భారత జాతీయోద్యమం 1905-1947









1. నియో-జాతీయవాదులుగా ఎవరిని పేర్కొంటారు?
జ: అతివాదులు

2. భారతదేశ జాతీయ గీతాన్ని (జనగణమన) మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఆలపించారు?
జ: 1911

3. స్వదేశీ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
జ: అనిబిసెంట్

4. ఎవరిని 'భారతదేశ విప్లవానికి మదర్'గా వర్ణిస్తారు?
జ: మేడమ్ రుస్తుంకామా

5. 'ప్రతి ఒక్కరి కన్నీటిని తుడిచేయడమే నా అంతిమ లక్ష్యం' అన్నది ఎవరు?
జ: జవహర్‌లాల్‌నెహ్రూ

6. భారత జాతీయ ఉద్యమంలో అతి తక్కువగా పాలుపంచుకుంది ఎవరు?
జ: రాజ్యాధినేతలు - రాజులు

7. ఆరోగ్య సూత్రాలను తెలిపే 'కీ - టు హెల్త్' పుస్తక రచయిత ఎవరు?
జ: గాంధీజీ

8. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశ పెట్టారు?
జ: 1919

9. 'భారత మాతా సొసైటీ' అనే రహస్య సంస్థను స్థాపించిందెవరు?
జ: జె.ఎం.ఛటర్జీ

10. 1908 మార్చిలో ముస్లింలీగ్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైంది ఎవరు?
జ: ఆగాఖాన్

11. చిట్టగాంగ్ ఆయుధ కర్మాగారంపై దాడికి ప్రణాళిక రూపొందించిందెవరు?
జ: సూర్యసేన్

12. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ప్రారంభమైన ఉద్యమం ఏది?
జ: హోంరూల్

13. 1916 ఏప్రిల్‌లో బొంబాయి నగరంలో హోంరూల్ లీగ్‌ను స్థాపించిందెవరు?
జ: తిలక్ 

14. 'న్యూ ఇండియా', 'కామన్‌వీల్' పత్రికలను స్థాపించిందెవరు?
జ: అనిబిసెంట్ 


15. గాంధీజీ ఏ సంవత్సరంలో జన్మించాడు?
జ: 1869

16. గదర్ పార్టీ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉండేది?
జ: శాన్‌ఫ్రాన్సిస్కో

17. గాంధీజీ రాజకీయ గురువు ఎవరు?
జ: గోపాలకృష్ణ గోఖలే

18. గాంధీజీ ఇంటిపేరు ఏమిటి?
జ: గాంధీ

19. శ్యాంజీ కృష్ణవర్మ గురువు ఎవరు?
జ: స్వామిదయానంద సరస్వతి

20. 'ప్రస్తుతం భారతదేశం నేర్చుకోవాల్సిన ఎలా చనిపోవాలి అనే దాన్ని బోధించడానికి ఉన్న ఒకే ఒక మార్గం మాకు మేము మరణించడం' అని తన ఉరితీత సందర్భంగా ప్రకటించిన విప్లవకారుడు ఎవరు?
జ: మదన్‌లాల్ ధింగ్రా

21. రౌలత్ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
జ: 1919 

22. బాలగంగాధర తిలక్‌ను ఎవరు భారతదేశ వజ్రంగా వర్ణించారు?
జ: గోపాలకృష్ణ గోఖలే

23. జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తి ఎవరు?
జ: పి.ఆనందాచార్యులు


24. 'అస్సాం కేసరి' అని ఎవరిని పిలుస్తారు?
జ: అంబికా గిరిరాయ్‌చౌదరి

25. ప్రీతిలతా వడ్డేదర్ ఎవరు?
జ: విప్లవకారిణి

26. గాంధీజీని తొలిసారిగా 'మహాత్మా' అని సంబోధించింది ఎవరు?
జ: రవీంద్రనాథ్ టాగూర్

27. 'జలియన్ వాలాబాగ్' దురంతం ఎప్పుడు జరిగింది?
జ: 1919 ఏప్రిల్ 13

28. జలియన్ వాలాబాగ్ మారణకాండపై ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడెవరు?
జ: హంటర్ 

29. 'ఛలో ఢిలీ' నినాదం ఎవరిది?
జ: సుభాష్‌చంద్రబోస్


30. 1921 లో 'మోప్లా' తిరుగుబాటు ఎక్కడ జరిగింది?
జ: కేరళ

31. 'ఇంక్విలాబ్ జిందాబాద్' అనే నినాదం ఎవరిది?
జ: భగత్‌సింగ్

32. 'స్వరాజ్' పార్టీ అధ్యక్షుడు ఎవరు?
జ: చిత్తరంజన్‌దాస్

33. భారతదేశంలో గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు?
జ: చంపారన్

34. సైమన్ కమిషన్‌ను ఏ సంవత్సరంలో నియమించారు?
జ: 1927

35. సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమ సందర్భంగా లాఠీచార్జీలో గాయపడి, మరణించిన జాతీయ నాయకుడెవరు?
జ: లాలాలజపతిరాయ్

36. జలియన్ వాలాబాగ్ మారణహోమానికి బాధ్యుడైన జనరల్ ఒ. డయ్యర్‌ను హత్య చేసిందెవరు?
జ: సర్దార్ ఉదమ్‌సింగ్

37. 'ఆజాద్ హింద్ ఫౌజ్' స్థాపకుడెవరు?
జ: సుభాష్‌చంద్రబోస్

38. సహాయ నిరాకరణోద్యమం జరిగిన కాలం-
జ: 1920 - 22

39. 'చౌరీచౌరా' సంఘటన ఏ రాష్ట్రంలో జరిగింది?
జ: ఉత్తరప్రదేశ్

40. 'సాధించు లేదా మరణించు' నినాదం ఎవరిది?
జ: మహాత్మాగాంధీ 

41. 'దీనబంధు' అనేది ఎవరి బిరుదు?
జ: సి.ఎఫ్.ఆండ్రూస్

42. బార్డోలి సత్యాగ్రహ నేత ఎవరు?
జ: వల్లభాయ్‌పటేల్ 

43. గాంధీ- ఇర్విన్ ఒడంబడిక ఏ సంవత్సరంలో జరిగింది?
జ: 1931

44. 1929లో లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిందెవరు?
జ: జవహర్‌లాల్‌నెహ్రూ 

45. గాంధీజీ ప్రారంభించిన ఏ ఉద్యమంలో నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిట్, తల్లి స్వరూపారాణి భార్య కమలా నెహ్రూ పాల్గొన్నారు?
జ: ఉప్పు సత్యాగ్రహం

46. 'నాకు మీ రక్తమివ్వండి, నేను మీకు స్వాతంత్య్రం ఇస్తా' అన్నదెవరు?
జ: సుభాష్‌చంద్రబోస్ 

47. సుభాష్‌చంద్రబోస్ రాజకీయ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసినవారెవరు?
జ: చిత్తరంజన్‌దాస్ 

48. 'మూక్‌నాయక్' పత్రికా స్థాపకుడెవరు?
జ: బి.ఆర్. అంబేద్కర్

49. మహాత్మాగాంధీని 'అర్ధనగ్న సన్యాసి' అని అన్నదెవరు?
జ: విన్‌స్టన్ చర్చిల్

50. 'జై జవాన్ జై కిసాన్' నినాదం ఎవరిది?
జ: లాల్‌బహదూర్‌శాస్త్రి

51. 'దివాలా తీసే బ్యాంకు, ముందు తేదీ వేసి ఇచ్చే చెక్కు లాంటిది' అని గాంధీ దేని గురించి అన్నారు?
జ: క్రిప్స్ రాయబారం

52. 'ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా' అని ఎవరిని పిలుస్తారు?
జ: వల్లభాయ్‌పటేల్

53. 'తన తండ్రి పేరు స్వాతంత్య్రం, తన ఇల్లు జైలు' అని ఎవరు పేర్కొన్నారు.
జ: చంద్రశేఖర్ ఆజాద్

54. 'బహిష్కృత హితకారిణీ సభ' వ్యవస్థాపకుడెవరు?
జ: బి.ఆర్.అంబేద్కర్

55. గాంధీజీ మరణానంతరం, 'జీవితాల నుంచి క్రాంతి నశించిపోయింది' అని వ్యాఖ్యానించినదెవరు?
జ: జవహర్‌లాల్ నెహ్రూ

56. బ్రిటిష్ ప్రభుత్వం దేనిపై విచారణ కోసం 'హంటర్ కమిషన్'ను నియమించింది?
జ: జలియన్ వాలాబాగ్ ఘటన

57. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?
జ: జె.బి. కృపలానీ

58. ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దును నిర్ణయించిందెవరు?
జ: రాడ్‌క్లిఫ్

59. గాంధీజీని తొలిసారిగా 'జాతిపిత' అని ఎవరన్నారు?
జ: సుభాష్‌చంద్రబోస్

60. భారతదేశానికి స్వాత్రంత్యం వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు?
జ: అట్లీ