గత శతాబ్ది మధ్య కాలం వరకు లభించే రంగులు ప్రకృతి సిద్ధంగా లభించే పువ్వులు, మొక్కల నుండి తయారయ్యేవి. అప్పుడు రంగుల వన్నెలు తక్కు వుండేవి. ఈ రోజుల్లో నీలం రంగు చెట్టు ఇండిగో నుండి నీలం, మేడర్ అ నే ఎర్ర రంగు, సాఫోవర్ అనే పచ్చరంగు, టర్మరిక్ పసుపు అనే పసుపు ప చ్చ రంగును కొన్ని సముద్ర ప్రాణుల నుండి తయారు చేసేవారు. మొట్టమొదటి కృత్రిమమైన రంగును 1856లో కనుగొనేసరికి రంగుల ప్ర పంచంలో కొత్త ఇంద్రధనస్సులేర్పడ్డాయి. క్వినెైన్ మందును కృత్రిమంగా తయారు చేయడానికి విలియమ్ పెర్కిన్ ప్రయోగాలు చేస్తుండగా, ఈ రం గు సునాయాసంగా తయారెైంది. దీని పేరు మేవీన్. ఇది నీలం రంగులో వుండేది. ఆ తరువాత అనేక రంగులలో కృత్రిమ వర్ణాలను తయారు చేయడం జరిగింది. కృత్రిమంగా తయారయిన రంగులు ఊలు మొదలెైన బట్టలకు వేసిన పుడు వెలిసిపోయేవి కాదు. నూలు బట్టలకు ఈ రంగులను వేసినపుడు, బట్టలను ఉతికేసరికి రంగులు వెలిసి పోయేవి. రంగు వెలవకుండా ఉం డేందుకు రంగు వేసే ముందు నూలు బట్టలను టేనిక్ ఆమ్లము లేదా లో హపు లవణాలలో ముంచేవారు. దీని వలన రంగు పోయేది కాదు. ఈ రంగుల తర్వాత ఏజో రంగులు తయారయ్యాయి. ఈ రంగులలో రెండు రకాలు. మొదటి రంగులో ముంచి తీసిన పిదప ఆరబెట్టి రెండవ రంగులో మరలా ముంచి తీసి ఆరబెడతారు. రెండు రంగులు కలసి బట్ట కు పట్టుకుంటాయి. తరువాత ఈ బట్టలను ఉతికినా రంగులు వెలసి పోవు. వాట్ రంగులు మరో సముదాయానికి చెందినవి. నూలు బట్టలకు ఇవి ఎంతో మంచివి. ఈ రంగులతో కొన్ని రసాయనాలను కలిపి బట్టలకు ప ట్టించినట్లయితే అవి ఎంత కాలానికి వెలువ కుండా మెరుస్తుంటాయి. ఇంకా ఇప్పుడు, తారు, పెట్రోలియం పదార్థాలతో తయారయ్యే అనేక రంగులు లభిస్తున్నాయి. ఇవి బట్టల కోసమే కాదు, ప్లాస్టిక్, చర్మం, కాగి తం, తెైలాలు, రబ్బరు, సబ్బులు, ఆహార పదార్థాలు వంటి, సిరాలు మొదలెైనవి తయారు చేయడానికి ఉపయోగిస్త్తున్నారు. ఇంకా చదవండి : మహిళకు కవలలు, తండ్రులు వేరే: ఒకే వారంలో ఆమె
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment