జీవితాన్ని తేలిగ్గా తీసుకుని సీరియస్‌గా గడిపిన మేధావి బెంజమిన్ ఫ్రాంక్లిన్(Benjamin Franklin) - మహా మహులు



బెంజమిన్ ఫ్రాంక్లిన్
benjamin franklin కోసం చిత్ర ఫలితం


»   బెంజమిన్ ఫ్రాంక్లిన్   అమెరికా విప్లవంలో పాల్గొని అమెరికా దేశాన్ని మరియు రాజ్యాంగాన్ని స్థాపించిన విప్లవకారుల్లో ఒకరు.

»   బెంజమిన్ ఫ్రాంక్లిన్  జనవరి 17, 1706  బోస్టన్‌లో పుట్టారు. 

»   అమెరికాలో మొదట పదమూడు రాష్ట్రాలు ఉన్నట్లు, బెంజమిన్ ఫ్రాంక్లిన్ లో పదమూడు గొప్పదనాలు ఉండేవని ఆయన సమకాలీనులు అంటుండేవారు. శాస్త్రవేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు.. ఒక్క మాటలో బహుముఖ ప్రజ్ఞాశాలి. 

»   అయితే ఫ్రాంక్లిన్  ఆ ఒక్కమాటా ఒప్పుకునేవారు కాదు. కష్టపడి పనిచెయ్యడం తప్ప తనకింకేమీ తెలియదని చెప్పుకున్నారాయన!

»   ఫ్రాంక్లిన్ పదిహేడేళ్ల వయసులో బోస్టన్ వదిలి ఫిలడెల్ఫియా వెళ్లి, అక్కడి నుంచి మళ్లీ లండన్ వెళ్లి ముద్రణలో శిక్షణ పొందారు. తిరిగి ఫిలడెల్ఫియా వచ్చి సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నారు.  

»   ఆ తర్వాత పోస్టుమాస్టర్‌గా ఉద్యోగం. విద్యుత్‌పై ప్రయోగాలు. తర్వాత పెన్సిల్వేనియా అసెంబ్లీకి ప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఐదేళ్లకు అమెరికన్ ఫిలసాఫికల్ సొసైటీ అధ్యక్షుడయ్యారు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన ఏడాదే ఫ్రాన్సుకు అమెరికన్ కమిషనర్‌గా ఎంపికయ్యారు.

»   ఈయన కనిపెట్టిన వాటిలో "ఛత్వారపు కళ్ళద్దాలు", "ఓడొమీటర్ (ప్రయాణించిన దూరాన్ని సూచించేది)" మొదలగునవి చాలనే వున్నాయి. ప్రాంక్లిన్ "మొదటి అమెరికన్" అనే బిరుదుని కూడా పొందాడు.

»    బెంజమిన్ ఫ్రాంక్లిన్  ఏప్రిల్ 17, 1790 ఫిలడెల్ఫియాలో మరణించారు.

»   జీవితాన్ని తేలిగ్గా తీసుకుని సీరియస్‌గా గడిపిన అసాధారణ ప్రతిభా సంపన్నుడు, మేధావి బెంజమిన్ ఫ్రాంక్లిన్ 




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment