఇన్ఫోసిస్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమారుడు రోహన్ మూర్తి, ఐఐటీ దిల్లీ ఛైర్మన్ విజయ భాస్కర్, గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ఎస్.ఎ.బేరిలను కేంద్ర విద్యా సలహా సంఘం (సీఏబీఈ) సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. 
ఫిబ్రవరి - 6 
¤ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికా వాణిజ్య విధాన, సంప్రదింపుల సలహా కమిటీ సభ్యుడిగా భారత సంతతికి చెందిన మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగాను నియమిస్తున్నట్లు ప్రకటించారు.      » ఈ కమిటీ వాణిజ్య అంశాల్లో విధాన నిర్ణయాలకు సంబంధించిన సలహాలు ఇస్తుంటుంది.¤ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ శాసన సభ్యురాలు అజ్మీరా రేఖా నాయక్‌కు అరుదైన అవకాశం లభించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)కు చెందిన విద్య, సాంస్కృతిక వ్యవహారాల శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ సందర్శుకుల నాయకత్వ కార్యక్రమం (ది ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ - ఐవీఎల్‌పీ)కి హాజరు కావాల్సిందిగా అమెరికా ప్రభుత్వం ఆమెకు ఆహ్వానం పంపింది.      » 'సంయుక్త రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలో అధికారాల ఏర్పాటు' అనే అంశంపై వాషింగ్టన్‌లో ఏప్రిల్ 6 నుంచి 24 వరకు ఐవీఎల్‌పీ కార్యక్రమం జరగనుంది.      » తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆహ్వానం అందుకున్న తొలి గిరిజన మహిళా శాసన సభ్యురాలు రేఖా నాయక్.
ఫిబ్రవరి - 12 
¤ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) 2015-16 ఆర్థిక సంవత్సరానికి అధ్యక్షుడిగా మనోజ్ ఫడ్నిస్, ఉపాధ్యక్షుడిగా దేవరాజు రెడ్డి ఎన్నికయ్యారు.¤ మైసూరు మహారాణి ప్రమోదాదేవి రాజవంశ వారసుడిగా యధువీర్ గోపాల్ రాజ్ అరసు ను ప్రకటించారు. ఆయన దత్తత కార్యక్రమాన్ని ఈనెల 23న మైసూర్ రాజస్థానంలో నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు.      » రాజా పేరును యధువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయరు గా మార్చనున్నారు.      » చివరి రాజవంశీయుడు (ప్రమోదా దేవి భర్త) శ్రీ కంఠ దత్త నరసింహరాజ ఒడెయరు 2013 డిసెంబరు 10న హఠాన్మరణం అనంతరం ఇన్నాళ్లకు రాజు పేరును ప్రకటించారు. 
ఫిబ్రవరి - 15
¤ భారతీయ యోగా గురువు సీపీ యోగరాజ్ (29) నలభై గంటల పాటు సుదీర్ఘంగా యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఇందులో భాగంగా 15 వందలపై చిలుకు యోగాసనాలు వేసి ఈ రికార్డు సాధించాడు.      » భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనను ఆమోదిస్తూ ఐరాస జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించిందని అందుకే తన రికార్డును మోదీకి అంకితమిస్తున్నానని యోగరాజ్ ప్రకటించారు.      » హాంకాంగ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.¤ అమెరికాలోని న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన భారతీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ శ్రీకాంత్ జగబత్తులకు డేటా డ్రైవెన్ మోడలింగ్, లర్నింగ్ టెక్నిక్స్ అభివృద్ధిపై పరిశోధనకు 'కెరియర్ డెవలప్‌మెంట్' అవార్డు దక్కింది.      » ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్లలో పరిశోధన నిమిత్తం జాతీయ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) ఆయనకు 5 లక్షల డాలర్లను అందించనుంది. 
ఫిబ్రవరి - 16 
¤ అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే దిగ్గజ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్‌కు అంతర్జాతీయ కార్యకలాపాల ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా పునీత్ రెంజన్(భారత్) నియమితులయ్యారు.      » ఈ పదవి దక్కించుకున్న తొలి భారతీయుడు పునీత్. ఈ ఏడాది జూన్ 1న బ్యారీ సాల్జ్‌బర్గ్ స్థానంలో ఈయన బాధ్యతలు చేపడతారు.      » హరియాణాలోని రోహ్‌తక్‌లో జన్మించిన పునీత్ హిమాచల్‌ప్రదేశ్‌లోని సానావర్‌లో ఉన్న లారెన్స్ పాఠశాలలో విద్యను అభ్యసించారు. తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. 
ఫిబ్రవరి - 18 
¤ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐసీటీ - ముంబయి) దిల్లీలో గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.      » ముకేష్ 1979లో ఐసీటీ (గతంలో యూడీసీటీగా ఉండేది) లోనే కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.      » ఐసీటీ నుంచి ఈ గౌరవాన్ని అందుకున్న నాలుగో వ్యక్తి అంబానీ. గతంలో భారతరత్న సి.ఎన్.ఆర్.రావు, ప్రొఫెసర్ జార్జ్ వైట్‌సైడ్స్, పద్మ భూషణ్ ప్రొఫెసర్ ఎం.ఎం.శర్మ మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు.¤ గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన పువ్వాడ వెంకటపతి అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం రెజిన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న యునిసిస్ ఫెడరల్ సిస్టమ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.      » సుమారు 20 వేల మంది ఉద్యోగులున్న యునిసిస్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. 
ఫిబ్రవరి - 20 
¤ అమెరికా 'డేటా సైంటిస్ట్' అధిపతిగా భారతీయ అమెరికన్ ధనుర్జయ్ పాటిల్ నియమితులయ్యారు. అమెరికా అధ్యక్ష భవనం 'శ్వేత సౌధం' ఈ పదవికి ఆయన్ని ఎంపిక చేసింది.      » శాస్త్రసాంకేతిక రంగాలపై విధానాల రూపకల్పనలో ప్రభుత్వానికి 'డేటా సైంటిస్ట్' సహాయపడుతుంది. 
ఫిబ్రవరి - 22
¤ సుమారు ఎనిమిది నెలల క్రితం అఫ్గానిస్థాన్‌లో అపహరణకు గురైన భారత్‌కు చెందిన క్రైస్తవ మత గురువు ఫాదర్ అలెక్సిస్ ప్రేమ్ కుమార్ ఎట్టకేలకు విడుదలయ్యారు.      » ప్రేమ్ కుమార్‌ను 2014 జూన్ రెండో తేదీన అఫ్గానిస్థాన్‌లోని హేరట్‌లో గుర్తుతెలియని సాయుధులు కొందరు అపహరించారు.
ఫిబ్రవరి - 23
¤ మైసూరు రాజవంశం వారసుడిగా యదువీర గోపాలరాజ అరసు అధికారికంగా ఎంపికయ్యాడు. ఆయనను మహారాణి ప్రమోదాదేవి దత్తత తీసుకున్నారు.      » 2013 డిసెంబరు 10న రాజవంశీయుడు శ్రీకంఠ దత్త నరసింహరాజు ఒడెయరు కన్నుయూయడంతో ఈ క్రతువు నిర్వహించారు.      » ఒడెయరు, ప్రమోదాదేవి దంపతులకు సంతానం లేదు. ఒడెయరు పెద్ద సోదరి గాయత్రీదేవి మనవడు యదువీర గోపాలరాజు అరసును మహారాణి ఉత్తత తీసుకున్నారు.      » యదువీర పేరును యదువీర కృష్ణదత్త చామరాజ ఒడెెయరుగా మహారాణి ప్రకటించారు.¤ రాజ్యసభ ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీఆజాద్ కొనసాగనున్నారు.      » జమ్ముకాశ్మీర్ నుంచి ఆయనతో పాటు ఎన్నికైన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)కి చెందిన మహ్మద్ ఫియాజ్, నజీర్ అమ్మద్ లావే, భాజపాకి చెందిన షంషేర్ సింగ్ మన్హాస్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.      » 65 ఏళ్ల ఆజాద్ ఎగువసభ సభ్యుడిగా కొనసాగడం ఇది అయిదోసారి. ఆజాద్‌ను ఫిబ్రవరి 16 నుంచి ప్రతిపక్ష నేతగా గుర్తిస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రకటించారు.¤ స్పైస్‌జెట్ అధికార పగ్గాలు అజయ్‌సింగ్ చేతికి వచ్చాయి. సంస్థలో మారన్ కుటుంబానికి చెందిన 58.6% వాటాఆయనకు బదిలీ అయింది. నాలుగేళ్ల క్రితం స్పైస్‌జెట్ నుంచి వైదొలిగిన సింగ్, మళ్లీ ఆ సంస్థకు అధిపతి కావడం గమనార్హం.
ఫిబ్రవరి - 24
¤ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని 'వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ బృందం' (ఐపీసీసీ)కు అధిపతిగా ఉన్న భారతీయుడు ఆర్.కె. పచౌరీ (74 సంవత్సరాలు) పదవి నుంచి వైదొలిగారు. ఒక మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించినట్లు పచౌరీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.      » ఐపీసీసీ పదవితో పాటు దేశంలోని 'ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్' (TERI) అధినేత పదవికి కూడా పచౌరీ రాజీనామా చేశారు.      » పచౌరీ 2007లో వాతావరణ అంశాలపై కృషి చేసినందుకు అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు అల్‌గోర్‌తో కలిసి నోబెల్ శాంతి బహుమతిని కూడా ఐపీసీసీ సంస్థ తరుఫున అందుకున్నారు.¤ జర్మనీలో పని చేస్తున్న భారతీయ యువ శాస్త్రవేత్త గురుమూర్తి కృష్ణమూర్తికి యూరోపియన్ పరిశోధక మండలి (ఈఆర్‌సీ) రూ.10.57 కోట్ల (15 లక్షల యూరోలు) నిధిని మంజూరు చేసింది.      » మల్టిపుల్ స్ల్కెరోసిస్ లాంటి స్వీయరోగ నిరోధక జబ్బుల్లో పేగుల్లోని బ్యాక్టీరియా పాత్రపై పరిశోధన చేయడానికి ఆయనకు ఈ మొత్తాన్ని అందజేసింది.      » గురుమూర్తి ప్రస్తుతం మ్యాక్స్‌ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరో బయాలజీలో బృందనేతగా పని చేస్తున్నారు. ఈఆర్‌సీ ప్రకటించిన నిధిని ఆయనకు అయిదేళ్ల కాలవ్యవధిలో అందజేస్తారు.
ఫిబ్రవరి - 26
¤ ఫోర్బ్స్ 50 మంది శక్తిమంతమైన వ్యాపార మహిళల జాబితాలో ఆరుగురు భారతీయ మహిళలకు చోటు దక్కింది.      » స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచ్చర్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ అఖిలా శ్రీనివాసన్, బయోకాన్ వ్యవస్థాపకులు కిరణ్ మజుందార్‌షా, యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శిఖా శర్మ, ఎల్ఐసీ ఎండీ ఆషా సంగ్వాన్‌లు జాబితాలో స్థానం సంపాదించారు.¤ అంతర్జాతీయంగా ఆటోమొబైల్ పరిశ్రమకు అందించిన సేవలకు టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాకు అమెరికాలోని క్లెమ్‌సన్ యూనివర్సిటీ ఆటోమోటివ్ ఇంజినీరింగ్ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.¤ 'కూచిపూడి కళాపీఠం' ఛైర్మన్‌గా కూచిభట్ల ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు.      » తెలుగు జాతికి పూర్వవైభవం తీసుకురావడంతో పాటు, సంస్కృతి సంప్రదాయలను, కళలను ప్రపంచవ్యాప్తం చేసే లక్ష్యంలో భాగంగా కృష్ణా జిల్లా కూచిపూడి సమీపంలో రూ.100 కోట్లతో వంద ఎకరాల్లో 'కూచిపూడి కళాపీఠం'ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
ఫిబ్రవరి - 28
¤ ఇంధన వనరుల సంస్థ (TERI) మాజీ అధినేత ఆర్.కె.పచౌరీ వాతావరణ మార్పులపై ప్రధాని నేతృత్వంలోని మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆమోదించారు.      » పచౌరీ 2007 నుంచి ప్రధాని నేతృత్వంలోని మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు.      » మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పచౌరీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.¤ భారత సంతతి న్యాయవాది కన్నన్ రమేష్ సింగపూరు సుప్రీంకోర్టు ధర్మాసనానికి న్యాయ కమిషనర్‌గా నియమితులయ్యారు.      » మే 22న బాధ్యతలు చేపట్టనున్న ఆయన రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారని సింగపూరు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment