నారా చంద్ర బాబు నాయుడు గారు ఏప్రిల్ 20, 1950 (వయస్సు: 64 సంవత్సరాలు)
నారా వారి పల్లె లో జన్మించారు.
¤తల్లి తండ్రులు:
» అమ్మణమ్మ, ఖర్జూరనాయుడు
¤విద్యార్హతలు:
»తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్
¤భాగస్వామి :
»నారా భువనేశ్వరి (ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరామారావు కుమార్తె ) ను 1981,
సెప్టెంబర్ 10వ తేదీన వివాహం చేసుకున్నాడు.
¤సంతానము :
»నారా లోకేష్
¤రాజకీయ జీవితం
»తొలిసారిగా టంగుటూరి అంజయ్య ( కాంగ్రెస్) మంత్రివర్గంలో స్థానం
»కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‍గా పనిచేశాడు.
»1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్థక శాఖ,
పాడి పరిశ్రమ, చిన్నతరహా నీటిపారుదల శాఖా మంత్రిగా పని చేశాడు.
»1983లో ఎన్.టి.ఆర్ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటికీ చంద్రబాబు
నాయుడు అందులో చేరలేదు
»కానీ తరువాత కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయంగా ఉన్నతస్థాయికి
ఎదిగి పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యాడు
»ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పని చేశారు
»ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాజనాంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి
13 జిల్లాల ఆంధ్రప్రదేశ్నకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రస్తుతం భాద్యతలు
నిర్వర్తిస్తున్నారు.
»జన్మభూమి, నీరు-మీరు, దీపం, శ్రమదానం, పచ్చదనం-పరిశుభ్రత, ఆదరణ
వంటి పలు విభిన్నమైన కార్యక్రమాలతో పరిపాలనా విధానాలలో విప్లవాత్మకమైన
మార్పులకు శ్రీకారం చుట్టాడు
»ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు కృషికి బిల్‍క్లింటన్,
బిల్‍గేట్స్ వంటివారి ప్రశంసలు అందుకున్నాడు.
¤బిరుదులు:
»64 ఏళ్ళ వయస్సులో 2 వేల 8 వందల 17 కిలో మీటర్ల పాదయాత్ర చేసినందుకుగానూ
బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్ ' ఏకవీర ' పురస్కారంతో సత్కరించింది.
¤వివాదాలు, విమర్శలు:
» 2014లో మంగంపేట ముగ్గురాల్లలో స్థానికులకు ఉండే కోటాను రద్దు చేసినారు
» అధికారం కోసం పిలనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారని అపఖ్యాతి మూటగట్టుకున్నారు
» ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అనేక ప్రభుత్వ పరిశ్రమలను ప్రయివేటు పరం చేసినాడు
» 2004లో నిలిపివేసిన ప్రపంచ బ్యాంకు అజెండాను తిరిగి నెత్తికి ఎత్తుకున్నారు
» 2003వ సంవత్సరంలో తిరుపతి బ్రహ్మొత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద
నక్సలైట్లు క్లేమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడిపై హత్యాప్రయత్నం చేశారు.
» కానీ అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డాడు.
ఇంకొన్ని పోస్టులు :
» శ్రీ డా . వై.యస్.రాజశేఖర్ రెడ్డి
» భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు
» సర్ సి.వి రామన్
» ఐజక్ న్యూటన్
» ప్రధాన ఆవిష్కరణలు – ఆవిష్కర్తలు