అరటి "తొక్కే" కదా అని తీసిపారేయకండి ! దాని ఉపయోగాలు తెలుసుకోండి?



భారతదేశంలో దొరికే సాధారణ పండ్లలో ఒకటి మరియు దీనిని ఎందుకు మనం రుచిగా, ఇష్టంగా వాడమో తెలీదు. మీరు అరటి తొక్కను చెత్తబుట్టలో పడవేసే ముందు, అరటితొక్కవలన కలిగే లాభాలను తెలియచేసే ఈ వ్యాసాన్ని చదవండి. దీనివలన అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. 
banana benefits కోసం చిత్ర ఫలితం

అరటి పండులో అనేక పోషకాలు మరియు కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. అరటిపండులో విటమిన్లు B-6, B-12, మెగ్నీషియం మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. 


ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన బహుమతి అరటి,  దీని వలన ఉపయోగాలు చూద్దాం :


banana benefits కోసం చిత్ర ఫలితం

దంతాలు: అరటితొక్కతో ఒక నిముషంపాటు దంతాలపైన ఒక వారం రోజులపాటు ప్రతిరోజూ రుద్దండి. ఇలా చేయటంవలన మీ దంతాలు తెల్లగా మెరుస్తాయి. ఎంతో డబ్బు ఆదా అవుతుంది.

పులిపిర్లు: అరటి తొక్క పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది మరియు క్రొత్తవి రాకుండా చేస్తుంది. దీనికోసం, పులిపిర్లు ఉన్న ప్రాంతాన్ని అరటితొక్కతో రుద్దండి లేదా ఆ ప్రాంతం మీద రాత్రంతా అరటితొక్కను కట్టండి. చర్మం కొరకు అరటితొక్కతో చేసే చికిత్సలలో ఇది సులభమైన మార్గం.

అరటి తొక్కలను కూడా ఆహారంగా తీసుకోవొచ్చు. అద్భుతమైన ఇండియన్ వంటకాలలో వీటిని వాడుతుంటారు. లేత చికెన్ ను దీనిమీద ఉంచి ఉపయోగిస్తారు.

banana benefits కోసం చిత్ర ఫలితం
మొటిమలు: మొటిమలు తగ్గటానికి అరటితొక్కతో మీ ముఖాన్ని మరియు శరీరాన్ని ఐదు నిముషాలపాటు మర్దన చేయండి. మీకు వారంలోపల మంచి ఫలితం కనపడుతుంది. ఇలా మొటిమలు మాయమయ్యేవరకు చేయండి.

ముడతలు: మీ శరీరం హైడ్రేట్ అవటానికి అరటితొక్క సహాయపడుతుంది. మెత్తగా చేసిన అరటితొక్కతో గ్రుడ్డు సొనను కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మీద రాసి, ఐదు నిముషాలు అలానే వదిలేయండి. ఐదు నిముషాల తరువాత కడగండి.

నొప్పి నివారిణి: నొప్పిగా ఉన్న ప్రాంతంలో అరటితొక్కతో రాయండి. నొప్పినుండి ఉపశమనం వోచ్చేవరకు ముప్ఫై నిముషాల వరకు అలానే వదిలేయండి. అరటి తొక్కతో కూరగాయల నూనె మిశ్రమం కలిపి రాస్తే, నొప్పినుండి ఉపశమనం కలుగుతుంది.

సోరియాసిస్: సోరియాసిస్ తో ఉన్న ప్రాంతం అంతటా అరటితొక్కతో రాయండి. అరటి తొక్క మాయిశ్చరైజేషన్ గుణాలను కలిగి ఉన్నది మరియు దురదను కూడా తగ్గిస్తుంది. ఇది త్వరగా సోరియాసిస్ ను నయం చేస్తుంది మరియు మీరు తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు చూడవొచ్చు.

దోమల కాట్లు: దురద మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందేందుకు దోమలకాటు ఉన్న చర్మము మీద అరటితొక్క తో మసాజ్ చేయండి.

షూస్, లెదర్, సిల్వర్ పాలిష్: ఏవైనా బూట్లు, తోలు, మరియు రజతం; వీటిని వెంటనే ప్రకాశింప చేయడానికి అరటితొక్కతో రుద్దండి.

UV రక్షణ: అరటి తొక్క హానికరమైన UV కిరణాలు నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది. మీరు మీ కళ్ళను అరటి తొక్కతో రుద్దే ముందు, అరటితొక్కను సూర్యుని ముందు ఉంచండి. ఇలా చేయటం వలన మీ కళ్ళకు శుక్లాలు ప్రమాదం కూడా తగ్గుతుందని నిరూపించబడింది.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment