అలెగ్జాండర్ గ్రాహంబెల్
»టెలిఫోన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రాహంబెల్.
»గ్రహంబెల్ మార్చి 3, 1847 న స్కాట్‌లాండ్ లోని ఎడిన్‌బర్గ్ లో జన్మించడం జరిగింది. ఆయన బాల్య జీవితమంతా బ్రిటీష్ పౌరుడిగానే గడిచింది. ఆయనకు ఇద్దరు సోదరులు మెల్విలే జేమ్స్ బెల్, ఎడ్వర్డ్ చార్లెస్ బెల్. వీరిరువురూ క్షయ వ్యాధితో మరణించారు. ఆయన తండ్రి ప్రొఫెసర్ అలెగ్జాండర్ మెల్విలే బెల్. తల్లి పేరు ఎలీజా గ్రేస్.
»ప్రాథమిక విద్యను తండ్రి వద్దే అభ్యసించిన గ్రాహంబెల్ ఎడింబరోలోని రాయల్ హైస్కూల్లో చదువుకుని, పదహారేళ్లకల్లా అక్కడే వక్తృత్వం, సంగీతాలను నేర్పించే పనిలో చేరాడు. తల్లి క్రమేణా వినికిడి శక్తిని కోల్పోవడంతో ఆమెతో మాట్లాడే క్రమంలో సంజ్ఞలతో భావ వ్యక్తీకరణలో ఆరితేరాడు. ఆమె నుదిటి ఎముకకు దగ్గరగా ఒక రకమైన ఉచ్ఛారణతో మాట్లాడే ప్రయత్నంలో ధ్వని శాస్త్రాన్ని (Acoustics) అర్థం చేసుకున్నాడు.
»ఎడింబరో విశ్వవిద్యాలయంలో ధ్వని, వినికిడి శాస్త్రాలు చదివి అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో 'గాత్ర సంబంధిత శరీర శాస్త్రం' (వోకల్ ఫిజియాలజీ)లో ప్రొఫెసర్‌గా చేరాడు.
»గ్రాహంబెల్‌రూపొందించిన ఆ టెలిఫోన్ ఈనాడు నిత్యావసర వస్తువుల జాబితాలో చేరింది. అలెగ్జాండర్ గ్రాహంబెల్ 1922వ సంవత్సరంలో కెనడా లో స్వర్గస్తులయ్యారు.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment