ఆమె ఆత్మ ఇప్పటికీ ఆ కోటలో తిరుగాడుతుంటుందని స్థానికులు చెబుతారు...శనివార్‌వాడ కోట

శనివార్‌వాడ కోట : చారిత్రక చిహ్నంగా మిగిలిన వాటిలో శనివార్‌వాడ కోట ఒకటి. ఈ కోటను 1746లో నిర్మించారు. 1818 వరకూ ఈ కోట పీష్వా రాజుల ఆధీనంలో ఉంది. తరువాత ఆంగ్లేయులపరమైంది. 1828లో అగ్ని ప్రమాదం కారణంగా ఈ కోటలో అధిక భాగం ధ్వంసమైంది. 

shaniwar wada కోసం చిత్ర ఫలితం
నాశనం కాకుండా మిగిలిన భాగాలను ప్రస్తుతం పర్యాటక ప్రదేశాలుగా నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని పూణెలో ఉన్న ఈ కోట గురించి స్థానికులలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కోటను పాలించిన వారి వంశంలోని ఒక యువరాణి హత్యకు గురైంది. 

shaniwar wada కోసం చిత్ర ఫలితం
ఆమె ఆత్మ ఇప్పటికీ ఆ కోటలో తిరుగాడుతుంటుందని స్థానికులు చెబుతారు. రాత్రి వేళల్లో బిగ్గరగా, కీచుమనే అరుపులు చాలా భయానకంగా వినవస్తుంటాయని వారు అంటారు. కోటను సందర్శించడమే కాకుండా, రాత్రి వేళల్లో వినవచ్చే అరుపులను వినడానికి ఇక్కడ ఉండాలని స్థానికులు చెబుతుంటారు. నమ్మశక్యం కాని ఇలాంటి విషయాలను పక్కన ఉంచి కోటను చూడటానికి చాలామంది వెడుతుంటారు.


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment