కొత్త అల్లునికి అత్తవారింట "అల్లెం" ఎందుకు పెడతారు?



అల్లుణ్ణి కోసం చిత్ర ఫలితం
కుమార్తెకు వివాహం చేసాక ఆరుమాసాలు అల్లుణ్ణి అత్తవారింట ఉంచి విశేష మర్యాదలు చేసే సాంప్రదాయం అల్లెం .

అల్లెము అన్న పదానికి మూలం "అల్లిరము" అన్న పదం. పెండ్లి అయిన అల్లుణ్ణి బిలిచి యత్తవారింటఁబెట్టెడు విందు, మనుగుడుపు, అల్లిరము అన్న పదానికి అర్ధం విందు అని.

అల్లెం అనేది హిందూ వివాహ వ్యవస్థలో ఒక ఆచారం గా కొన్ని ప్రాంతాలలో ఉన్నది. కుమార్తెకు వివాహం చేసిన తరువాత అల్లుణ్ణి ఆరు నెలలు తమ యింటిలో ఉంచడాన్ని "అల్లెం పెట్టడం" అంటారు. ఆరుమాసాలు బాగా పౌష్టికాహారాన్నిచ్చి బలంగా తయారుచేస్తే కూతురి కడుపున ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారని వారి నమ్మకం

పాతకాలం లో అన్నిప్రాంతాల్లో చాలా చిన్న వయసులో పెళ్లి చేసేవారు.కొందరు అమ్మాయి యుక్తవయస్కురాలు కాకముందే చేస్తే కొందరు ఆ తర్వాత 3,4 ఏళ్లకే..... సరే పెళ్లయ్యాక ఎన్నేళ్లకో అమ్మాయిలు కాపురాలకు వచ్చేవారు...ఈలోగా అమ్మాయిని అత్తారింటికి పంపేముందు అల్లుడిని "అల్లెం" కు పిలిచేవారు. ఈ అల్లెం పెట్టడం కొన్ని నెలలపాటు సాగేది

అల్లెం పెట్టే పద్దతి

ఈ అల్లెం సమయంలో రోజూ అల్లుడు గారికి రకరకాల ఆహారపదార్థాలు(శాకాహార, మాంసాహార పదార్థాలు) చేసి పెడతారు.ఇక పిండివంటలు చెప్పాల్సిన పనేలేదు. నేతి అత్తరాసులు(అరిసెలు),లడ్డు,కజ్జికాయలు..అంతేనా మళ్లీ వీటిని నెయ్యి లో కలుపుకుని తినాలి.
ఇక అల్లుడు గారు నీడపట్టున తింటూ కాలక్షేపం చెయ్యడం,మరీ విసుగనిపిస్తే అలా పొలాలవెంట షికార్లు తిరిగిరావటం.....
ఈ అల్లెం పెళ్లి కొడుకుల వంటిమీద ఈగ వాలితే ఆ శరీరం నునుపుకు అది జారిపోవాలిట.....
మరీ ఇంతలా తినిపించినప్పుడు స్థూలకాయులు అవుతారనుకోకండి....
గ్రామీణ క్రీడలకు సంబంధించిన రాతిగుండును ఎత్తటం కూడా చెయ్యాలి...
అందుకే ఈ రాతిగుండ్లకు "అల్లెం గుండు" అనే పేరు వచ్చింది.....(ఆ గుండును భుజమ్మీదకు ఎత్తుకుని వీపు మీదుగా కిందకు జారవిడవాలి)
పట్టణీకరణ, పనుల వత్తిడి, యాంత్రికజీవన విధానలు, గ్రామాల సాంస్కృతిక విధ్వంసం.....ఏదైతేనేం ఈ ఆచారం మాయమైనా "అల్లెం పెళ్లికొడుకు" అనే మాట మాత్రం అక్కడక్కడా వినిపిస్తుంది.


ఇంకా :  
మహిళకు కవలలు, తండ్రులు వేరే: ఒకే వారంలో ఆమె
విద్యాబాలన్‌కు గృహహింస… చెంప పగలగొట్టిన భర్త
పెళ్లి కోసం గుర్రం ఎక్కితే రాళ్ళతో కొట్టారు ?
మహేష్ బాబు ‘మగాడు’ అంటున్నారు, నిజమా?
అమ్మాయిని ప్రసవించిన పురుషుడు
లావు "అనుష్క"ను మళ్లీ గోకనున్న సన్న"నాగార్జున" ?
"అది" ఉంటేనే కాపురానికి వస్తామని మీ భర్తలకు 
కట్టుకోనివ్వరూ.. విప్పుకోనివ్వరు.. ఇదేం గోల బాబూ.....
బ్రహ్మానందంలో ఈ టాలెంట్ కూడా ఉందా ?
నీకు కాల్ చేయడానికి ధైర్యం ఎందుకురా "నోకియా" ఫోను ...
ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అంటే ఇదే... ?
కడుపు చేశాడు , పెళ్లి చేసుకోమంటే ఆసిడ్ తాగించాడు ....











కష్టాలు తీర్చే మొక్కలు

యంత్రాలతో ప్రయోజనమేనా?

యాగాలు ఎన్ని రకాలు ?

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment