1. ప్రీ-కాంబ్రియన్ శకం ఏ కాలానికి
సంబంధించింది?
|
1) 270 మిలియన్ సంవత్సరాలు |
2) 570 మిలియన్ సంవత్సరాలు |
3) 400 మిలియన్ సంవత్సరాలు |
4) 500 మిలియన్ సంవత్సరాలు |
2. టండ్రా అడవులు ఎక్కడ ఉన్నాయి? |
1) పశ్చిమ యూరోప్ 2) దక్షిణ అమెరికా 3) ఆసే్ట్రలియా 4) కెనడా |
3. అంతర్జాతీయ దినరేఖగా ఏ రేఖాంశాన్ని నిర్ణయించారు? |
1) 160 డిగ్రీల తూర్పు రేఖాంశం 2) 180 డిగ్రీల తూర్పు, పశ్చిమ రేఖాంశం |
3) 140 డిగ్రీల పశ్చిమ రేఖాంశం 4) 120 డిగ్రీల తూర్పు రేఖాంశం |
4. ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? |
ఎ) కాంగో పరివాహక ప్రాంతం
బి) అమెజాన్ పరివాహక ప్రాంతం సి) మలేషియా ద్వీపకల్పం డి) ఇండోనేషియా ద్వీపకల్పం |
1) బి, సి, డి 2) ఎ, బి, సి 3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి |
5. ఉష్ణమండల ఎడారులు ప్రధానంగా ఎక్కడ ఉన్నాయి? |
1) 300 - 400 అక్షాంశాల మధ్య 2) భూమధ్య రేఖకి ఇరువైపులా |
3) 200- 300 అక్షాంశాల మధ్య 4) భూమధ్య రేఖకి పై భాగాన |
6. ఆఫ్రికా ఖండంలోని పెద్ద ఏడారి ఏది? |
1) అరేబియా 2) థార్ 3) కలహరి 4) సహారా |
7. కిందివానిలో సరిగా జతపరచినది ఏది? |
1) అటకామా- ఉత్తర అమెరికా 2) ఆసే్ట్రలియన్ ఎడారి- దక్షిణార్థ గోళం |
3) సోనోరాన్- దక్షిణ అమెరికా 4) కలహరి- ఆసే్ట్రలియా |
8. ఆసే్ట్రలియన్ ఎడారిలో కనిపించే జాతులు ఏవి? |
ఎ) బుష్‌మెన్ బి) బిండిబాలు సి) టౌరేగులు డి) బిడోనియన్ |
1) ఎ, బి 2) ఎ, సి 3) ఎ, డి 4) బి |
9. మధ్య అక్షాంశ ఎడారులు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? |
ఎ) అమెరికాలో గ్రేట్ బేసిన్ ప్రాంతం బి) గ్రేట్ బ్రిటన్ సి) గోబి ప్రాంతం డి) ఇరాన్ |
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి 3) ఎ, సి, డి 4) ఎ, బి, డి |
10. అయన రేఖ తృణ మండలాలు ఎక్కడ ఉన్నాయి? |
1) ఉత్తర అమెరికా 2) ఆసే్ట్రలియా 3) ఐరోపా 4) దక్షిణ అమెరికా |
11. సమశీతోష్ణ తృణ మండలాలను ఆసే్ట్రలియాలో ఏమని పిలుస్తారు? |
1) డౌన్స్ 2) ప్రయరీలు 3) వెల్డులు 4) పంపాలు |
12. కిందివానిలో రుతుపవన శీతోష్ణస్థితి మండల ప్రాంతాలు ఏవి? |
ఎ) ఇండియా బి) కాంబోడియా సి) థాయ్‌లాండ్ డి) మయన్మార్ |
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి 3) ఎ, బి, డి 4) బి, సి, డి |
13. మధ్యధర శీతోష్ణస్థితి మండలం లో సగటు వర్షపాతం ఎంత? |
ఎ) 80 నుంచి 100 సెంమీల మధ్య బి) 50 నుంచి 75 సెంమీల మధ్య |
సి) 100 సెంమీల పైన డి) 150 నుంచి 200 సెంమీల మధ్య |
14. దక్షిణ కాలిఫోర్నియాలో వీచే ఉష్ణ పవనాలను ఏమని పిలుస్తారు? |
1) మిస్ట్రల్ 2) సిరాకో 3) శాంట అనా 4) బోరా |
15. మధ్యధర శీతోష్ణమండలం ఎక్కడ ఉంది? |
1) 100 నుంచి 200 అక్షాంశాల మధ్య |
2) భూమధ్య రేఖకి ఇరువైపులా 300 నుంచి 450
అక్షాంశాల మధ్య 3) 250 నుంచి 300 అక్షాంశాల మధ్య |
4) కర్కటరేఖకి ఇరువైపులా |
16. ఇసుక రాయి ఎటువంటి శిల? |
1) అవక్షేప శిల 2) రూపాంతర శిల 3) అగ్ని శిల 4) పైవన్నీ |
17. వెచ్చని సమశీతోష్ణస్థితి మండలం లోని ఖండాలకు తూర్పుగా 300 - 400 అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? |
1) రుతుపవన శీతోష్ణస్థితి మండలం 2) మధ్యధర శీతోష్ణస్థితి మండలం |
3) చైనా రీతి సమశీతోష్ణ స్థితి మండలం 4) సమశీతోష్ణ మండలం |
18. 550 ఉత్తర అక్షాంశం నుంచి ఆర్కిటిక్ వలయం వరకు వ్యాపించి ఉన్న శీతోష్ణస్థితి ఏది? |
1) ఉపధ్రువ 2) మధ్యధర 3) సమశీతోష్ణ 4) రుతుపవన |
19. టండ్రా మండలంలో వర్షపాతం ఎంత? |
1) 10 సెంమీల కంటే తక్కువ 2) కనీసం 50
సెంమీ లు ఉంటుంది 3) 25 సెం.మీల కంటే తక్కువ 4) 50 సెంమీల వరకు ఉంటుంది |
20. కిందివానిలో టండ్రా మండల ప్రాంతాలు ఏవి? |
ఎ) కెనడ ఉత్తర తీర ప్రాంతం బి) అలస్కా సి) న్యూజిలాండ్ డి) గ్రీన్‌లాండ్ |
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి 3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి |
21. పసిఫిక్ మహాసముద్ర వైశాల్యం ఎంత? |
1) 125,000,000 చ.కిమీ 2)
115,100,000 చకిమీ 3) 201,168,000 చకిమీ 4) 165,760,000 చకిమీ |
22. అమెరికాలోని రాకీ పర్వతాలు ఎటువంటివి? |
1) అగ్ని
పర్వతాలు 2) ఖండ
పర్వతాలు 3) ముడుత
పర్వతాలు 4) అవశిష్ఠ పర్వతాలు |
23. కిందివానిలో సరిగా జతచేయనిది ఏది? |
1) అమెరికా- బ్లాక్ ఫారెస్ట్ 2) యూరప్
- ఆల్ఫ్స్ 3) చిలీ- అకాంకాగ్వా 4) జపాన్- ప్యూజియోమా |
24. కింది అక్షాంశాలన్నింటిలో పెద్దది ఏది? |
1) భూమధ్య రేఖ 2) కర్కట రేఖ 3) మకర రేఖ 4) అంటార్కిటిక్ వలయం |
25. సూర్యునికి, భూమికి మధ్యగల దూరం అధి కంగా ఉండే రోజు ఏది? |
1) మార్చి 21 2) సెప్టెంబరు 23 3) జూలై 4 4) డిసెంబరు 22 |
26. అగ్ని పర్వతాలకు ఉన్న మరోపేరు ఏమిటి? |
1) ఖండ పర్వతాలు 2) ముడుత
పర్వతాలు 3) పర్వతాంతరాలు 4) సంచిత పర్వతాలు |
27. టిబెట్ పీఠభూమి ఏ రకపు పీఠభూమి? |
1) గిరిపద పీఠభూములు
2) పర్వతాంతర పీఠభూములు 3) ఖండాంతర పీఠభూములు 4) పైవేవీకావు |
28. పెటగోనియా పీఠభూమి ఏ రకానికి చెందింది? |
1) గిరిపద పీఠభూములు 2) ఖండాంతర
పీఠభూములు 3) పర్వతాంతర పీఠభూములు 4) పైవేవీకావు |
29. భూ ఉపరితలంపై అవక్షేపశిలలు, అగ్నిశిలలు ఏ నిష్పత్తిలో విస్తరించి ఉన్నాయి? |
1) 50: 50 2) 75:25 3) 95:5 4) 60:40 |
30. కొన్ని చోట్ల భూభాగంపై నాగలి చాళ్ల వంటి పగుళ్ల నుంచి శిలాద్రవం ప్రవహించి విస్తృతమైన ప్రాంతాన్ని లావాతో కప్పి ఎత్తయిన పీఠభూమిని నిర్మిస్తుంది. దీనికి ఉదాహరణ ఏమిటి? |
1) మెక్సికో
పీఠభూమి 2) పామీర్ పీఠభూమి
3) కొలంబియా పీఠభూమి 4) దక్కన్ పీఠభూమి |
31. వరద మైదానాలకి ఉదాహరణ ఏమిటి? |
1) గంగా సింధు మైదానం 2) సైబీరియా మైదానం 3) నెదర్లాండ్స్ తీరమైదానాలు 4) కావేరి మైదానం |
32. గాలి తీసుకొచ్చిన ధూళితో ఏర్పడ్డ మైదానాలు ఏవి? |
1) కోత మైదానం 2) లోయస్ మైదానాలు 3) నిక్షేపిత మైదానాలు 4) తీరమైదానాలు |
33. భూ అంతర్భాగంలోని శిలాద్రవాన్ని ఏమంటారు? |
1) లావా 2) మాగ్మా 3) బాతోలిత్ 4) లాపోలిత్ |
34. పెనిప్లేస్‌లు అని ఏ మైదానాలను పిలుస్తారు? |
1) నిక్షేపిత మైదానాలు 2) తీర మైదానాలు 3) కోతమైదానాలు 4) వరద ప్రాంత మైదానాలు |
35. అగ్ని పర్వతం విస్ఫోటనం తరవాత పర్వత శిఖరం మధ్య భాగంలో ఏర్పడే గుండాన్ని ఏమంటారు? |
1) కాల్డెరా 2) పాట్‌హోల్ 3) అగ్నిపర్వత గ్రీవం 4) సింక్‌హోల్ |
36. కిందివానిని సరిగా జతపరచండి |
ఎ. కాటోపాక్సీ 1. సిసిలి ద్వీపం |
బి. ఎట్నా 2. ఈక్వెడార్ |
సి. మానలోవా 3. టాంజానియా, |
డి. కిలిమంజారో 4. హవాయి దీవులు |
1) ఎ-4, బి-1, సి-2, డి-3 2) ఎ-2, బి-3, సి-4, డి-2 |
3) ఎ-2, బి-1, సి-2, డి-4 4) ఎ-2, బి-1, సి-4, డి-3 |
37. ప్యూజియామా అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? |
1) జపాన్ 2) ఇటలీ 3) హవాయి ద్వీపాలు 4) నేపుల్స్ అఖాతం |
38. అగ్ని పర్వతం బద్దలైనపుడు ఏర్పడే చిన్న చిన్న రాతిముక్కలను ఏమంటారు? |
1) అగ్ని పర్వత ధూళి 2) లాపిలి 3) అగ్ని పర్వత బాంబులు 4) ప్యూమిన్ |
39. భూకంపాలకి కారణాలు ఏమిటి? |
ఎ) ఉపరితల కారణాలు బి) అగ్ని
పర్వత సంబంధ కారణాలు సి) పాతాళ సంబంధ కారణాలు డి) విరూప కారక కారణాలు |
1) బి, సి, డి 2) ఎ, బి, డి |
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి |
40. భూకంపాలు సాధారణంగా ఏర్పడే ప్రాంతాలు ఏవి? |
1) అగ్ని పర్వత
ప్రాంతాలు 2) నదీలోయలు 3) తీరమైదానాలు 4) లోతట్టు ప్రాంతాలు |
41. పోటుపాటుల వల్ల సముద్రంలో నీరు కొంత ఎత్తువరకు ఎగసిపడుతుంది . దీనిని ఏమంటారు? |
1) శృంగ
తరంగాలు 2) పర్వవేలా తరంగాలు
3) లఘువేలా తరంగాలు 4) వేలా తరంగాలు |
42. పోటుపాటుల వల్ల కలిగే నీటి మట్టపు భేదాన్ని ఏమంటారు? |
1) బాదియర్ 2) తరంగదైర్ఘ్యం 3) వేలాపరిమితి 4) అభికేంద్ర పరిమితి |
43. నవీన ముడుత పర్వతాలు ఎప్పుడు ఏర్పడ్డాయి? |
1) కార్బోనిఫెరస్ 2) టెర్షియరి 3) క్రెటీషియస్ 4) ప్రీ కాంబ్రియన్ |
44. అంటార్కిటికా ఖండంలో ఎత్తయినది ఏది? |
1) కాటబాటిక్ 2) ట్రాన్స్ అంటార్కిటికా 3) విన్‌సన్ మాసిఫ్ 4) మైత్రి |
45. ‘అరోరా బోరియాలిస్’ ఎక్కడ కనిపిస్తుంది? |
1) దక్షిణార్థ
గోళం 2) పూర్వార్థ గోళం
3) పశ్చిమార్థ గోళం 4) ఉత్తరార్థ గోళం |
46. బైకాల్ మంచి నీటి సరస్సు ఎక్కడ ఉంది? |
1) కెనడా 2) రష్యా 3) ఉగాండా 4) అమెరికా |
47. కిందివానిలో సరిగా జతచేసినది ఏది? |
1) సాంబార్- ఇండియా 2) కాస్పియన్-
అమెరికా 3) గ్రేట్ బియర్- మలావి, మొజాంబిక్ 4) న్యాస- కెన్యా |
48. కిందివానిలో ఏది ఆసియ ఖండంలోని ఎడారి కాదు? |
1) థార్ 2) కారాకుమ్ 3) తక్లామకాన్ 4) సోనారాన్ |
49. నైలునది ఏ సముద్రంలో కలుస్తుంది? |
1)
మధ్యధరా 2) దక్షిణ
చైనా సముద్రం 3) పసిఫిక్ సముద్రం 4) మెక్సికో సింధుశాఖ |
50. కిందివానిని సరిగా జతపరచండి |
ఎ. ఏంజిల్ 1. ఫ్రాన్స్ |
బి. తుగేలా 2. వెనెజులా |
సి. రిబ్బన్ 3. కాలిఫోర్నియా |
డి. గవార్నీ 4. దక్షిణాఫ్రికా |
1) ఎ-2, బి-4, సి-1, డి-3 2) ఎ-2,
బి-1, సి-3, డి-4 3) ఎ-2, బి-4, సి-3, డి-1 4) ఎ-3, బి-1, సి-4, డి-2 |
జాగ్రఫీ ప్రాక్టిస్ బిట్స్ - 30/10/2014
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment