చాద్
» చాద్ దేశం అసలు పేరు చాద్ గణతంత్రం ("రిపబ్లిక్ ఆఫ్ చాద్") , మధ్య ఆఫ్రికా లోని ఒక భూపరివేష్టిత దేశం. |
» ఆఫ్రికాలోని రెండవ పెద్ద సరస్సు చాద్. ఆ సరస్సు పేరుమీదగానే చాద్ దేశం ఏర్పడినది. చాద్ దేశాన్ని అధికారికంగా 'రిపబ్లిక్ ఆఫ్ చాద్' అని పిలుస్తారు. చాద్ మధ్య ఆఫ్రికాలో ఉన్నది. ఈ దేశానికి సముద్ర తీరం లేదు. |
» ఉత్తరాన లిబియా, తూర్పున సూడాన్, దక్షిణాన 'సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్' ఉన్నాయి. అలాగే, కామెరూన్ మరియు నైగర్ కూడా చాద్ తో సరిహద్దుగల దేశాలు. |
» సముద్ర ప్రాంతానికి దూరంగా ఉండటం వలన, ఈ దేశంలో ఎడారి వాతావరణం ఉంటుంది. చాద్ దేశం భౌగోళికముగా మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు-1) ఉత్తరాన ఎడారి ప్రాంతము, 2) మధ్య ప్రాంతములో నిస్సారమయిన 'సహెలీయన్' ప్రాంతము మరియు 3) దక్షిణాన సారవంతమయిన సుడాన్-సవన్నా ప్రాంతము. చాద్ లో పెద్ద నగరం 'ఎన్-జమీరా'. |
» దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికి, అధికారం మాత్రం అధ్యక్షుడు డెబె మరియు అతని రాజకీయ పార్టీ "దేశభక్త విముక్తి ఉద్యమం" (PATRIOTIC SALVATION MOVEMENT) చేతుల్లోనే కేంద్రీకృతమయి ఉన్నది. |
» చాద్ ఇప్పటికి అతి బీద దేశాలలో ఒకటి మరియు ఇక్కడ అవినీతి ప్రపంచలో కెల్లా ఎక్కువట. ఎక్కువమంది ప్రజలు దుర్భర దరిద్రంలో గొడ్లు కాచుకుంటూనో, వ్యవసాయం చేసుకుంటూనో చాలీ చాలని జీవితాలను గడుపుతున్నారు. |
» 1920లో ఈ దేశాన్ని ఫ్రాన్స్ ఆక్రమించి తమ 'ఫ్రెంచి ఈక్విటోరియల్ ఆఫ్రికా' వలస ప్రాంతములో కలుపుకున్నది. ప్రాంకొయిస్ టొమ్బలబయ నాయకత్వంలో, చాద్ 1960 స్వాతంత్రము సాధించుకున్నది. |
» 1979 సంవత్సరములో విప్లవకారులు రాజధాని నగరాన్ని ఆక్రమించి, ఎంతో కాలం బట్టి జరుగుతున్న దక్షిణప్రాంతవాసుల పరిపాలనకు చరమ గీతం పాడారు. |
» చాద్ రాజ్యాంగము ప్రకారము అధ్యక్షునికి ఎనలేని అధికారాలు ఉన్నాయి, ఆయన రాజకీయాలలో ముఖ్య పాత్ర వహిస్తారు. అధ్యక్షుడు, ప్రధానమంత్రిని, అతని కాబినెట్ లో మత్రులను నియమిస్తాడు. అంతేకాదు, మిలిటరి జనరల్స్, న్యాయమూర్తులను మరియు ఇతర అధికారుల నియామకాలలో ఎంతో కీలక పాత్ర వహిస్తాడు. దేశంలోని పరిస్తితులు బాగాలేనప్పుడు, శాంతి భద్రతలకు తావ్ర విఘాతం ఏర్పడినప్పుడు, అధ్యక్షుడు జాతీయ అసెంబ్లీ ని సంప్రదించి, అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. |
» అధ్యక్షుణ్ణి, ప్రజలే ఐదు సంవత్సరాల పదవీకాలానికి ఎన్నుకోవటం జరుగుతుంది. అధ్యక్షుడు రెండు సార్లకన్నా ఎన్నిక కాకూడదనే నియమం ఇదువరకు ఉండేది కాని, 2005 సంవత్సరములో ఈ నియమాన్ని తొలగించారు. అంటే ఒక వ్యక్తి ఎన్ని సార్లయినా అధ్యక్షుడిగా ఎన్నిక కావచ్చును. |
» అంతర్జాతీయ అవినీతి కొలత పద్దతులు-2005 ప్రకారం, చాద్ ప్రపంచంలోకెల్లా ఎక్కువ అవినీతి గల దేశము. |
చాద్ దేశం అసలు పేరు
: రిపబ్లిక్ ఆఫ్ చాద్ - జమ్-హూరియత్
త్‌షాద్ రిపబ్లిక్ డు ట్‌చాద్ |
చాద్ నినాదం : "Unité, Travail, Progrès" ("ఏకత్వం, పని, ప్రగతి") |
చాద్ జాతీయగీతం : లా చాదియెన్ని |
చాద్ రాజధాని : నద్‌జమేనా |
చాద్ అధికార భాషలు : ఫ్రెంచ్, అరబ్బీ |
చాద్ ప్రభుత్వం : గణతంత్రము |
చాద్ రాష్ట్రపతి : ఇద్రీస్ దేబి |
చాద్ ప్రధానమంత్రి : దెల్వా కసీరె కౌమకోయె |
చాద్ స్వాతంత్ర్యం : ఫ్రాన్స్ నుండి ఆగస్టు 11 1960 |
చాద్ విస్తీర్ణం : మొత్తం 1,284,000 కి.మీ² (21వది) |
చాద్ జనాభా : 2005 అంచనా 10,146,000 (75వది) |
చాద్ జీడీపీ : మొత్తం $15.260 బిలియన్లు |
చాద్ కరెన్సీ : మధ్య ఆఫ్రికా ఫ్రాంక్ (XAF |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment