>> ఆకాశంలో నీటి ఆవిరి, మంచు స్పటికాలతో కూడిన మేఘాలు ఒకదానికొకటి ఒరుసుకోవడం వల్ల అధిక ఓల్టేజీ, కరెంటు విలువలతో కూడిన విద్యుచ్చక్తి ఉత్పన్నం అవడం వల్ల మెరుపులు ఉరుములు వస్తాయి.
>> వాటి నుంచి వెలువడి భూమి వైపు పయనించే విద్యుత్ తరంగాలు, భూమిపై మనం ఏర్పరుచుకున్న విద్యుత్ లైన్లను, టీవీ ఏంటినాలను తాకుతాయి.
>> వాటి నుంచి వాటికి అనుసంధానించిన టీవీ లాంటి పరికరాల్లోకి ఎక్కువ ఓల్టేజిలోఉండే విద్యుత్ ప్రవహించే ఏర్పాటుతో తయారు చేసిన ఆ పరికరాల్లోని భాగాలు పాడవుతాయి.
>> అందువల్ల మెరుపులు, ఉరుములు వచ్చేటప్పుడు టీవీలాంటి పరికరాల్ని కట్టేయడం మంచిది.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment