జీనియస్ పవర్ బ్యాంక్... మీ స్మార్‌టఫోన్‌లకు తక్షణ శక్తి బ్యాటరీ చార్జింగ్ సమస్యలకు పరిష్కారాన్ని వెతికే క్రమంలో, కంప్యూటర్ ఉపకరణాలు అలానే స్మార్‌టఫోన్ సంబంధిత ఉత్పత్తులను తయారు చేసే ప్రముఖ కంపెనీ జీనియస్ ఇకో - యూ306 పేరుతో అధిక సామర్థ్యం కలిగి పవర్ బ్యాంక్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. జీనియస్ పవర్ బ్యాంక్... మీ స్మార్‌టఫోన్‌లకు తక్షణ శక్తి ఈ అతి పలుచటి నాజూకు శ్రేణి పవర్ బ్యాంక్ 3000 ఎమ్‌ఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని కలిగి ఉంటుంది. బ్లాక్, వైట్, బ్లూ ఇంకా పింక్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతున్న ఈ పవర్ బ్యాంక్ ధర రూ.2,000. జీనియస్ పవర్ బ్యాంక్... మీ స్మార్‌టఫోన్‌లకు తక్షణ శక్తి ప్రత్యేకమైన మైక్రోయూఎస్బీ కేబుల్ వ్యవస్థను ఈ పవర్ బ్యాంక్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ పవర్ బ్యాంక్‌ను ముందుగా పూర్తిస్థాయిలో చార్‌జ చేసుకున్నట్లయితే స్మార్‌టఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీలకు బ్యాటరీ శక్తి అవసరమైనపుడు ఈ పవర్ బ్యాంక్‌ను యూఎస్బీ కేబుల్ సాయంతో అనుసంధానించుకుని సదరు గాడ్జెట్‌లను నిమిషాల వ్యవధిలో చార్‌జ చేసుకోవచ్చు.
పవర్ బ్యాంక్‌తో పరిష్కారం:
మీకేదో హఠాత్తుగా పని పడింది. హడావిడిగా బస్సు ఎక్కి మరో ఊరికి వెళ్లిపోయారు. బిజీలో సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టే సంగతే మరిచిపోయారు. బస్సు దిగగానే.. ఫోన్ చేయాల్సిన వాళ్లకు కాల్ చేద్దామంటే.. లో బ్యాటరీ. కాల్ కొట్టేలోపు స్విచ్ఛాప్. మళ్లీ మళ్లీ ఆన్ చేసినా.. లాభం లేదు. ఒక్క నిమిషం ఫోన్ మూగబోయిందంటే.. ఒక్క పనీ ముందుకు సాగదు. అదే మీ చేతిలో పవర్ బ్యాంక్ ఉంటే.. చిటికెలో పరిష్కారం దొరుకుతుంది. ఛార్జి లేక అల్లాడిపోతున్న మీ సెల్‌ఫోన్‌ను రీఛార్జి చేసేస్తుంది. ఆపద్భాంధవునిలా ఆదుకొనే ఆ పవర్‌బ్యాంక్ కొనేముందు ఓ లుక్కేయండి..
గాడ్జెట్ షాపుల్లోకో, చైనా బజార్‌లలోకో వెళితే కుప్పలు తెప్పలుగా పవర్‌బ్యాంక్‌లు కనిపిస్తాయి. అందులో దేన్ని కొనాలి? కంపెనీ చూశా? కెపాసిటీని పరిశీలించా? లేదంటే తక్కువ రేటున్నదా?దేన్ని తీసుకోవాలి. కాసింత కన్‌ఫ్యూజన్ వస్తుంది.
రేటు తక్కువనో, భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారనో కొనేవి కావు ఎలక్ర్టనిక్ గాడ్జెట్‌స. వాటికో లెక్క ఉంది. అవసరమైన తప్పక తెలుసుకోవాల్సిన సమాచారం ఉంది.
