భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India-RBI) భారత దేశపు కేంద్ర బ్యాంకు. ఈ బ్యాంకును 1935, ఏప్రిల్ 1 న భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 ప్రకారము స్థాపించారు.
స్థాపించబడినప్పటి నుంచి దీని ప్రధాన స్థావనం కోల్‌కత లో ఉండేది. తర్వాత ముంబాయి నగరం లో ఉంది. ప్రారంభంలో ఇది ప్రైవేటు అజమాయిషిలో ఉన్ననూ 1949 లో జాతీయం చేయబడిన తర్వాత భారత ప్రభుత్వం అధీనంలో ఉంది.
రిజర్వ్ బ్యాంకుకు అధిపతి గవర్నర్ . ఇతనిని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అని పిలుస్తారు. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సాధారణంలో ఆర్థిక నైపుణ్యం కల వ్యక్తులను ఈ బ్యాంకు అధిపతులుగా నియమించబడతారు.
డైరెక్టర్ల బోర్డు
జూన్ 27,2006 న, భారత ప్రభుత్వము కేంద్ర బోర్డు డైరక్టర్ల నియామకాలను జారీచేసింది, ఇందులో 13 సభ్యులున్నారు, అజీం ప్రేమ్ జీ మరియు కుమారమంగళం బిర్లా లు వున్నారు.
ఇతర సభ్యులు:
సురేష్ టెండూల్కర్, ఆర్థికవేత్త మరియు సభ్యుడు, ప్రధానమంత్రి సలహా మండలి.
యూ. ఆర్. రావు, మాజీ ఛైర్మన్, ఇస్రో (ISRO) మరియు ఛైర్మన్ శోధనా మండలి, భౌతిక పరిశోధనాలయం, డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్.
లక్ష్మీ చంద్, రిటైర్డ్ IAS ఆఫీసరు.
శశిరేఖ రాజగోపాలన్, కన్సల్టెంట్, సహకారాలు.
సురేష్ కుమార్ నియోతియా, ఛైర్మన్, అంబుజా సిమెంట్.
ఏ. వైద్యనాథన్, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్.
మన్మోహన్ శర్మ, FRS, మాజీ డైరెక్టరు, ముంబై విశ్వవిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నలజీ.
డి. జయవర్థనవేలు, ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టరు, లక్ష్మీ మెషీన్ వర్క్స్ లిమిటెడ్.
మనదేశ ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ గతంలో రిజర్వ్ బ్యంకు గవర్నర్ గా పనిచేసినారు. రిజర్వ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు కలవు
రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు
ఆస్‌బోర్న్ స్మిత్ (1935-1937)
జేమ్స్ టేలర్ (1937-1943)
సి.డి.దేశ్‌ముఖ్ (1943-1949)
బెనెగల్ రామారావు
కె.జి.అంబెగాంకర్ (1957)
హెచ్.వి.జి.అయ్యంగార్ (1957-1962)
పి.సి.భట్టాచార్య (1962-1967)
ఎల్.కె.ఝా (1967-1970)
బి.ఎన్.అదార్కర్ (1970)
ఎస్.జగన్నాథన్ (1970-1975)
ఎన్.సి.సేన్‌గుప్తా (1975)
కె.ఆర్.పూరి (1975-1977)
మైదవోలు నరసింహం (1977)
ఐ.జి.పటేల్ (1977-1982)
మన్‌మోహన్ సింగ్ (1982-1985)
ఏ.ఘోష్ (1985)
ఆర్.ఎన్.మల్హోత్రా (1985-1990)
ఎస్.వెంకట్రామన్ (1990-1992)
సి.రంగరాజన్ (1992-1997)
బిమల్ జలన్ (1997-2003)
వై. వేణుగోపాల రెడ్డి (2003- 2008)
దువ్వూరి సుబ్బారావు 2008 - 2013)
రఘురాం గోవింద్ రాజన్ 2013 - ప్రస్తుతం)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment