»బిల్ గేట్స్ అసలు పేరు మూడవ విలియం హెన్రీ గేట్స్, మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత మరియు గొప్ప దాత. |
»కంప్యూటర్లను సామాన్యులకు అందుబాటులో తెచ్చిన వ్యక్తిగా బిల్ గేట్స్ ఎంతో పేరు పొందాడు. |
»బిల్ గేట్స్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు. |
»బిల్ గేట్స్ అక్టోబర్ 28 1955 న వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్‌లో ఒక ధనవంతులు కుటుంబంలో జన్మించాడు |
»మిత్రుడు పాల్ అల్లెన్‌తో కలసి కంప్యూటర్ లాంగ్యేజి అయిన బేసిక్(BASIC) నేర్చుకొని అందులో ప్రోగ్రాములు రాయడం మొదలు పెట్టాడు. 14 ఏళ్ళ వయసులో పాల్ అల్లెన్‌తో కలసి ట్రాఫిక్ లెక్కించే ప్రాసెసర్‌కు సంభందించిన ప్రోగ్రాములు రాసి అమ్మడం మొదలు పెట్టాడు. మొదటి ఏడాది 20,000 డాలర్లు సంపాదించినా, బిల్ గేట్స్ వయసు 14 అన్న విషయం తెలిసి వ్యాపారం తగ్గుముఖం పట్టింది. |
»1975లో MITS అనే మైక్రోకంప్యూటర్ సంస్థకి అవసరమయిన సాఫ్ట్‌వేర్ తాము అందించగలమని బిల్ గేట్స్ తెలిపి, తర్వాత ఆ సంస్థ కార్యాలయములో తమకు తెలిసినవి చూపించడంతో ఇద్దరితో ఆ సంస్థ ఒప్పందం ఏర్పాటు చేసుకుంది . మొదట మైక్రో-సాఫ్ట్ అని పేరు పెట్టినా, ఏడాది తర్వాత మైక్రోసాఫ్ట్ అన్న పేరు నమోదు చేయించారు |
»MITS సంస్థవారు బిల్ గేట్స్ అందిస్తున్న బేసిక్ కోడ్‌ను ఉపయోగించడం మాత్రమే కాకుండా ఆ కోడ్‌ను కాపీ కొట్టి వాడుతుండడం తెలిసిన బిల్ గేట్స్ ఆ సంస్థతో భాగస్వామ్యం రద్దు చేసుకొని స్వతంత్రుడయ్యాడు |
»బిల్ గేట్స్ 1980 వరకు సంస్థ వ్యాపార వ్యవహారలన్నీ చూసుకోంటూనే ప్రోగ్రాములు రాసేవాడు. 1980లో ఐ.బి.ఎం(IBM) సంస్థవారు తాము తయారు చేయబోయే పర్సనల్ కంప్యూటర్‌లకు అవసరమయిన BASIC interpreter కోసం బిల్ గేట్స్‌తో చర్చిస్తూ, ఒక మంచి ఆపరేటింగ్ సిస్టం కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.అపుడు బిల్ గేట్స్ తనకు తెలిన SCP అనే సంస్థ తయారు చేసే 86-DOS ఆపరేటింగ్ సిస్టం లైసెన్సు తీసుకొని IBM కు అమ్మడం మొదలు పెట్టాడు. కొన్నాళ్ళకు SCPని కొని ఎం.ఎస్.డాస్(MS-DOS)ఆపరేటింగ్ సిస్టంగా ఐ.బి.ఎం సంస్థ కు అందించేలా ఒప్పందం చేసుకున్నాడు. |
»బిల్ గేట్స్ భార్య పేరు మెలిండా. వారికి ముగ్గురు పిల్లలు. 2000 సంవత్సరంలో బిల్ గేట్స్ తన భార్యతో కలసి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎయిడ్స్ నిర్మూలన, మూడవ ప్రపంచ దేశాలల్లో అంటువ్యాధుల నిర్మూలన, పేదవారికి విద్య మొదలయిన సేవలకు ధన సహాయం చేస్తున్నాడు. బిల్ గేట్స్ ఇచ్చిన కొన్ని విరాళాలు: ($1 మిలియన్ = $1,000,000) |
»ముప్పై సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌ని స్థాపించి చరిత్రలో నిలిచిపోయిన బిల్‌గేట్స్ ఆ సంస్థ బాధ్యతలనుంచి తాను స్థాపించిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్‌కు పూర్తికాలం వినియోగించే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్‌లో తన కార్యకలాపాలకు 28 జూన్, 2008 న వీడ్కోలు పలికారు. |
బిల్ గేట్స్(Bill Gates) - ముఖ్యమైన వ్యక్తులు - జీవిత చరిత్ర
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment