జనరల్‌ అవేర్‌నెస్‌ - Nov 14



1.    ఎస్కిమోల జన్మ స్థలం ఏది?
    1) అంటార్కిటికా    2) సైబీరియా
    3) 
గ్రీన్‌లాండ్    4) ఆఫ్రికా

2.    ఇండియన్స్‌ ఏ వర్గానికి చెందుతారు?
    1) కాకసాయిడ్‌        2) నీగ్రోయిడ్‌
    3) ఆసా్ట్రలాయిడ్‌        4) మంగోలాయిడ్‌

3.    కడప పర్వత శ్రేణులు వేటి మధ్య ఉన్నాయి?
    1) పాలార్‌, కావేరి       2) గోదావరి, పాలకొండ శ్రేణి
    3) సాత్పురా, మహాదేవ మైకాల్‌ శ్రేణి   4) ఇవేవీ కాదు

4.    డంకన్‌ పాస్‌ ఏ ప్రాంతాల మధ్య ఉంది?
    1) ఉత్తర, తూర్పు, అండమాన్‌  2) అండమాన్‌, నికోబార్‌
    3) ఉత్తర, దక్షిణ అండమాన్‌
    4) దక్షిణ అండమాన్‌, లిటిల్‌ అండమాన్‌

5.    ఏ భౌగోళిక భావనను నిశ్చయత్వం అంటారు?
    1) బ్లాంచెల్స్‌        2) హెన్రీ
    3) ఇలిస్‌ వర్త హంటింగ్‌ టొని   4) కార్ల్‌ రిట్టర్స్‌

6.    జియోగ్రఫీ పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు?
    1) హెరోడొటస్‌        2) టాలమీ
    3) ఎరాస్టోథెన్స్‌        4) ఆలిద్రిసి

7.    కర్కటక రేఖ ఏ దేశం గుండా ప్రయాణించదు?
    1) ఇరాన్‌  2) ఈజిప్ట్‌  3) మెక్సికో  4) ఇండియా

8.    భూ అంతర్భాగంలో ఉండే ఉష్ణోగ్రత ఎంత?
    1) 20,000 డిగ్రీల సెంటీగ్రేడ్‌ 2) 2,000 డిగ్రీల సెంటీగ్రేడ్‌
    3) 6,000 డిగ్రీల సెంటీగ్రేడ్‌ 4) 26,000 డిగ్రీల సెంటీగ్రేడ్‌

9.    ఏ ప్రక్రియతో ఒక శిల రంగు మారుతుంది?
    1) ఎక్స్‌ఫోలియేషన్‌        2) హైడ్రేషన్‌
    3) కార్బోనేషన్‌        4) ఆక్సిడేషన్‌

10.    సాధారణ వాతావరణ పరిస్థితి ఏ ఆవరణంలో ఏర్పడుతుంది?
    1) అయనోస్పియర్‌        2) సా్ట్రటోస్పియర్‌
    3) ట్రోపోస్పియర్‌        4) మెసోస్పియర్‌

11.    ఉడ్‌ సెల్యులోజ్‌ను ఏమంటారు?
    1) కార్క్‌  2) టానిస్‌  3) బాలాటా  4) రెయాన్‌

12.    అత్యధిక జన సాంద్రత ఉన్న దేశం ఏది?
    1) చైనా 2) ఇండియా 3) సింగపూర్‌ 4) కెనడా

13.    వేట ద్వారా ఆహారం సంపాదించుకొనే లక్షణం ఉన్న తెగ ఏది?
    1) టర్క్‌  2) నీగ్రో    3) బుష్‌మెన్‌  4) మాసాఒయిస్‌

14.    అమెరికాలో వరి ఏ ప్రాంతంలో పండుతుంది?
    1) టెక్సాస్‌        2) పశ్చిమ ప్రాంతం
    3) కొలరాడో        4) ఇవేవీ కాదు

15.    మనదేశంలో బాక్సైట్‌ ఏ రాషా్ట్రల్లో లభిస్తుంది?
    1) కర్ణాటక, ఒడిశా          2) జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌
    3) ఒడిశా, గోవా           4) మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌

16.    సూయజ్‌ కెనాల్‌ను ఎప్పుడు నిర్మించారు?
    1) 1867   2) 1868   3) 1869   4) 1870

17.    బిర్లా ఇండసి్ట్రయల్‌, టెక్నాలజికల్‌ మ్యూజియం ఎక్కడ ఉన్నాయి?
    1) బెంగళూరు 2) చంఢీగఢ్‌ 3) లక్నో 4) కోల్‌కతా

18.    మనదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక అటవీ ప్రాంతం ఉంది?
    1) హిమాచల్‌ ప్రదేశ్‌     2) మధ్యప్రదేశ్‌
    3) కర్ణాటక                4) అసోం

19.    మనదేశంలో మొదటి సిమెంటు ఫ్యాక్టరీ(1904) ఎక్కడ నెలకొల్పారు?
    1) మద్రాస్‌  2) రాంచి 3) హజారీబాగ్‌  4) హైదరాబాద్‌

20.    రైల్వే పాసింజర్‌ కోచ్‌లను ఎక్కడ తయారు చేస్తారు?
1) వారణాసి        2) చిత్తరంజన్‌
3) పెరంబూర్‌         4) కోల్‌కతా

21.అత్యల్ప సెక్స్‌ రేషియో ఉన్న ప్రాంతం ఏది?
1) పంజాబ్‌         2) రాజస్థాన్‌
3) సిక్కిం    4) అండమాన్‌ నికోబార్‌

22.దక్కన్‌ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుంచి విభజిస్తున్న నది ఏది?
1) నర్మద     2) కృష్ణ
3) చంబల్‌    4) గోదావరి

23.ఒపెక్‌ దేశాల్లో సభ్యత్వం లేని దేశం ఏది?
1) సౌదీ అరేబియా    2) ఇండోనేషియా
3) ఇండియా    4) వెనిజులా

24. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే కూడలి ఎక్కడ ఉంది?
      1) న్యూయార్క్‌        2) చికాగో
      3) ఫిలడెల్ఫియా        4) బోస్టన్‌

25.    భారతదేశం ఎందుకు లౌకిక రాజ్యం అయింది?
    1) అన్ని మతాలకు సమాన రక్షణ కల్పించడంతో  2) రాజ్యంలో అధికార మతం లేకపోవడంతో
    3) మత ప్రాతిపదికపై విచక్షణ లేకపోవడంతో
    4) వీటన్నింటితో

26.    మనదేశంలో ప్రధాన రాజకీయ శక్తి ఏది?
    1) రాజ్యాగం, పార్లమెంటు2) పార్లమెంటు, రాష్ట్రపతి
    3) పార్లమెంటు, రాషా్ట్రల శాసన సభలు
    4) దేశంలోని ప్రజలు

27.    భారత రాజ్యాంగ నిర్మతల మనస్సును, ఆలోచనలను ప్రతిఫలించే భారత రాజ్యాంగ భాగం ఏది?
    1) పీఠిక           2) ప్రాథమిక హక్కులు
    3) ఆదేశిక సూత్రాలు    4) అత్యవసర నిబంధనలు

28.    ఇండియన్‌ యూనియన్‌ పేరు ఇండియా లేదా దేనిని సూచిస్తుంది?
    1) హిందూస్తాన్‌        2) భారత్‌
    3) భరత వర్గ        4) ఇవేవీ కాదు

29.    అంధుల జనాభా అత్యధికంగా గల దేశం ఏది?
    1) చైనా 2) బ్రెజిల్‌ 3) ఇండియా 4) ఇండోనేషియా

30.    అంతర్జాతీయ పారదర్శక సంస్థ ఏది అత్యంత  లంచగొండి దేశమని చెప్పింది?
    1) మయన్మార్‌        2) సోమాలియా
    3) ఇరాక్‌                    4) సియెర్రాలియోన్‌

31.    ‘ఇండియాస్‌ ఎక్స్‌టర్నల్‌ ఇంటిలిజెన్స్‌ సీక్రెట్స్‌ ఆఫ్‌ రా’ పుస్తక రచయిత ఎవరు?
    1) సి. కె. చక్రవర్తి    2) విజయ్‌ కుమార్‌ మిశ్రా
    3) విజయ్‌ కె. నంబియార్‌  
    4) మేజర్‌ జనరల్‌ వి. కె. సింగ్‌ (రిటైర్డ్‌)

32.    ఎ-1 నగరంగా ఇటీవల దేన్ని గుర్తించారు?
    1) హైదరాబాద్‌ 2) బెంగళూరు 3) పూనె 4) నాసిక్‌

33.    2008లో ‘రాజీవ్‌ గాంధీ అవార్డ్‌ ఆఫ్‌ జర్నలిజం’ను ఎవరికి ప్రదానం చేశారు?
    1) వీర్‌ సంఘ్వి               2) కుల్‌దీప్‌ నయర్‌
    3) ప్రభు చావ్లా           4) వీరెవరికీ కాదు

34.    భక్త తుకారాం ఎవరి సమకాలీకుడు?
    1) బాబర్ 2) అక్బర్‌ 3) జహంగీర్‌ 4) ఔరంగజేబు

35.    ప్రాచీన తక్షశిల నగరం ఏ నదుల మధ్య ఉండేది?
    1) సింధు, జీలం        2) జీలం, చీనాబ్‌
    3) బీనాబ్‌, రావి        4) రావి, బియాస్‌

36.    సత్యాగ్రహ ఉద్యమాన్ని గాంధీజీ ఎక్కడ ప్రారంభించారు?
    1) అహ్మదాబాద్‌ 2) బారోల్డి 3) చంపారన్‌ 4) ఖేడా

37.    సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు భారత గవర్నర్‌ జనరల్‌ ఎవరు?
    1) కానింగ్‌  2) డల్హౌసీ 3) హార్డింగ్‌  4) లిట్టన్‌

38.    మానవుడు మొదట ఏ ఖనిజాన్ని వాడాడు?
    1) ఇనుము   2) ఇత్తడి   3) రాగి   4) తగరం

39.    ఇళ్ల ప్రధాన ద్వారాలు రహదారుల వైపు ఏ నగరంలో ఉండేవి?
    1) కలిబంగన్‌     2) లోతల్‌
    3) మెహెంజోధార్‌ 4) చున్హుదెరా

40.    వేదకాలంలో పనిస్‌లు దేనిని నియంత్రించేవారు?
    1) వ్యాపారం 2) వ్యవసాయం 3) గోపాలకులు 4) భూమి

41. బింబిసారుడు ఏ వంశానికి చెందినవాడు?
    1) మౌర్య వంశం               2) హర్యంక్‌ వంశం
    3) శృంగ వంశం        4) నంద వంశం

42.    బుద్దిజం ఎక్కడ ప్రారంభమైంది?
    1) రాజగృహ 2) లుంబిని 3) సారనాథ్‌ 4) కుసినగర్‌

43.    సంగమ సాహిత్య భాష ఏది?
    1) సంస్కృతం 2) పాళి  3) ప్రాకృత 4) తమిళ

44.    గుప్త వంశ పాలన ఎవరితో ప్రారంభమైంది?
    1) శ్రీగుప్త        2) చంద్ర గుప్త
    3) సముద్ర గుప్త        4) చరణ గుప్త

45.    దిన్‌-ఇ-ఇలాహి ఏ గ్రంథం?
    1) ఇస్లాం మత గ్రంథం  2) కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌
    3) ఇస్లాం ప్రభావంతో రాసిన హిందూ చట్టం
    4) ఇవేవీ కాదు

46.    ‘‘మై ఇండియన్‌ ఇయర్స్‌’’ ఎవరు రచించారు?
    1) లార్డ్‌ హార్డింగ్‌           2) మైఖేల్‌ ఒ డయ్యిర్‌
    3) లార్డ్‌ కర్జన్‌             4) లార్డ్‌ వావెల్‌

47.    ‘‘సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ సొసైటీ’’ని ఎవరు స్థాపించారు?
    1) దాదాబాయి నౌరోజీ    2) మోతీలాల్‌ నెహ్రూ
    3) మదన్ మోహన్ మాలవ్యా   4) గోపాల్‌ కృష్ణ గోఖలే

48.    మధ్యయుగ భారతదేశంలో మార్కెట్‌ నియంత్రిత పద్ధతులను ఎవరు ప్రవేశపెట్టారు?
    1) బాబర్        2) అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ
    3) షేర్‌ షా సూరి        4) బాల్బన్‌

49.    ఉత్తమ సంగీత దర్శకుడిగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును అందుకున్నది ఎవరు?
    1) ఇళయరాజా        2) కీరవాణి
    3) మణిశర్మ        4) రెహ్మాన్‌

50.    అశోకుని కాలంలో నిర్వహించిన బౌద్ద సమావేశం ఎన్నోది?
    1) మొదటిది 2) రెండోది 3 ) మూడోది 4) నాలుగోది

51.    ‘వాతాపి కొండ’ ఏ పల్లవ రాజు బిరుదు?
    1) మహేంద్ర వర్మ1              2) నరసింహ వర్మ1
    3) నరసింహ వర్మ2              4) మహేంద్ర వర్మ2

52.    మౌర్య చక్రవర్తుల్లో చివరి వాడు ఎవరు?
    1) ఉదయనుడు        2) దశరథుడు
    3) కునాలుడు        4) బృహధ్రతుడు

53.    బ్రిటిష్‌ వారు మొదటి ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేశారు?
    1) గోవా 2) హుగ్లి 3) ఆర్కాట్‌ 4) సూరత్‌

54.    కృష్ణదేవరాయలు ఎవరి సమకాలికుడు?
    1) బాబర్        2) ఫిరోజ్‌ తుగ్లక్‌
    3) అక్బర్‌        4) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ

55.    రైల్వేను మనదేశంలో ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్‌ జనరల్‌ ఎవరు?
    1) డల్హౌసీ 2) కర్జన్‌  3) కానింగ్‌ 4) రిపన్‌

56.    భారత గవర్నర్‌ జనరల్‌ కార్యాలయానికి ‘వైస్రాయ్‌’ బిరుదు ఎపుడు దక్కింది?
    1) 1862 ఎ.డి 2) 1858 ఎ.డి 3) 1856 ఎ.డి 4) 1848 ఎ.డి

57.    మనదేశంలో బంగారు నాణేలను మొదట ఎవరు ఉపయోగించారు?
    1) కుషాణులు        2) పార్థవులు
    3) శాకులు        4) ఇండో- గ్రీకులు

58.    భారత రాజ్యాంగ్యం అవశేష అధికారాల్ని ఎవరికి ఇచ్చింది?
    1) కేంద్ర ప్రభుత్వానికి      2) రాష్ట్ర ప్రభుత్వాలకు
    3) న్యాయ శాఖకు     4) ఇవేవీ కాదు

59.    ప్రత్యక్ష పన్నులు ఎందుకు సక్రమమైనవి?
    1) ఎక్కువ ఆదాయాన్ని తెస్తాయి        2) సులభంగా  వసూలు చేయవచ్చు
    3) వ్యక్తి ఆదాయాన్ని బట్టి పన్ను వసూలు చేసే సౌలభ్యం ఉంది      4) ఈ పన్నులు ఎక్కువ మంది కడతారు

60.    పరిశ్రమలు మూతపడడానికి ఏది అంతరంగిక కారణం కాదు?
    1) అసమర్థ పాలక వ్యవస్థ    2) కరెంటు కొరత
    3) తప్పుడు డివిడెండ్‌ పాలసీ 4) వనరులను మళ్లించడం

61.    రిజర్వు బ్యాంక్‌ ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీలు దేనికి సంబంధించినవి?
    1) షేర్ల కొనుగోలు, అమ్మకం
    2) విదేశీ మారక ద్రవ్యాన్ని వేలం వేయడం
    3) సెక్యురిటీలను కొనడం, అమ్మడం  4) బంగారు కొనుగోళ్లు

62.    ప్లానింగ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఎటువంటి వ్యవస్థ?
    1) చట్టపరమైన వ్యవస్థ     2) సలహా సంఘం
    3) రాజ్యాంగ పరమైన వ్యవస్థ  4) స్వేచ్చ కలిగిన వ్యవస్థ

63.    ఫోర్త్‌ ఎస్టేట్‌ అంటే ఏమిటి?
    1) వార్తా పత్రికలు            2) కార్యనిర్వాహకశాఖ
    3) న్యాయశాఖ                    4) బ్యూరోక్రసీ

64.    కింది వాటిలో కేంద్ర పన్నుల జాబితాలో లేనిది ఏది?
    1) ఇన్‌కమ్‌ టాక్స్‌              2) కస్టమ్స్‌
    3) భూమి పన్ను              4) కార్పొరేషన్‌ టాక్స్‌

65.    450లో 30 శాతం ఎంత అవుతుంది?
    1) 150        2) 135    3) 180    4) 1350