హంగేరి(Hungary) - ప్రపంచ దేశాల సమాచారం - ప్రతి రోజు ఒక దేశం గురించిన సమాచారం.

హంగేరి
hungary కోసం చిత్ర ఫలితం


హంగేరి మధ్య ఐరోపాలోని ఒక భూపరివేష్టిత దేశం. హంగేరియన్ భాషలో మాగ్యారోర్స్‌ఝాగ్ గా పిలవబడే హంగేరి దేశం ఆస్ట్రియా, స్లొవేకియా, ఉక్రెయిన్, రొమానియా, సెర్బియా, క్రొయేషియా మరియు స్లొవేనియా మున్నగు దేశాలతో సరిహద్దులు కలిగియున్నది. బుడపెస్ట్ రాజధానిగా కల ఈ దేశం నాటో, ఐరోపా సమాఖ్య మున్నగు సంస్థలలో సభ్యదేశంగా ఉన్నది.
వెయ్యి సంవత్సరాల కిందటే ఈ దేశపు పునాదులు ఏర్పడ్డాయని చర్రిత చె బుతోంది.  క్రీస్తుశకం 896 లో మాగ్యార్‌లు అనే రష్యా దేశపు స్టెప్పీలు డాన్యూబ్ నది తీరం గుండా వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరు నిజానికి దేశ దిమ్మరులు. గుర్రాలను పెంచుకోవడం వీరికి వృత్తి. వీళ్లకు నాయకుడు అర్పాడ్, ఇతను ప్రస్తుత హంగేరీ దేశపు పశ్చిమ భాగాన్ని ఆక్రమించి పరిపాలించాడు. మొట్టమొదటి హంగేరియన్ సామ్రాజ్యం మాగ్వార్ రాజు స్టీఫెన్ నాయకత్వంలో క్రీస్తుశకం 1000 శతాబ్దంలో ఏర్పడింది. ఈ సామ్రాజ్యం క్రమంగా విస్తరించింది. 
                                                hungary కోసం చిత్ర ఫలితం
ఆస్ట్రియాను పరిపాలిస్తున్న హప్స్‌బర్గ్ పాలకులు ఈ తుర్కుల మీద క్రమంగా దాడులు చేసి క్రీస్తు శకం 1699లో హంగేరీ దేశాన్ని పూర్తిగా ఆక్రమించారు. 1848 లో ఆస్ట్రియా స్వాతంత్య్ర పోరాటాన్ని వీరు రష్యా సహకారంతో అణచి వేశారు.
మొదటి ప్రపంచయుద్ధం తరువాత హాప్స్‌బర్స్ రాజ్యం కూలిపోయింది. ఫలితంగా హంగే రీ తన భూభాగాన్ని ఒక వంతు చెకోస్లోవేకియాకు, రుమేనియాకు, యుగొస్లోవియాకు కోల్పోయింది. 1930 దశకంలో హంగేరీ, జర్మన్ ఆధిపత్యంలో పని చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో హంగేరీ జర్మనీతో కలిసి రష్యాపై యుద్ధం చేసింది. అయితే రెండో ప్రపంచయుద్ధం పూర్తయ్యాక చిత్రంగా హంగేరీ రష్యాకు అనుకూలంగా మారిపోయింది.
hungary కోసం చిత్ర ఫలితం
హంగేరీ ప్రజలు తమ పూర్వపు మాగ్యావర్ సంస్కృతిని, ఆ భాషను, అప్పటి ఆహార రీతులను, పురాతన జాపపద సంగీతాన్ని ఎంతో ఇష్టపడతారు. హంగేరియన్లు భోజనాన్ని చాలా సుష్టుగా తింటారు. బాగా తాగుతారు కూడా! 
hungary కోసం చిత్ర ఫలితం
హంగేరీ దేశం పరిపాలనా సౌలభ్యం కోసం 19 కౌంటీలుగా విభజింపబడింది. ఈ 19 కౌంటీలు తిరిగి 198 రైడింగ్‌లుగా విభజింపబడ్డాయి. దేశం మొత్తంలో 20 నగరాలు అతి పెద్దవిగా చలామణి అవుతున్నాయి.  వీటిలో బుడాపెస్ట్, డెబ్రెసెన్, మిస్కోల్క్, జెగెడ్, పెక్స్, గ్యోర్, నిరె గీజా, మొదలైనవి పెద్ద జనాభాలో ఉన్నాయి.
బాలాటన్ సరస్సు - ఆ సరస్సులో ఉన్న ద్వీపగ్రామం. గ్రామంలో ఉన్న 17వ శతాబ్దపు బెనెడిక్ట్ ఆబే చూడద గ్గవి. 598 చదరపు కిలోమీటర్లు వెడల్పు ఉన్న  సరస్సు నీలి ఆకాశపు రంగును కలిగి ఉండి సందర్శకులను మంత్రముగ్థులను చేస్తుంది. ఈ  సరస్సు చుట్టూ 130 బీచ్‌లు ఉన్నాయి. 
hungary కోసం చిత్ర ఫలితం
ప్రతి వసంత మాసంలో బుసోజరాస్ కార్నివాల్ పండగ జరుగుతుంది. నగరం మధ్యలో టౌన్‌హాల్ భవనం, దాని నిర్మాణం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. మెమోరియల్ పార్క్, డాన్యూబ్ నది పరవ ళ్లు అందరినీ ఆకట్టుకుంటాయి

హంగేరి దేశానికి చెందిన ప్రముఖులు : 

ప్రపంచం మొత్తంలో కుర్రకారుకు ఇష్టమైన రూబిక్ క్యూబ్‌ను కనిపెట్టిన వ్యక్తి ఈ దేశానికి చెందినవాడే. అతడి పేరు ఎర్నో రూబిక్, 1974లో అతడు క్యూబ్‌ను కనిపెట్టాడు. అదే రూబిక్ క్యూబ్.
‘విటమిన్ సి’ ని కనిపెట్టిన అల్బర్ జెంట్ ఈ దేశానికి చెందిన వాడు. అతడి కి 1937లో  నోబెల్ బహుమతి లభించింది.
ప్లాస్మో టీవిని 1936లో ఈ దేశానికి చెందిన శాస్త్రవేత్త కల్మన్ తిహాన్యీ దానిని కనిపెట్టాడు.
మనం విరివిగా ఉపయోగిస్తున్న బాల్ పాయింట్ పెన్నును లాస్‌జ్లో బైరో అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. అతడు ఈ దేశస్థుడే.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన హ్రైడోజన్ బాంబును ఈ దేశస్థుడైన ఎడ్వర్డ్ టెల్లర్ కనిపెట్టాడు.

hungary కోసం చిత్ర ఫలితం
హంగేరి అసలు పేరు  :  హంగేరి గణతంత్ర రాజ్యము
ఖండం: యూరప్
రాజధాని: బుడాపెస్ట్
వైశాల్యం:  93,030 చదరపు కిలోమీటర్లు
జనాభా:  98,77,365 (తాజా అంచనాల ప్రకారం)
భాష: మాగ్యార్ (హంగేరియన్)
మతం: క్రైస్తవులు
సరిహద్దులు: చెకొస్లోవేకియా, రష్యా, రొమేనియా, యుగొస్లావియా, ఆస్ట్రియా.

కరెన్సీ: ఫోరింట్

hungary currency కోసం చిత్ర ఫలితం

hungary currency కోసం చిత్ర ఫలితం

hungary currency కోసం చిత్ర ఫలితం

hungary currency కోసం చిత్ర ఫలితం

hungary currency కోసం చిత్ర ఫలితం

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment