అమెరికా
అమెరికా సంయుక్త రాష్ట్రాలు (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా) లేదా ఉత్తర అమెరికా అనునది అమెరికా ఖండములో లోని అట్లాంటిక్ మహాసముద్రమునుండి పసిఫిక్ మహాసముద్రము వరకు విస్తరించి ఉన్న దేశము. అమెరికా, 50 రాష్ట్రాల గణతంత్ర సమాఖ్య. సంయుక్త రాష్ట్రాల రాజధాని వాషింగ్టన్ డి.సి.. |
క్రీ. శ. 16వ శతాబ్దం ప్రారంభంలోని ప్రముఖ ఇటాలియన్ సాహస యాత్రికుడు అమెరిగో వెస్పూచి పేరు మీదుగా అమెరికా అనే పదం ప్రాచుర్యంలోకొచ్చింది . జులై 4, 1776న ఈ పదాన్ని మొదటి సారి అధికారికంగా అమెరికా స్వాతంత్ర్య ప్రకటన లో వాడటం జరిగింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే పేరు నవంబరు 15, 1777 నుండి అమల్లోకి వచ్చింది |
1492 లో స్పెయిన్ సాంరాజ్య ఒప్పందంతో క్రిస్టోఫర్ కొలంబస్ పలు కరేబియన్ ద్వీపాలను కనుగిని ఈ యు.ఎస్ మూలవాసుల వాసులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు 1674 డచ్ వారి అమెరికన్ భూములను ఆంగ్లేయులకు వదిలారు. న్యూనెదర్లాండ్ రాష్గ్ట్ర భాగానికి న్యూయార్క్ అని నామకరణం చేసారు. |
1729 నాటికి కరోలినా విభాగాలు మరియు 1732 నాటికి జార్జియా కాననీలు 13 బ్రిటిష్ కాలనీలు కలసి అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా స్థాపించబడింది. |
1730-1740 మధ్య కాలంలో తలెత్తిన క్రైస్తవ మత పునరుద్ధణోద్యమం ప్రజలలోని మతతత్వానికి మరియు మత స్వాత్యంత్రాన్ని నిద్రలేపింది. 1760-1770 మధ్య అమెరికమన్ కాలనీలు మరియు బ్రిటిష్ మధ్య తలెత్తిన సంఘర్షణ చివరకు అమెరికన్ తిరుగుబాటు యుద్ధానికి దారి తీసి 1775 నుండి 1781 వరకు యుద్ధం కొనసాగింది. |
1860 నాటికి రిపబ్లికన్ పార్టీ సభ్యుడూ తీవ్ర బానిసత్వ వ్యతిరేకి అయిన అబ్రహాం లింకన్ ప్రెసిడేంట్ గా ఎన్నుకొనబడ్డాడు 1863 లో కాంఫిడరసీ లోని బానిసలకు విముక్తి చేస్తూ ఇస్తూ లింకన్ ప్రకటన జారీ చేసాడు. 1865 లో యూనియన్ విజయం తరువాత యు.ఎస్ రాజ్యాంగం మూడు సవరణలను చేసి ఆఫ్రికన్ అమెరికన్లకు ఓటు హక్కును ఇచ్చింది |
1991 నుండి 2001 వరకు యు.ఎస్ చరిత్రలో సుదీర్ఘ ఆర్ధిక విస్తరణ జరిగింది 1998లో బిల్ క్లింటన్ ప్రభుత్వ నిర్వహణలో ఆయన ఎదుర్కొన్న సివిల్ కేసు మరియు అక్రమసంబంధ కేసు క్లింటన్ మోసం అనే అపవాదుకు గురి చేసింది. అయినప్పట్కీ అతడు పదవిలో కొనసాగాడు. 2000 అమెరికా చరిత్రలోనే మొదటి సారిగా అధ్యక్షఎన్నికలలో తలెత్తిన సమస్యను ఉన్నత యు.ఎస్ న్యాయస్థానం తీర్పు ద్వారా పరిష్కరించబడింది. జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ తనయుడు జార్జ్ డబ్ల్యూ బుష్ అధ్యక్షుడు అయ్యాడు. |
2001, సెప్టెంబర్ 11 న అల్ ఖైదా తీవ్రవాదులు న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మరియు వాషింగ్టన్, డి.సి. సమీపంలో ఉన్న పెంటగన్, డి.సి నరమేధంలో షుమారు 3000 మంది ప్రజలు మరణించారు. ఫలితంగా బుష్ ప్రభుత్వం భీతితో అంతర్జాతీయ యుద్ధం ఆరంభించి ఆఫ్ఘనిస్తాన్ మీద దండెత్తి తాలిబాన్ ప్రభుత్వాన్ని గద్దె దించి అల్ఖైదా శిక్షణా శిబిరాలను వైదొలగించింది. |
2008లో అంతర్జాతీయ ఆర్ధిక తిరోగమనం మధ్య మొదటి ఆఫ్రికన్ అమెరికన్ అధ్యక్షుడైన బరాక్ ఒబామా అధ్యక్షుడుగా ఎన్నిక చేయబడ్డాడు. 2011 లో అమెరికన్ త్రిదళ సేనపాకిస్థాన్ మీద దాడి చేసి అల్ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాదెన్ ను హతమార్చింది. |
అమెరికా భూభాగం పడమట పసిఫిక్ మహాసముద్రం, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, ఆగ్నేయాన మెక్సికో అగాధం, ఉత్తరాన కెనడా మరియు దక్షిణాన మెక్సికో దేశాల నడుమ విస్తిరించి ఉంది . భౌగోళికంగా అలాస్కా అమెరికాలోని అన్ని రాష్ట్రాలలోనూ పెద్దది.అలాస్కా అమెరికాకి నైరుతి దిశగా ఆవల ఉంది. దీనికి ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణాన పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. |
అమెరికాలో ప్రతి కుటుంబానికి సగటున ఒక కారు ఉంది. ప్రపంచ దేశాల రక్షణ వ్యయాల్లో అమెరికా వాటా 44శాతం. 25 శాతం ఆఫ్రికన్ అమెరికన్లు నిరుపేదలు.ఇళ్లులేనివారి సంఖ్య 6.64లక్షలు.9.5శాతం నిరుద్యోగ రేటు ఉంది. |
అమెరికా నినాదం : In God We Trust |
అమెరికా జాతీయగీతం : "The Star-Spangled Banner" |
అమెరికా రాజధాని : వాషింగ్టన్ డి.సి. |
అమెరికా జాతీయ భాష : (28 రాష్ట్రాలలో ఆంగ్లం అధికారిక భాష) |
అమెరికా ప్రభుత్వం : కేంద్రీకృత అధ్యక్ష తరహా రాజ్యాంగబద్ధ సమాఖ్య |
అమెరికా అధ్యక్షుడు : బారక్ ఒబామా (డెమొక్రాట్) |
అమెరికా ఉపాధ్యక్షుడు : రిఛర్డ్ 'డిక్' చెనీ (డెమొక్రాట్) |
అమెరికా స్పీకరు : నాన్సీ పెలోసీ (డెమొక్రాట్) |
అమెరికా ప్రధాన న్యాయమూర్తి : జాన్ రాబర్ట్స్ |
అమెరికా స్వాతంత్ర్యం (గ్రేట్ బ్రిటన్ నుండి) : జులై 4 1776 |
అమెరికా జనాభా : 281,421,906 |
అమెరికా జీడీపీ : $14.046 trillion 2 |
అమెరికా కరెన్సీ
: United States dollar ($) (USD
) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment