అక్టోబర్ కరెంట్ అఫైర్స్



 ఆర్థిక సలహాదారుగా అరవింద్‌ సుబ్రమణ్యన్‌

కేంద్రప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ముఖ్య సలహాదారుగా అరవింద్‌ సుబ్రమణ్యన్‌ను 
అక్టోబర్‌ 16న నియమించింది. అంతర్జాతీయ అవగాహన కలిగిన ఆర్థికవేత్తను ముఖ్య
 సలహాదారు పదవికి నియమించడం ఇటీవలికాలంలో ఇది మూడోసారి. వాషింగ్టన్‌కు 
చెందిన ప్రపంచ అభివృద్ధి కేంద్రం, పీటర్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ 
ఎకనామిక్స్‌లలో సీనియర్‌ సభ్యునిగా గతంలో ఆయన ఉన్నారు. 2013 సెప్టెంబర్‌ 
4న ఆర్‌బిఐ గవర్నర్‌గా రఘురాం రాజన్‌ వెళ్లడంతో ఆ స్థానం అప్పటినుంచి ఖాళీగా ఉంది.


రఘురాం రాజన్‌కు అవార్డు
భారత రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘురాం రాజన్‌ యూరో మని 2014 ఉత్తమ సెంట్రల్‌బ్యాంక్‌ గవర్నర్‌
 అవార్డును వాషింగ్టన్‌లో అక్టోబర్‌ 10న అందుకున్నారు. 2013లో ఈ అవార్డు బ్యాంక్‌ ఆఫ్‌ మెక్సికో 
గవర్నర్‌ ఆగస్టీన్‌ కార్స్తేన్స్‌కు లభించింది. రాజన్‌ ఆర్‌బిఐ23వ గవర్నర్‌. 2003 అక్టోబర్‌ నుంచి 2006 
డిసెంబర్‌ వరకు అంతర్జాతీయ ద్రవ్యనిధి ముఖ్య ఆర్థికవేత్తగా రాజన్‌ ఉన్నారు. 2008లో అప్పటి ప్రధాన 
మంత్రి మన్మోహన్‌సింగ్‌కు గౌరవ ఆర్థిక సలహాదారగా పనిచేశారు. 2011లో నాస్కామ్‌ నుంచి గ్లోబల్‌ 
ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు, 2012లో ఇన్ఫోసిస్‌ ఆర్థికశాస్త్రం అవార్డు, 2013లో సెంటర్‌ ఫర్‌ 
ఫైనాన్షి యల్‌ స్టడీస్‌ డచ్చిస్‌ బ్యాంకు అవార్డును రాజన్‌ అందుకున్నారు.


‘నిర్భయ క్రూయిజ్‌’ విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సబ్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి నిర్భయను అక్టోబర్‌ 17న 
శాస్త్రవేత్తలు ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి విజయవంతంగా
 ప్రయోగించారు. అణ్వసా్త్రలను మోసుకువెళ్లగల ఈ క్షిపణిని నేల, ఆకాశం, నౌక జలంతర్గామి 
నుంచి ప్రయోగించే వీలుంది. భారత రష్యా సంయుక్తంగా రూపొందించిన బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ 
క్షిపణి 290 కిలోమీటర్ల లక్ష్యాన్ని సూపర్‌ సోనిక్‌ వేగంతో చేధిసే,్త నిర్భయ 1000 కిలోమీటర్లకు 
పైగా ప్రయాణిస్తుంది. అమెరికా రూపొందించిన తోమహాక్‌, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ క్షిపణులకు 
పోటీగా భారత్‌ దీనిని తయారుచేసింది. నిర్భయ ప్రాజెక్టు డైరెక్టర్‌ వసంతశాసి్త్ర వీటిని పర్యవేక్షించారు.


సంజయ రాజారామ్‌కు ఫుడ్‌ ప్రైజ్‌
భారత్‌లో జన్మించిన మెక్సికో పౌరుడు, వృక్ష శాస్త్రవేత్త డాక్టర్‌ సంజయ రాజారామ్‌కు 2014
 ప్రపంచ ఆహార పురస్కారం లభించింది. గోధుమ పంట ఉత్పాదకత పెంచడానికి రాజారామ్‌ 
విశేష కృషి చేశారు.ఈ కృషి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమ ఉత్పత్తి 200 మిలియన్‌ 
టన్నుల మేర పెరిగింది. రాజారామ్‌ వివిధ సంకరీకరణ పద్ధతుల ద్వారా అధిక పోషక విలువలున్న, 
అధిక దిగుబడినిచ్చే మేలుజాతి గోధు వంగడాలను సృష్టించారు. మొత్తం 480 రకాల గోధుమ
 వంగడాలను 41 దేశాల్లో విడుదల చేశారు. సంజయ రాజారామ్‌ 1943లో ఉత్తర్రపదేశ్‌లో 
జన్మించారు. అమెరికాలోని డెమోయిన్‌లో ఉన్న అయోవా రాష్ట్ర విశ్వవిద్యాలయంలో పురస్కార 
ప్రదానోత్సవం జరిగింది.


కక్ష్యలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1 సి
ఇస్రో భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ 
శాటిలైట్‌ సిస్టమ్‌)లోని మూడోవైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1సి ఉపగ్రహాన్ని విజయవంతంగా
 2014 అక్టోబర్‌ 15న నింగిలోకి పంపింది. లిపఎస్‌ఎల్‌విసి-26 రాకెట్‌ ద్వారా ఇస్రో ఈ ఉపగ్రహాన్ని 
కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌దావన్‌ అంతరిక్షకేంద్రం నుంచి 
ఈ ప్రయోగం జరిగింది. సొంత నావిగేషన్‌ వ్యవస్థను ఏర్పర్చుకోవడానికి మొత్తం ఏడు ఉపగ్రహాలు 
అవసరం కాగా ఇది మూడోది. 2015 నాటి ఈ వ్యవస్థ సిద్ధమవుతుంది. ఇప్పటివరకు అమెరికా 
(జిపిఎస్‌), రష్యా (గ్లోనాస్‌), ఐరోపా (గెలీలియో), చైనా (బయ్‌డొవ్‌), జపాన్‌ (క్వాసీ-జెనిత్‌) దేశాలకు 
మాత్రమే సొంత నావిగేషన్‌ వ్యవస్థ ఉంది. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి26 పిఎస్‌ఓఎల్‌వి 
శ్రేణిలో 28వ వాహకనౌక ఎక్సెల్‌ వర్షన్‌కు సంబంధించి ఇది ఏడో ప్రయోగం. ఇప్పటివరకు 28 
పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు జరగ్గా తొలిసారి జరిగిన ప్రయోగం తప్ప మిగతా 27 విజయవంతమయ్యాయి.
 లిపఎస్‌ఎల్‌వి-సి26కి 100 కోట్లు, ఐఆర్‌ఎస్‌ఎస్‌-1సి ఉపగ్రహానికి 142 కోట్లు ఖర్చుచేశారు.


కేంద్ర జలవనరుల సలహాదారుగా శ్రీరామ్‌
కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ సలహాదారుగా తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన
 వెదిరె శ్రీరామ్‌ నియమితులయ్యారు. గంగానది ప్రక్షా ళన, నదుల అనుసంధానం, సురక్షిత తాగునీరు
 వసతుల కల్పన, వ్యవసాయానికి సాగునీటి ఏర్పాట్లు వంటి అంశాల్లో కేంద్రప్రభుత్వానికి ఆయన 
సలహాలు ఇవ్వనున్నారు. 15 సంవత్సరాలపాటు అమెరికాలో ఇంజనీర్‌గా పనిచేసిన శ్రీరామ్‌ 2009లో 
భారత్‌కు తిరిగివచ్చారు. అప్పటినుంచి బిజెపి జల నిర్వహణ విభాగం జాతీయ కన్వీనర్‌గా బాధ్యతలు 
నిర్వహిస్తున్నారు. ముల్లపెరియార్‌ డ్యామ్‌పై పరిశోధన జరిపిన బృందంలో, జల వనరులపై ఏర్పాటైన 
పార్లమెంటరీ స్థాయీసంఘంలో, రాజస్థాన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌లో శ్రీరామ్‌ సభ్యునిగా 
ఉన్నారు. ‘వాటర్‌ గ్రిడ్‌ ఫర్‌ తెలంగాణ, ఎపి యూజింగ్‌ రివర్స్‌ గోదావరి, కృషా’్ణ అనే పేరుతో శ్రీరామ్‌ 
రాసిన పుస్తకం బహుళ ప్రజాదరణ పొందింది. ఆయన ఇటీవల రాసిన గుజరాత్‌ సక్సెస్‌ స్టోరీ ఇన్‌ 
వాటర్‌ మేనేజ్‌మెంట్‌ పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.


‘టైమ్స్‌’ జాబితాలో మలాలా
ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన కౌమార బాలల్లో నోబెల్‌ శాంతి బహుమతి విజేత మలాలా 
యూసఫ్‌ జాయ్‌ స్థానం సంపాదించుకుంది. టైమ్స్‌ మేగజైన్‌ విడుదల చేసిన 25 మందితో కూడిన 
ప్రపంచ అత్యంత ప్రభావవంతమైన కౌమార బాలలు-2014 జాబితాలో ఒబామా ఇద్దరు కుమార్తెలు, 
పెన్సిల్వేనియా బేస్‌బాల్‌ క్రీడాకారిణి మోనే డేవిస్‌, హంగ్‌కాంగ్‌ ఉద్యమానికి ప్రతిరూపంగా నిలిచిన
 జోషువ వాంగ్‌ తదితరులు ఉన్నారు.


సచిన్‌ టెండూల్కర్‌ పుస్తకావిష్కరణ
దిలీప్‌ డిసైజా రచించిన ఫైనల్‌ టెస్ట్‌ ఎగ్జిట్‌ సచిన్‌ టెండూల్కర్‌ పుస్తకాన్ని అక్టోబర్‌ 15న 
ఆవిష్కరించారు. 2013 నవంబర్‌లో వాంఖడే స్టేడియంలో తన ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌లో ఏకైక 
ఇన్నింగ్స్‌ ఆడి 74 పరుగులు సాధించిన విధానంపై సునిశితమైన పరిశీలనే ఈ పుస్తకం. 
దిలీప్‌ డిసౌజా ముంబైకి చెందిన రచయిత, పాత్రికేయుడు.


తురగా జానకిరాణి మృతి
ఆకాశవాణి ద్వారా రేడియో అక్కయ్యగా సుపరిచితురాలైన తురగా జానకిరాణి అస్వస్థతతో 
అక్టోబర్‌ 15న హైదరాబాద్‌లో మరణించారు. జానకిరాణి తన సాహితీ జీవితంలో 
ఆమె ఎన్నో అవార్డులందుకున్నారు. గృహలక్ష్మి స్వర్ణకంకణం, తెలుగు విశ్వవిద్యాలయ
 పురస్కారం, రాష్ట్రప్రభుత్వ ఉగాది పురస్కారం, పింగళి వెంకయ్య స్మారక సత్కారాలు 
అందుకున్నారు. రేడియోలో బాగా ప్రసిద్ధి చెందిన బాలానందం కార్యక్రమాన్ని ఆమె నిర్వహించేవారు.


విస్తరిస్తున్న ఎబోలా
పశ్చిమ ఆఫ్రికా దేశాలకే పరిమితమైంద నుకున్న ఎబోలా క్రమేపి అనేక దేశాలకు విస్తరిస్తోంది.
 తాజాగా అమెరికాలో ఎబోలా వ్యాధితో థామస్‌ డంకన్‌ మరణించడం, ఆయనకు చికిత్స 
చేసిన నర్సులకు కూడా వ్యాధి సోకడంతో ఆ దేశం ఉలిక్కిపడింది. ఇప్పటివరకు ప్రపంచ
వ్యాప్తంగా తొమ్మిది వేల ఎబోలా కేసులు నమోదు కాగా దాదాపు సగం మంది మరణించారు.
 1976లో మొట్టమొదటి సారి పీటర్‌ పయట్‌ ఎబోలా వైరస్‌ను గుర్తించింది. కెనడా 
పరిశోధకులు విఎస్‌వి ఎబోలా పేరుతో ఒక టీకాను రూపొందించారు. ఇది ప్రయోగదశలోనే ఉంది.


ఈగ జన్యుక్రమం విశ్లేషణ
అమెరికాలోని కార్నెల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఆరు ఆడ ఈగలను
 అధ్యయనం చేసి సుదీర్ఘమైన జన్యుక్రమాన్ని రూపొందించారు. ఈగల్లో ఉండే కొన్ని 
ప్రత్యేకమైన జన్యువుల కారణంగా ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి వ్యర్థపదార్థాలను 
నిర్మూలిస్తాయి. మనిషికి సంక్రమించే పలురకాల వ్యాధుల బారినుంచి ఈగ తనను 
తాను ఎలా కాపాడుకుంటుందన్నది కూడా దాని జన్యుక్రమాన్ని తెలుసుకోవడం ద్వారా 
వెల్లడైంది.


ఢిల్లీ అర్బన్‌ ఆర్ట్‌ కమిషన్‌ చైర్మన్‌గా పిఎస్‌ఎన్‌ రావు
న్యూఢిల్లీలో మానవ నిర్మిత, ప్రకృతి సంబంధమైన కళాకృతులను పరిరక్షించే, 
పర్యవేక్షించే ఢిల్లీ అర్బన్‌ ఆర్ట్‌ కమిషన్‌ చైర్మన్‌గా డాక్టర్‌ పిఎస్‌ఎన్‌ రావును కేంద్ర 
పట్టణాభివృద్ధిశాఖ నియమించింది. ఆయన ప్రస్తుతం స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ 
ఆర్కిటెక్చర్‌లో హౌసింగ్‌ విభాగం అధిపతిగా ఉన్నారు. పట్టణ నిర్మాణ రంగంలో 
నిపుణునిగా పేరొందిన రావు, అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ను కెనడాలో అభ్యసించారు.


పిఆర్‌ కండ్రిగ దత్తత
నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుట్టంరాజు 
కండ్రిగ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ దత్తత 
తీసుకున్నారు. సచిన్‌ తన ఎంపి కోటా నిధులను వెచ్చించి అన్ని సౌకర్యాల తో 
ఆదర్శ గ్రామంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు.


పరమాణు మందంలో కరెంట్‌ జనరేటర్‌
ప్రపంచంలోనే అత్యంత పలచని విద్యుత్‌ జనరేటర్‌ ను శాస్త్రవేత్తలు తయారుచేశారు. 
కొలంబియా ఇంజనీరింగ్‌, జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు 
పరమాణం మందం ఉన్న మాలి బ్డినమ్‌ డై సల్ఫైడ్‌తో దీనిని రూపొందించారు. 
దీని నుంచి స్వల్పస్థాయిలో కరెంటును కూడా ఉత్పత్తి చేశారు. మాలిబ్డినమ్‌ డై 
సల్ఫైడ్‌లోని పీజో ఎలక్ర్టికల్‌ లక్షణం ఆధారంగా ఇది సాధ్యమైంది. ఒక పదార్థాన్ని 
బాగా సాగదీసినప్పుడు లేదా బాగా కుంచించినప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి అయితే 
దానిని పీజో ఎలక్ర్టిక్‌ ప్రభావం అంటారు.