అక్టోబరు - 2014 సైన్స్ అండ్ టెక్నాలజీ



అక్టోబరు - 1  
¤ వాయుసేన అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసిన తేలిక పాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్ తొలి గగన విహారం బెంగళూరులోని హచ్ఏఎల్ విమానశ్రయంలో విజయవంతంగా జరిగింది.
      
» ఎయిర్ కమాండర్ కె.ఎ.ముత్తన్న ఈ ప్రయోగానికి సారధ్యం వహించారు.¤ మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 10ను శాన్‌ఫ్రాన్సిస్కోలో విడుదల చేసింది. విండోస్ 8 తర్వాత విండోస్ 9 విడుదలవుతుందని అందరూ ఊహిస్తే అందుకు భిన్నంగా విండోస్ 10ను విడుదల చేసింది. 
 అక్టోబరు - 2
¤ చంద్రుడి ఉపరితలంపై మనిషిలా కనిపించే ఆకృతి భారీ శిలాద్రవం కారణంగా ఏర్పడిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన గ్రెయిల్ (గ్రావిటీ రికవరీ అండ్ ఇంటీరియర్ ల్యాబొరేటరీ) ఉపగ్రహం అందించిన సరికొత్త డేటా ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు.

అక్టోబరు - 4 
¤ అమెరికా పశ్చిమ తీరంతోపాటు ఐరోపా దేశాల రాజధానులపై దాడి చేయగల ఖండాంతర అణ్వస్త్ర క్షిపణి 'డాంగ్ ఫెంగ్ - 31 బీ' ని చైనా విజయవంతంగా పరీక్షించింది.      » షాంక్సీ ప్రావిన్స్‌లోని 'వుజాయ్ క్షిపణి, అంతరిక్ష ప్రయోగ కేంద్రం' నుంచి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈ పరీక్షను నిర్వహించింది.      » అక్టోబరు 1న చైనా జాతీయ దినోత్సవం నేపథ్యంలో ఆ దేశ సైన్యం తమ అణ్వస్త్ర సత్తాను చాటేలా ఈ పరీక్షను నిర్వహించింది.      » ఈ క్షిపణి 10 వేల కి.మీ. దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదిస్తుంది.      » అమెరికాలోని అన్ని ప్రదేశాలనూ తాకగలిగేలా 12వేల కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించే డాంగ్ ఫెంగ్ - 41 క్షిపణిని చైనా అభివృద్ధి పరుస్తున్నట్లు కూడా ఆ దేశ సైన్యం వెల్లడించింది.¤ చందమామ అవతలి ముఖంపై ఏముంది అన్న మిస్టరీ విడిపోయి 55 ఏళ్లు అయ్యాయి.      » చంద్రుడి అవతలి రూపాన్ని తొలిసారిగా 1959, అక్టోబరు 4న రష్యన్ వ్యోమనౌక లూనా - 3 ఫొటో తీసింది. అంతరిక్షంలోకి తొలి ఉపగ్రహం 'స్పుత్నిక్' ను పంపి రేండేళ్లు అయిన సందర్భంగా అప్పట్లో రష్యా లూనా - 3ని నింగిలోకి పంపింది.      » భూమి ఆకర్షణ శక్తి వల్ల బందీ అయిపోయిన చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూనే మెల్లగా 29.5 రోజులకు ఒకసారి భూమి చుట్టూ తిరగడం వల్ల మనకు ఎప్పుడూ ఒక వైపే కనిపిస్తుంటాడు. 

అక్టోబరు - 11
¤ తూర్పు తీర దేశంలో మరో హోవర్ క్రాఫ్ట్‌ను ప్రవేశ పెట్టారు. తీర ప్రాంతంలో నిఘా, సహాయక చర్యలు, గస్తీకి ఇది ఎంతో సహాయ పడుతుంది.      » ట్యూటికోరిన్ సమీపంలో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ దీన్ని అధికారికంగా ప్రవేశపెట్టారు. దేశంలో ఇప్పటి వరకు ప్రవేశ పెట్టిన హోవర్ క్రాఫ్ట్‌లలో ఇది పదకొండోది. తూర్పు తీరంలో అయిదవది.
అక్టోబరు - 13
¤ కేవలం రెండు రూపాయల ఖర్చుతో గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించగలిగే అత్యంత చవకైన పద్ధతిని ఢిల్లీలోని పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనికి 'విజువల్ ఇన్‌స్పెక్షన్ విత్ ఎసిటిక్ ఆసిడ్' (వీఐఏ) అనే పేరు పెట్టారు.¤ ఢిల్లీలోని శ్రీ గంగారాం ఆస్పత్రిలోని ప్రసూతి, స్త్రీవ్యాధి విభాగ పరిశోధకులు దీనికి రూపకల్పన చేశారు. ఖరీదైన పరీక్షలు, వాటిని నిర్వహించే నిపుణులు అందుబాటులో లేని పేద దేశాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరీక్ష మంచి ప్రత్యామ్నాయంగా పనికొస్తుంది.      » గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న పాప్‌స్మియర్‌తో పోల్చిచూసినప్పుడు ఈ కొత్త పరీక్ష సులభంగా ఉండటమే కాకుండా వేగంగా, కచ్చితమైన ఫలితాలను ఇస్తోందని వెల్లడైంది. ఈ పరీక్షకు ప్రస్తుతం వెయ్యి రూపాయల వరకూ ఖర్చు అవుతోంది. పైగా అది అంతటా అందుబాటులో ఉండదు. వెంటనే ఫలితం రాదు. ఈ నేపథ్యంలో గంగారాం పరిశోధకులు వీఐఏను రూపొందించి, 2008 - 10 మధ్యకాలంలో 500 మంది మహిళలపై పరీక్షించి విజయవంతమైన ఫలితాలను సాధించారు.      » మన దేశంలో ఏటా 1.42 లక్షల మంది ఈ వ్యాధికి గురవుతుండగా 77,000 మంది మరణిస్తున్నారు. గర్భాశయ క్యాన్సర్ 'హ్యూమన్ పాపిలోమా వైరస్' వల్ల వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకి వ్యాధి తమకు సంక్రమించిందనే విషయం బాధిత మహిళలకు మొదట తెలియదు. వ్యాధిని గుర్తించే సమయానికి అది ముదిరిపోయి ప్రాణాలను హరిస్తుంది.      » 1960 నుంచీ గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించడానికి పాప్‌స్మియర్ పరీక్షనే ఉపయోగిస్తున్నారు. దీనికి ప్రయోగశాల, నిపుణులు అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో ఇది సాధ్యం కాదు.      » గర్భాశయ ముఖ ద్వారానికి ఎసిటిక్ ఆమ్లాన్ని పంపినప్పుడు క్యాన్సర్ కణాలుంటే అవి ఎండిపోయి వాటిలోని ప్రొటీన్లు గడ్డకడతాయని, క్యాన్సర్ నిర్దారణకు ఇదొక ముందస్తు పరీక్షగా ఉపయోగపడుతుందని, ఈ పరీక్షకు నిపుణుల అవసరం కూడా ఉండదని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధన వివరాలను 'జర్నల్ ఆఫ్ కరెంట్ మెడిసిన్ రిసెర్చ్ అండ్ ప్రాక్టీస్ 2014' ఆగస్టు సంచికలో ప్రచురించారు.
అక్టోబరు - 14 
¤ ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలాను గుర్తించడానికి బ్రిటన్ శాస్త్రవేత్తలు చవకైన, సులువైన, త్వరగా ఫలితాలను వెల్లడించే రక్తపరీక్షను రూపొందించారు. ఎబోలా వైర‌స్‌కు సంబంధించిన ఆర్ఎన్ఏను గుర్తించడం ద్వారా ఆ వ్యాధి ఉందో లేదో తెలుసుకునే విధంగా దీన్ని రూపొందించారు. కేవలం గంటన్నర వ్యవధిలోనే ఫలితం వెల్లడవుతుంది.¤ ఈగ జన్యుక్రమాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. మనిషి, జంతు వ్యర్థాలపై ఆధారపడి జీవించే ఈగలు ఆయా వృధా పదార్థాలు కుళ్లిపోయి భూమిలో కలిసేలా తమ పాత్రను నిర్వహిస్తాయి. అయితే ఈగతో ఇలాంటి అనుకూలతలే కాదు, బోలెడన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. టైఫాయిడ్, క్షయ తదితర 100కు పైగా వ్యాధులకు ఈగ కారణమవుతోంది.      » ఈ నేపథ్యంలో దీని జన్యుక్రమాన్ని గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్సలను అభివృద్ధి చేయడానికి వీలవుతుందని అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు భావించి ఆరు ఆడ ఈగలను అధ్యయనం చేసి సుదీర్ఘమైన జన్యుక్రమాన్ని రూపొందించారు.
