ఒమన్(Oman)- ప్రపంచ దేశాల సమాచారం - ప్రతి రోజు ఒక దేశం గురించిన సమాచారం.

ఒమన్ 
oman map కోసం చిత్ర ఫలితం

¤  ఒమన్ పూర్తి పేరు సుల్తనత్ ఆఫ్ ఒమన్ , నైఋతి ఆసియాలో అరేబియా సముద్రము తీరాన ఉన్న దేశము. దీనికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, యెమెన్ దేశాలతో సరిహద్దులున్నాయి.

oman కోసం చిత్ర ఫలితం
¤  ఒమన్ జనాభా 25 లక్షల పైచిలుకు ఉంటుంది .
¤  క్రీ.శ. 1వ శతాబ్దంనుండి అరబ్బులు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. అప్పటినుండి ఒమన్ అరబ్బుల అధీనంలో ఉంది. ఒకప్పుడు ఒమన్ సుమేరియన్ భాషాపదమైన మాగన్ అనే పేరుతో పిలువబడేది.  


oman కోసం చిత్ర ఫలితం
¤  క్రీ.శ.751లో ఇబాదీ ముస్లిములు ఒమన్‌లో ఒక ఇమామత్ నెలకొలిపారు.1508లో మస్కట్ నౌకాశ్రయాన్ని పోర్చుగీసువారు ఆక్రమించారు. కాని 1650లో స్థానికులు వాళ్ళను వెళ్ళగొట్టారు. 
¤  1659లో ఒట్టొమన్ సామ్రాజ్యం ఒమన్‌ను ఆక్రమించింది. 1741లో వారిని ఓడించి సుల్తాన్ అహ్మద్ బిన్ సయిద్ రాజ్యపాలన ప్రాంభించాడు. అప్పటినుండి ఇప్పటివరకూ అదే సుల్తానుల వంశపాలన సాగుతున్నది. 

oman king కోసం చిత్ర ఫలితం
¤   1970లో సుల్తాన్ బిన్ సయ్యిద్ అస్‌ సయ్యిద్  తన తండ్రి "సయ్యిద్ బిన్ తైమూర్"ను అధికారంనుండి తొలగించి అధికారంలోకి వచ్చాడు. అప్పటినుండి ఒమన్ ఆర్ధిక, సామాజిక రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించింది.
¤  ఒమన్‌కు ప్రత్యేకంగా రాజ్యాంగమంటూ లేదు. వివిధ రాజాజ్ఞలే పరిపాలనకు మౌలిక విధానాలు. అలాగే రాజకీయ పార్టీలు కూడా లేవు. ఒక్కొక్క 'విలాయత్'‌కు సుల్తానుచే నియమింపబడ్డ ఒక్కొక్క 'వాలీ' ఉంటాడు. ఇతను స్థానిక పరిపాలనకు బాధ్యుడు.

¤  2003లో ప్రప్రధమంగా "మజ్లిస్ అస్-షూరా"ను సార్వజనిక వోటు విధానం ద్వారా ఎన్నుకొన్నారు. మొత్తం జనాభాలో 74% వరకు (190,000 మంది) తమ వోటు హక్కును వినియోగించుకొన్నారు. ఎన్నికైన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

¤  పాలనాపరంగాను, కొంతవరకు భౌగోళికంగాను ఒమన్ను 5 ప్రాంతాలు ("మింతకా"లు) గాను, మూడు గవర్నరేట్‌లు గాను విభజించారు. ఒక్కో ప్రాంతం మరికొన్ని "విలాయత్"లు (జిల్లాల వంటివి)గా విభజింపబడింది.
oman కోసం చిత్ర ఫలితం
¤  దేశ రాజధాని నగరము మస్కట్ .  ఇందులోని జిల్లాలు మస్కట్-ముత్రా, రువి, బౌషర్, సీబ్, కురియాత్, అమరాత్ .


oman కోసం చిత్ర ఫలితం
¤  ఒమన్ జనాభాలో అత్యధికులు అరబ్బులు, ముస్లిములు. అధికంగా ఇబాదీ ముస్లింలు. అరబ్బులు కాని ముస్లిములు కూడా ఉన్నారు.

oman కోసం చిత్ర ఫలితం
¤  ఒమన్ ఆర్ధిక వ్యవస్థ ప్రధానంగా పెట్రోలియమ్ ఉత్పత్తులపై ఆధారపడింది. అయితే చారిత్రకంగా ఒమన్ ఆర్ధిక వ్యవస్థలో ప్రధాన అంశాలైన చేపలు పట్టడం, ఖర్జూర సాగు, వ్యాపారం, గొర్రెలు, ఒంటెల పెంపకం వంటివాటిని ప్రజలు ఏ మాత్రం విడనాడలేదు. 
¤  ప్రస్తుతం ఒమన్ రోజుకు 7,00,000 బ్యారెళ్ళ (1,10,000 ఘనపుటడుగులు) క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నది. ఒమన్‌లో షుమారు 350,000 మంది భారతీయులు ఉన్నారు
oman కోసం చిత్ర ఫలితం
¤  ఒమన్ మధ్యభాగం చాలావరకు విశాలమైన ఎడారి. తీర ప్రాంతంలో వందల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న పర్వత శ్రేణులు ఉన్నాయి.'జబల్ అఖ్దర్' 'జబల్ షామ్స్' అనేవి వీటిలో ఎత్తైన భాగాలు. ఈ పర్వత శ్రేణులకు, తీరానికి మధ్యలో ముఖ్యమైన నగరాలు (మస్కట్, సలాలా, సూర్ వంటివి) ఉన్నాయి. 'అల్ హజర్' అనబడే పర్వత శ్రేణులు 'దఖిలియా'ను 'బాతినా' తీరంనుండి వేరు చేస్తున్నాయి. బాతినా తీరం సారవంతమైన మైదాన ప్రాంతం. ఖర్జూరం, కూరగాయల పంటలకూ, పశువుల పెంపకానికీ బాతినా ప్రాంతం అనువైనది.

oman flag కోసం చిత్ర ఫలితం
ఒమన్ పూర్తి పేరు :  సుల్తనత్ ఆఫ్ ఒమన్ 
ఒమన్ జాతీయగీతం :  నషీద్ అస్-సలామ్ అస్-సుల్తానీ
ఒమన్ రాజధాని  : మస్కట్
ఒమన్ అధికార భాషలు  :   అరబిక్
ఒమన్ ప్రభుత్వం   :  సంపూర్ణ్ణ రాజరిక వ్యవస్థ
ఒమన్ సుల్తాన్  :   కాబూస్ బిన్ సైయద్ అల్ సయిద్
ఒమన్ స్వతంత్ర దేశం
 -  పోర్చుగీస్ వారిని వెడలగొట్టడం  : 1650 
ఒమన్ విస్తీర్ణం :   మొత్తం 3,100,000 కి.మీ² (70వ స్థానం)
ఒమన్ జనాభా :   జూలై 2005 అంచనా 2,567,0001 (140వ స్థానం)
ఒమన్ జీడీపీ : మొత్తం $40.923 బిలియన్ (85వ స్థానం)
ఒమన్ కరెన్సీ  : ఒమని రియాల్ (OMR)
oman currency కోసం చిత్ర ఫలితం

oman currency కోసం చిత్ర ఫలితం
oman currency కోసం చిత్ర ఫలితం
oman currency కోసం చిత్ర ఫలితం
oman currency కోసం చిత్ర ఫలితం

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment