¤ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి 'నిర్భయ్'ను శాస్త్రవేత్తలు
విజయవంతంగా పరీక్షించారు. » అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగల ఈ క్షిపణి వెయ్యి కిలోమీటర్లకు పైగా దూరంలో
ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. » ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ఈ పరీక్షను
నిర్వహించారు. » నిర్భయ్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన ఏరోనాటికల్
డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ అభివృద్ధి చేసింది. » భారత్, రష్యాలు సంయుక్తంగా రూపొందించిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణికి ఇది భిన్నం.
బ్రహ్మోస్ 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సూపర్ సోనిక్ వేగంతో ఛేదిస్తుంది.
నిర్భయ్ ఎక్కువ దూరం పయనించగలదు. పైగా దీనికి వేచిచూసే సమయం ఎక్కువగా ఉంటుంది.
అద్భుతమైన నియంత్రణ, దిశానిర్దేశ వ్యవస్థ, లక్ష్యఛేదన విషయాల్లో చాలా కచ్చితత్వం, శత్రువును
ఏమార్చే స్టెల్త్ లక్షణాలు నిర్భయ్‌లో ఉన్నాయి. 0.7 మ్యాక్ వేగంతో దూసుకెళ్లలదు. అమెరికా
రూపొందించిన తోమహక్, పాకిస్థాన్‌కు చెందిన బాలర్ క్షిపణులకు పోటీగా భారత్ తయారు
చేసిన అస్త్రంగా దీన్ని పేర్కొంటారు. » నిర్భయ్‌ను తొలిసారిగా గతేడాది మార్చి 12న పరీక్షించారు. అయితే మార్గ మధ్యంలో
క్షిపణి గమనంలో కొన్ని తేడాలు చోటుచేసుకోవడం వల్ల ప్రయోగం పాక్షికంగా సఫలమైంది. » ఈ క్షిపణిని మూడేళ్లలో సైనిక దళాల చేతికి అందించాలని భావిస్తున్నట్లు డీఆర్‌డీవో
చీఫ్ అవినాష్ చందర్ తెలిపారు. » నిర్భయ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వసంత్ శాస్త్రి. » నిర్భయ్‌లోని కీలక భాగాలను హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన సంస్థలు అభివృద్ధిచేశాయి.
క్షిపణికి మెదడు లాంటి ఆన్ బోర్డ్ కంప్యూటర్, దిశానిర్దేశం కోసంఅత్యాధునిక నేవిగేషన్
వ్యవస్థలను, ఏవియానిక్స్‌ను హైదరాబాద్‌కు చెందిన రీసెర్చ్సెంటర్ ఇమారత్
(ఆర్సీఐ) అభివృద్ధి చేసింది. ఘన రాకెట్ మోటార్‌ను
నగరానికేచెందిన అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబొరేటరీ (ఏఎస్ఎల్) తయారు చేసింది.
» నిర్భయ్ కనిష్ఠంగా అయిదు మీటర్ల ఎత్తులోను, గరిష్ఠంగా 5 కిలోమీటర్లఎత్తులోను
ప్రయాణించగలదు. కేవలం 1 - 2 మీటర్ల వైరుధ్యంతో లక్ష్యాన్నిఛేదించగలదు.
|