అక్టోబరు - 16
¤ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్)లోని మూడోదైన ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1సి ఉపగ్రహాన్ని విజయవంతంగా రోదసిలోకి పంపించారు.      » పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ సీ - 26) రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.      » నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదికైంది.      » ప్రయోగించిన 20.18 నిమిషాల అనంతరం ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1సి ఉపగ్రహాన్ని 282.56 ×20670 కిలోమీటర్ల భూ స్థిర కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.రాకెట్ విశేషాలు      » పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్- సి26 పీఎస్ఎల్‌వీ శ్రేణిలో 28వ వాహక నౌక. ఎక్స్ఎల్ వెర్షన్‌కు సబంధించి ఇది 7వ ప్రయోగం. ఇప్పటివరకు 28 పీఎస్ఎల్‌వీలను ప్రయోగించగా, మొదటి ప్రయోగం తప్ప మిగతా 27 విజయవంతమయ్యాయి.      » తాజాగా నింగిలోకి వెళ్లిన పీఎస్ఎల్ఎల్‌వీ పొడవు 44.4 మీటర్లు. బరువు 320 టన్నులు. ఇందులో నాలుగు దశలు ఉండగా ఒకటి, మూడు దశల్లో ఘన ఇంధనం, రెండు, నాలుగు దశల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించారు. పీఎస్ఎల్‌వీకి రూ.100 కోట్లు, ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1సి ఉపగ్రహానికి రూ.142 కోట్లు వ్యయం చేశారు.      » తాజాగా కక్ష్యలోకి చేరిన ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1సి ఉపగ్రహం బరువు 1425.4 కిలోలు. ఇది పదేళ్లపాటు సేవలు అందిస్తుంది. 2015 నాటికి ఈ వ్యవస్థ సిద్ధమవుతుంది. 7 ఉపగ్రహాలు ఉన్నాయి. మూడు ఉపగ్రహాలు భూ స్థిర కక్ష్యలో, నాలుగు ఉపగ్రహాలు భూ అనువర్తిత కక్ష్యలో ఉంటాయి. మొదటిదైన ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1ఎ ను 2013 జూలై 2న, రెండోదైన 1 - బి ని ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయోగించారు. మిగిలిన నాలుగు ఉపగ్రహాలను 2015 డిసెంబరులోగా ప్రయోగిస్తారు.      » ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ వ్యవస్థ భూతల, ఆకాశ, సాగరాల్లో దిశానిర్దేశ సేవలను అందిస్తుంది. విమానాలు, ఓడల గమనాన్ని నిర్దేశించడంలో సాయపడుతుంది.      » ఇప్పటి వరకూ అమెరికా (జీపీఎస్), రష్యా (గ్లోనాస్), ఐరోపా సంఘం (గెలీలియా), చైనా (బెయ్‌డోవ్), జపాన్ (క్వాసీ-జెనిత) దేశాలకు మాత్రమే సొంత నావిగేషన్ వ్యవస్థ ఉంది.
అక్టోబరు - 17 
¤ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి 'నిర్భయ్‌'ను శాస్త్రవేత్తలు 
విజయవంతంగా పరీక్షించారు.      » అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగల ఈ క్షిపణి వెయ్యి కిలోమీటర్లకు పైగా దూరంలో 
ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు.      » ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ఈ పరీక్షను 
నిర్వహించారు.      » నిర్భయ్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన ఏరోనాటికల్
 డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ అభివృద్ధి చేసింది.      » భారత్, రష్యాలు సంయుక్తంగా రూపొందించిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణికి ఇది భిన్నం.
 బ్రహ్మోస్ 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సూపర్ సోనిక్ వేగంతో ఛేదిస్తుంది. 
నిర్భయ్ ఎక్కువ దూరం పయనించగలదు. పైగా దీనికి వేచిచూసే సమయం ఎక్కువగా ఉంటుంది.
 అద్భుతమైన నియంత్రణ, దిశానిర్దేశ వ్యవస్థ, లక్ష్యఛేదన విషయాల్లో చాలా కచ్చితత్వం, శత్రువును
 ఏమార్చే స్టెల్త్ లక్షణాలు నిర్భయ్‌లో ఉన్నాయి. 0.7 మ్యాక్ వేగంతో దూసుకెళ్లలదు. అమెరికా 
రూపొందించిన తోమహక్, పాకిస్థాన్‌కు చెందిన బాలర్ క్షిపణులకు పోటీగా భారత్ తయారు 
చేసిన అస్త్రంగా దీన్ని పేర్కొంటారు.      » నిర్భయ్‌ను తొలిసారిగా గతేడాది మార్చి 12న పరీక్షించారు. అయితే మార్గ మధ్యంలో
 క్షిపణి గమనంలో కొన్ని తేడాలు చోటుచేసుకోవడం వల్ల ప్రయోగం పాక్షికంగా సఫలమైంది.      » ఈ క్షిపణిని మూడేళ్లలో సైనిక దళాల చేతికి అందించాలని భావిస్తున్నట్లు డీఆర్‌డీవో
 చీఫ్ అవినాష్ చందర్ తెలిపారు.      » నిర్భయ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వసంత్ శాస్త్రి.      » నిర్భయ్‌లోని కీలక భాగాలను హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన సంస్థలు అభివృద్ధిచేశాయి.
 క్షిపణికి మెదడు లాంటి ఆన్ బోర్డ్ కంప్యూటర్దిశానిర్దేశం కోసంఅత్యాధునిక నేవిగేషన్
 వ్యవస్థలనుఏవియానిక్స్‌ను హైదరాబాద్‌కు చెందిన రీసెర్చ్సెంటర్ ఇమారత్
 (ఆర్‌సీఐఅభివృద్ధి చేసిందిఘన రాకెట్ మోటార్‌ను 
నగరానికేచెందిన అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్ లేబొరేటరీ (ఏఎస్ఎల్తయారు చేసింది.
     » నిర్భయ్ కనిష్ఠంగా అయిదు మీటర్ల ఎత్తులోనుగరిష్ఠంగా 5 కిలోమీటర్లఎత్తులోను
 ప్రయాణించగలదుకేవలం 1 - 2 మీటర్ల వైరుధ్యంతో లక్ష్యాన్నిఛేదించగలదు.
అక్టోబరు - 18
¤ భూమి చుట్టూ 22 నెలల పాటు రహస్యంగా తిరిగిన అమెరికా అంతరిక్ష విమానం 'ఎక్స్-37బీ' ఎట్టకేలకు భూమికి క్షేమంగా తిరిగి వచ్చింది.
     » 2012 డిసెంబరులో మూడోసారి నింగికెగిరిన ఈ విమానం కాలిఫోర్నియాలోని వైమానిక స్థావరంలో సురక్షితంగా దిగింది
.
     » నాసా గతంలో ఉపయోగించిన స్పేస్ షటిల్ వ్యోమనౌకల మాదిరిగా మళ్లీ మళ్లీ ఉపయోగించుకునేందుకు వీలయ్యే అంతరిక్ష విమానం తయారీలో భాగంగా అమెరికా ఈ బుల్లి మానవరహిత విమానాన్ని రహస్యంగా పరీక్షిస్తోంది
.
     » ఈ విమానం 8.8 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పు ఉంది
.
అక్టోబరు - 20
¤ భారీ హీలియం బెలూన్‌ను ఉపయోగించి లండన్‌కు చెందిన 'చోసెన్ బన్' అనే సంస్థ బర్గర్, చిప్స్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది.     » ఈ బెలూన్ ఒక ఇంటి పరిమాణంలో ఉంది. దీని ద్వారా తినుబండారాలను ఆకాశంలో 1.12 లక్షల అడుగుల ఎత్తులోకి తీసుకువెళ్లారు.     » బర్గర్, చిప్స్‌ను ఇలా అంతరిక్షంలోకి పంపడం ఇదే మొదటిసారి.¤ ప్రమాదకర కాలుష్య కారకాలను కూడా నిస్తేజపరిచే సామర్థ్యం 'విటమిన్ బి-12' (సయనకోబాలమిన్)కి ఉందని మాంచెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.
అక్టోబరు - 21
¤ దక్షిణ  డెన్మార్క్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కంప్యూటర్ సెక్యులేషన్ (అనుకరణ) ప్రయోగాల ద్వారా అత్యంత ప్రాథమిక కణమైన 'ప్రొటోసెల్‌ను కృత్రిమంగా తయారు చేయడానికి అవసరమైన ప్రక్రియను తొలిసారిగా రూపొందించారు.
¤ మంటలను ఆర్పే డ్రోన్ (పైలట్ రహిత విమానం)ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) రూపొందించింది. ఇది గాల్లో కమ్ముకొస్తున్న పొగను గుర్తించి మంటలు వ్యాపించేలోగా వాటిని అదుపులోకి తీసుకురావడంలో సహాయపడుతుంది
.
     » నాసాకు చెందిన లాంగ్లీ రిసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు అమెరికా సైన్యానికి చెందిన ఒక డ్రోన్‌ను ఈ విధంగా మార్చేశారు.
అక్టోబరు - 24 
¤ ఆగిపోయిన గుండెను కూడా విజయవంతంగా మార్పిడి చేయవచ్చని ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన సెయింట్ విన్సెంట్ ఆసుపత్రి, విక్టర్ చాంగ్ కార్డియాక్ పరిశోధన కేంద్రం వైద్య నిపుణులు నిరూపించారు.     » దీని కోసం వారు ఒక వినూత్నమైన ప్రక్రియను అభివృద్ధి చేశారు. గుండెను తరలించడానికి వీలయ్యే ఒక యంత్రాన్ని రూపొందించారు. దీనికి 'హార్ట్ ఇన్ ఎ బాక్స్' అనే పేరు పెట్టారు. ఈ యంత్రంలో ఒక ద్రావకం ఉంటుంది. దాత నుంచి సేకరించిన గుండెను ఈ ద్రావకంలో భద్రపరుస్తారు. గుండె ఆగిపోయి దాదాపు 20 నిమిషాలైనా, గుండె కండరాలు దెబ్బతినకుండా ఈ ద్రావకం కాపాడుతుంది. తద్వారా ఈ యంత్రంలో గుండె తిరిగి పని చేయడం ప్రారంభిస్తుంది. దీన్ని వైద్యులు శస్త్రచికిత్స ద్వారా అవసరమైన వ్యక్తికి అమర్చుతారు. ఈ పద్ధతిలో ఇప్పటివరకూ ముగ్గురికి గుండెను అమర్చారు.¤ చంద్రుడి కక్ష్యలోకి చైనా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది జాబిల్లిని చుట్టి వచ్చి తిరిగి భూమిపై దిగుతుంది. భవిష్యత్‌లో చంద్రుడిపై దిగి, మళ్లీ భూమి మీదకు వచ్చే వ్యోమనౌకకు అవసరమైనవాటిని పరీక్షించేందుకు దీన్ని ప్రయోగించారు.     » 3,80,000 కి.మీ. ఎత్తున చంద్రుడి కక్ష్యను చేరుకుని, అర్ధచంద్రాకారంలో చుట్టి, భూమిని చేరబోయే వ్యోమనౌకను ఈ రాకెట్ మోసుకెళ్లింది.     » ఈ ఉపగ్రహాన్ని లాంగ్ మార్చ్-3సి రాకెట్ ద్వారా సిచువాన్ ప్రావిన్స్‌లోని క్సిచాంగ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించారు.
అక్టోబరు - 25
¤ సూర్యుడిపై ఒక భారీ మచ్చను అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (ఎస్‌డీవో) వ్యోమనౌక గుర్తించింది. గత 24 ఏళ్లలో ఇంత పెద్దది ఎన్నడూ ఏర్పడలేదని సంస్థ పేర్కొంది.
     » ఏఆర్ 12192 అనే భారీ క్రియాశీలక ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. అక్కడ ఎక్స్ 3.2 స్థాయి సౌరకీల (సోలార్ ఫ్లేర్) ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు నిర్ధరించారు
.
     » ఈ ప్రాంతంలో అక్టోబరు 19 నుంచి ఎక్స్ తరగతి కీల వెలువడటం ఇది నాలుగోసారి. ఎక్స్ అనేది అత్యంత తీవ్ర సౌర కీలలకు చిహ్నం. ఆ తర్వాతి సంఖ్య దాని బలాన్ని వివరిస్తోంది. ఈ సౌర మచ్చ వెడల్పు 80 వేల మైళ్ల మేర ఉంది. ఇందులో భూమి లాంటి గ్రహాలు పది ఇమిడిపోతాయి
.
     » సౌర కీలలు అనేవి రేడియో ధార్మికతకు సంబంధించిన శక్తివంతమైన విస్ఫోటాలు. వీటి నుంచి వెలువడే రేడియో ధార్మికత భూ వాతావరణాన్ని దాటి జీవులకు హాని కలిగించదు.
అక్టోబరు - 27
¤ మానవ శరీరంలో అస్తవ్యస్తంగా, నిరంతరంగా జరిగే కణవిభజనను అడ్డుకోవచ్చని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) తేల్చింది.
     » డ్రాసోఫిలా అనే ఈగలపై డాక్టర్ రాకేష్ కుమార్ మిశ్రా బృందం చేపట్టిన పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఫలాలపై వాలే ఈ ఈగలు శరీరంలో కణవిభజనకు ఏబీడీ - ఏ, ఏబీడీ - బి అనే రెండు జన్యువులు కీలకమని గుర్తించారు. ఈగల్లోని ఆ రెండు జన్యువులను నియంత్రించగా, వాటి శరీర భాగాల ఎదుగుదల నిలిచిపోయినట్లు తేలింది
.
     » ఇదే రీతిగా మానవ దేహంలోనూ కణాల వృద్థిని అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్యాన్సర్ రోగుల్లో అస్తవ్యస్త కణవిభజననూ అడ్డుకోవడానికి ఈ ఫలితాలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు
.
     » ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ పత్రిక 'ప్లాస్ జెనెటిక్స్‌'లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి
.
     » సీసీఎంబీ హైదరాబాద్‌లో ఉంది.
అక్టోబరు - 29
¤ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములకు అవసరమైన ఆహారం తదితర వస్తువులను తీసుకెళుతున్న ప్రైవేటు మానవరహిత రాకెట్ నింగిలోకి ఎగిరిన కొన్ని క్షణాల్లోనే అమెరికాలోని వర్జీనియా తీర ప్రాంతంలో కుప్పకూలింది.
     » ఈ రాకెట్‌ను, అందులోని ఉపగ్రహాన్ని ఆర్బిటాల్ సైన్సెస్ అనే కంపెనీ తయారు చేసింది. నాసాతో కుదిరిన ఒప్పందం మేరకు దాదాపు 2,500 కిలోల బరువున్న సరుకులతో కూడిన ఈ రాకెట్‌ను అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతంలోని వాలప్స్ ఫ్లయిట్ కేంద్రం నుంచి ప్రయోగించారు.
¤ నేలపై సూపర్ కారులా, నింగిలో విమానంలా దూసుకెళ్లగలిగే 'ఏరో మొబైల్ 3.0'
 అనే వాహనాన్ని వియన్నాలో ప్రదర్శించారు.
     » 'ఫ్లయింగ్ రోడ్‌స్టర్‌'గా పిలిచే ఈ వాహనం రోడ్డుపై ప్రయాణించేటప్పుడు గరిష్ఠంగా గంటకు 160 కి.మీ., ఆకాశంలో 200 కి.మీ. వేగంతో వెళుతుంది.