ఎలాంటి సమాచారం కావాలి:
పవర్‌బ్యాంక్‌లు కొనేటప్పుడు ఎలాంటి సమాచారాన్ని తెలుసుకోవాలో చూద్దాం. సెల్‌ఫోన్ పనిచేయడానికి బ్యాటరీ కీలకం అన్నది మనకు తెలుసు. పవర్‌బ్యాంక్‌లను కొనేముందు సెల్‌ఫోన్ బ్యాటరీల సామర్థ్యం గురించి కొంత తెలుసుకోవాలి. ఇప్పుడు సెల్‌లకు వాడుతున్న బ్యాటరీలు రెండు రకాలు. ఒకటి - లీథియం ఇయాన్. రెండు - లిథియం పాలిమర్. మొదటి రకం బ్యాటరీ పాతకాలం నుంచి వస్తున్నది. దీనిది సిలిండ్రికల్ షేప్. ఇప్పటికీ బాగా పాపులర్. ధర కూడా తక్కువ. ఇక, రెండోది అడ్వాన్‌సడ్ బ్యాటరీ. అల్యూమినియమ్ ప్లాస్టిక్ కేసింగ్ కలిగి ఉంటుంది.
బరువు తక్కువ. పనితీరు భేష్. సురక్షితమైన ఫీచర్లు బోలెడు. అయితే మొదటి బ్యాటరీ కంటే కాస్త ఖరీదు ఎక్కువ. ఈ రెండు రకాల బ్యాటరీల ఎనర్జీ ఎఫిషియన్సీని ఎంఎహెచ్ (మిల్లీ యాంప్-అవర్‌స) లలో కొలుస్తారు. అంటే - శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 4 సెల్‌ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 2,600 ఎం ఎ హెచ్. ఇక, ఐ ఫోన్ బ్యాటరీ అయితే - 1,450 ఎం ఎ హెచ్. మార్కెట్‌లోకి కొత్త వెర్షన్‌లు విడుదల అవుతున్న కొద్దీ బ్యాటరీల కెపాసిటీ పెరుగుతుంటుంది. సెల్ బ్యాటరీలను బట్టి.. ఎలాంటి పవర్‌బ్యాంక్‌లను కొనాలో చూద్దాం.
గాడ్జెట్ షాపుల్లోకో, చైనా బజార్‌లలోకో వెళితే కుప్పలు తెప్పలుగా పవర్‌బ్యాంక్‌లు కనిపిస్తాయి. అందులో దేన్ని కొనాలి? కంపెనీ చూశా? కెపాసిటీని పరిశీలించా? లేదంటే తక్కువ రేటున్నదా? దేన్ని తీసుకోవాలి. కాసింత కన్‌ఫ్యూజన్ వస్తుంది. అప్పుడు మీరు గుర్తించాల్సింది మీ సెల్‌ఫోన్ కెపాసిటీ ఎంత అని. దాన్ని బట్టి పవర్‌బ్యాంక్‌ను ఎంపిక చేసుకుంటే బెటర్.
ఉదాహరణకు - మీది శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 3 మొబైల్ అనుకుందాం. దాని బ్యాటరీ 2,100 కెపాసిటీ ఎం ఎ హెచ్. అంటే మీరు ఆ కెపాసిటీకి రెండింతలు వీలైతే మూడింతలు 4,200 లేదా 6,300 ఎం ఎ హెచ్ సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంక్ కొనాలన్న మాట. ఒక్కసారి ఈ పవర్‌బ్యాంక్‌ను ఫుల్లుగా ఛార్జి చేసుకుంటే.. మీ సెల్‌ఫోన్‌కు రెండు మూడుసార్లు ఎంచక్కా ఛార్‌జ చేసుకోవచ్చు. అయితే ఈ ఛార్జింగ్ అనేది కూడా సెల్‌ఫోన్‌లను బట్టి ఉంటుంది. సెల్ క్వాలిటీ, సెల్ ఆక్చువల్ కెపాసిటీ, సెల్ పిసిబి బోర్‌డ డిజైన్, రిలయబిలిటీల మీద ఆధారపడి ఉంటుంది అని టెక్ నిపుణులు చెబుతున్నారు.
పవర్ బ్యాంక్ కొనేముందు:
పవర్‌బ్యాంక్‌లు కొనేముందు గమనించాల్సిన రెండో ముఖ్య విషయం - యూప్‌సబి పోర్టులు. మీ పవర్‌బ్యాంక్ కెపాసిటీ ఎక్కువే కావొచ్చు. కాని దానికి కేవలం ఒకే ఒక్క యూప్‌సబి (లేదా పోర్‌ట) ఉందనుకోండి. ఒక సమయంలో ఒకే సెల్‌ఫోన్‌కు ఛార్జి చేసుకోవచ్చు. అంతే! అసలు పవర్‌బ్యాంక్ కొనేదే అర్జంట్‌గా ఛార్జి చేసుకోవడానికి కదా! కాబట్టి దానికి రెండు లేదా మూడు పోర్టులు ఉంటేనే మంచిది అన్న సంగతిని గుర్తించాలి.
ఓ.వి.పి. సదుపాయం:
కరెంటు లేని ప్రదేశాలకు వెళ్లినప్పుడు కేవలం సెల్‌ఫోన్‌కు ఒక్కటే కాదు.. మీ ఐపాడ్‌కు కెమెరాకు ఛార్జి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఇక, పవర్‌బ్యాంక్‌ల ఎంపికలో మూడో ప్రాధాన్యం - ఈ మూడు ఫీచర్‌సకు ఇవ్వాలి. ఒకటి - ఒ వి పి. అంటే ఓల్టేజ్ ప్రొటెక్షన్. మన దగ్గర కరెంట్ కోతల మాట అటుంచితే ఓల్టేజ్ హెచ్చుతగ్గుల సమస్య మాత్రం ఉండనే ఉంది. పవర్‌బ్యాంక్‌లను ఛార్జి చేస్తున్నప్పుడు హఠాత్తుగా కరెంటు ఎక్కువ తక్కువలు అయ్యిందనుకోండి. నాసిరకం బ్యాంక్ అయితే టప్‌మని పేలిపోయే ప్రమాదం లేకపోలేదు. అదే ఒ వి పి సదుపాయం ఉంటే ఈ పరిస్థితి రాదు. ఇలాంటిదే మరొకటి.. ఒ సి పి. అంటే ఓవర్ ఛార్‌జ ప్రొటెక్షన్.
పవర్‌బ్యాంక్‌కు ఛార్జి పెట్టి.. మరచిపోవడం సహజం. గంటలు గడిస్తే వేడెక్కి పగిలిపోనూ వచ్చు. అదే కనక ఒ సి పి సదుపాయం పవర్‌బ్యాంక్‌లో ఉంటే.. ఛార్జి అయిన వెంటనే దానంతట అదే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. ఇక ఒ టి పి - ఓవర్ టెంపరేచర్ ప్రొటెక్సన్ సంగతికొస్తే.. మన దగ్గర వేసవిలో ఉష్ణోగ్రత కనీసం నలభై డిగ్రీల వరకు వెళుతుంది. అంత వేడెక్కిన వాతావరణంలో గాడ్జెట్‌స ఛార్జింగ్ అవుతున్నప్పుడు అవి మరింత వేడెక్కుతాయి. కాబట్టి ప్రొటెక్షన్ ఉంటే బెటర్. ఈ మూడూ పవర్‌బ్యాంక్ ఫీచర్‌సలో ఉన్నాయో లేదో జాగ్రత్తగా పరిశీలించి ఎంపిక చేసుకోండి. వీటన్నిటితో పాటు - వారంటీ చూసుకోవడం మరో కీలకమైన విషయం.
నాసిరకం అయితే గ్యారెంటీ ఉండదు:
మార్కెట్‌లో దొరికే చైనా పవర్‌బ్యాంక్‌లకు దేనికీ వారంటీ ఉండదు. దేశంలో ఎక్కడా సర్వీసు సెంటర్లూ ఉండవు. కాస్త ధర ఎక్కువైనా సరే.. మంచి కంపెనీల పవర్ బ్యాంక్‌లను కొంటే మంచిది. అందులోను ఎఫ్‌సిసి, సిఇ, ఆర్‌ఒహెచ్ ఎస్ సర్టిఫికేషన్లు ఉన్నవి మరీ ఉత్తమం. ప్రస్తుతం సోనీ, శ్యామ్‌సంగ్, ఎవ్రిడే, పొర్రో్టనిక్‌స, ఈఆర్‌డి, ఎవియో, మి.. వంటి పవర్‌బ్యాంక్‌లకు మొబైల్ ఎక్‌సపర్‌టలు మంచి రేటింగ్ ఇస్తున్నారు. వెయ్యి నుంచి మూడు వేల రూపాయల్లోపు ఇవన్నీ దొరుకుతాయి. కాబట్టి.. పవర్‌బ్యాంక్ మీ చేతిలో ఉంటే.. సెల్ సందడే సందడి.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment