పోలాండ్
» పోలాండ్ పూర్తి పేరు రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్. ఇది మధ్య ఐరోపాలోని ఒక దేశం. పోలాండ్ కి పశ్చిమ దిశలో జర్మనీ, దక్షిణ దిశలో చెక్ రిపబ్లిక్ మరియు స్లొవేకియా, తూర్పున ఉక్రెయిన్, బెలారస్, లిథువేనియాలు, ఉత్తరాన బాల్టిక్ సముద్రం ఉన్నాయి. |
» 966వ సంవత్సరంలో మొదటి మీజ్కో మహారాజు క్రైస్తవ మతాన్ని స్వీకరించడంతో పోలాండ్ రాజ్యం అవతరించింది. 10వ శతాబ్దం నుండి తన ఉనికిని చాటుకుంటూ వస్తున్న పోలెండ్ దేశం అనేక శతాబ్దాలపాటు వలసవాదుల అధిపత్యంలో మగ్గింది. దేశ సరిహద్దులు బలహీనంగా ఉండడం వల్ల ఇతర దేశాల వాళ్లు చాలా సులువుగా దేశంలోకి ప్రవేశించేవారు. |
» హిట్లర్ సేనలు పోలెండ్‌ను తన అధీనంలోకి తీసుకొని రెండో ప్రపంచ యుద్ధం దాకా అధిపత్యాన్ని కొనసాగించింది. పోలిష్ హోమ్ ఆర్మీ ప్రాణాలకు తెగించి దేశాన్ని తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకుంది. |
» 1025వ సంవత్సరంలో రాజ్యంగా మారిన పోలాండ్, 1569లో లిథువేనియాతో కలిసి పాలిష్-లిథువేనియన్ కామన్వెల్త్ నెలకొల్పింది. |
» రెండవ ప్రపంచ యుద్ధంలో అరవై లక్షలకు పైగా పౌరులను కోల్పోయిన పోలాండ్ ఆ తర్వాత సోవియట్ యూనియన్ ప్రభావిత సోషలిస్ట్ రిపబ్లిక్ గా రూపాంతరం చెందింది. |
» 1989లో కమ్యూనిస్ట్ పాలన తరువాత పోలాండ్ రాజ్యాంగబద్ధంగా "మూడవ పాలిష్ రిపబ్లిక్"గా రూపాంతరం చెందింది. |
» ఇక్కడ మత సహనం అధికం. ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. స్త్రీ, పురుష సమానత్వాన్ని పాటిస్తారు. దాదాపు 98 శాతం ప్రజలు పోలిష్ భాషను మాట్లాడతారు. |
» పోలాండ్ ఐరోపాలో 9వ అతిపెద్ద దేశం మరియు ప్రపంచంలోనే 69వ అతిపెద్ద దేశం. జనాభా లెక్కల రీత్యా చూసినట్లయితే, 3.8 కోట్ల జనాభాతో పోలాండ్ ప్రపంచంలో 33వ అతిపెద్ద దేశంగా ఉంది. |
» పోలెండ్ దేశంలో దాదాపు 3000 సరస్సులు ఉన్నాయి. దేశానికి ఉత్తర భాగంలో స్లోవెన్‌స్కీ జాతీయ పార్కులో స్లోవిన్‌స్కీ ఇసుక తిన్నెలు దర్శనమిస్తాయి. ఎవరో తీర్చిదిద్దినట్లుగా కనబడే ఈ ఇసుక తిన్నెలు చూపరులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి. |
» పోలెండ్ దేశంలో ఉన్న అత్యంత పురాతన నగరాలలో క్రాకోవ్ నగరం ఒకటి. ఇది విస్తులా నదీతీరంలో నిర్మింపబడింది. 1978లో ఈ నగరాన్ని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటించింది. |
» వార్సా పోలెండ్ దేశానికి రాజధాని నగరం. ఐరోపా దేశాలలో గొప్ప టూరిస్ట్ నగరంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా లక్షలాది మంది ఈ నగర సందర్శనకు వస్తూ ఉంటారు. నగరం మధ్య నుండి విస్తులా నది పారుతూ ఉంటుంది. |
» పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని 16 ప్రాంతాలుగా విభజించారు. ప్రాంతాన్ని పోలెండ్ భాషలో ‘వైవోడేషిప్’ అంటారు. ఈ 16 ప్రాంతాలను తిరిగి 379 పోవియట్‌లుగా, వీటిని మళ్ళీ 2478 జిమినాస్‌లుగా విభజించారు. దేశంలో మొత్తం 20 పెద్ద నగరాలు, పట్టణాలు ఉన్నాయి |
పోలాండ్ పూర్తి పేరు : రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్ |
పోలాండ్ జాతీయగీతం : Mazurek Dąbrowskiego (Dąbrowski's Mazurka, or "Poland Is Not Yet Lost") |
పోలాండ్ రాజధాని : వార్సా |
పోలాండ్ అధికార భాషలు : పోలిష్ |
పోలాండ్ ప్రభుత్వం : పార్లమెంటరీ రిపబ్లిక్ |
పోలాండ్ రాష్ట్రపతి : Bronisław Komorowski |
పోలాండ్ ప్రధానమంత్రి : Ewa Kopacz |
పోలాండ్ జనాభా : 38,116,000 |
పోలాండ్ జీడీపీ : మొత్తం $420.284 బిలియన్ |
పోలాండ్ కరెన్సీ : Złoty (PLN) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment