సెప్టెంబరు - 1
|
¤ హైదరాబాద్‌కు చెందిన సైబర్ ఫోరెన్సిక్ నిపుణుడు పెండ్యాల కృష్ణశాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్‌పోల్ ఆధ్వర్యంలో ఐరాస సభ్యదేశాల ప్రతినిధులకు సైబర్ నేరాలు, ఉగ్రవాదంపై శిక్షణ ఇవ్వనున్నారు. » ఆస్ట్రియా రాజధాని వియన్నాలోని ఐరాస కార్యాలయంలో సెప్టెంబరు 9, 10 తేదీల్లో నిర్వహించే సమావేశాల్లో ఆయన ఈ శిక్షణ ఇస్తారు. |
సెప్టెంబరు - 2
|
¤ ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబారెటరీకి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో కీలక
భూమికపోషించిన కె.పి.సి.గాంధీ పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు.¤ భారత వైద్య సంఘం (ఐఎంఏ) నూతన ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ కార్డియాలజిస్టు,
హార్ట్ కేర్ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ కె.కె.అగర్వాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అగర్వాల్రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. » కేరళకు చెందిన డాక్టర్ ఎ.మార్తాండ పిళ్లై, రాజస్థాన్‌కు చెందిన డాక్టర్ ఎస్.ఎస్.అగర్వాల్
ఐఎంఏనూతన జాతీయ అధ్యక్షులుగా నియమితులయ్యారు. |
సెప్టెంబరు - 3
|
¤ బాలికలు ఎదుర్కొనే పలు సమస్యలపై వారిలో చైతన్యం కలిగించడం కోసం ఐక్యరాజ్యసమితి ఫౌండేషన్ సలహామండలి సభ్యులుగా ఇద్దరు భారత సంతతి మహిళలకు అరుదైన అవకాశం దక్కింది. » ఫౌండేషన్ చేపట్టిన 'గర్ల్ అప్' కార్యక్రమం సలహామండలి సభ్యులుగా ఎంపిక చేసిన 12 మందిలో భారత సంతతికి చెందిన అఖిల సోమశేఖర్, అంజులా ఆచారియా బాత్ ఉన్నారు. » ప్రపంచవ్యాప్తంగా బాలికల కోసం పనిచేస్తున్న వివిధ నేపథ్యాలకు చెందిన ప్రతినిధులకు ఈ మండలిలో సభ్యత్వం కల్పించారు. » మహిళలు, చిన్నారుల సాధికారత, విద్య సాధనకు సంబంధించిన వివిధ సంస్థలకు అఖిల ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. వృత్తిరీత్యా ఆమె హోటళ్లకు మార్కెటింగ్ సంబంధిత డిజిటల్ వ్యవస్థలను సరఫరా చేసే కంపెనీలో కీలక పదవిలో ఉన్నారు. అంజులా ఆచారియా బాత్ అమెరికాలో పారిశ్రామికవేత్తగా ఉన్నారు. ఈమె కూడా స్త్రీలు, పిల్లలకు సంబంధించిన సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్థిక చేయూతను ఇస్తుంటారు.¤ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ముగ్గురు ఎంపీలను నామినేట్ చేశారు. వారిలో రాజీవ్ ప్రతాప్ రూఢీ, మీనాక్షి లేఖీ, హెచ్.హరిలకు చోటు దక్కింది. » ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం ఛైర్మన్, 28 మంది సభ్యులుండే ఈ కౌన్సిల్‌లో అయిదుగురు పార్లమెంట్ సభ్యులు ఉండాలి. వారిలో ముగ్గురిని లోక్‌సభ నుంచి, ఇద్దరిని రాజ్యసభ నుంచి ఆయా సభాధ్యక్షులు నామినేట్ చేస్తారు. |
సెప్టెంబరు - 5
|
¤ ట్విట్టర్, ఫేస్‌బుక్ తదితర సామాజిక వెబ్‌సైట్ల వాడకంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోవర్లు ఉన్న రెండో నేతగా ప్రధాని మోడీ నిలిచారు. మోడీకి ఫేస్‌బుక్‌లో 2.10 కోట్ల లైక్‌లు వచ్చాయి. ట్విట్టర్‌లో మోడీ వ్యక్తిగత ఖాతాకు 61.3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. » జూన్‌లో నాలుగో స్థానంలో ఉన్న ఆయన తాజాగా రెండో స్థానానికి చేరుకున్నారు. » ఈ రెండు సైట్లను ఎక్కువగా ఉపయోగించుకుంటున్న నేతగా మొదటి స్థానంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిలిచారు. మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ఈ విషయాలను వెల్లడించింది.
|
సెప్టెంబరు - 7
|
¤ భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా గణిత శాస్త్రవేత్త దయారెడ్డి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ (ఐసీఎస్)కు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. » న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన ఐసీఎస్ జనరల్ అసెంబ్లీ భేటీలో 120 మంది ప్రతినిధులు దయారెడ్డిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. |
సెప్టెంబరు - 9
|
¤ 'ఇన్-రెసిడెన్స్ ప్రోగ్రామ్'లో భాగంగా నలుగురు ప్రముఖులు రాష్ట్రపతి భవన్‌లో విడిది చేస్తున్నారు. వీరికి ఈ నెల 26 వరకు రాష్ట్రపతి భవన్ ఆతిథ్యం అందించనుంది. » తెలుగు రచయిత వేంపల్లి గంగాధర్ (కడప జిల్లా), జర్నలిస్టుగా చేసి రచయిత్రిగా మారిన యిషీ డోమా భూటియా (సిక్కిం), వాణిజ్య ప్రకటనల ప్రొఫెషనల్‌గా చేసి కళాకారుడిగా మారిన రహూల్ సక్సేనా (చెన్నై), మరో కళాకారుడు ప్రతాప్ సుధీర్ మోరె (ముంబయి) ఉన్నారు. » రచయితలు, కళాకారుల గౌరవార్థం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2013 డిసెంబరులో ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. |
సెప్టెంబరు - 11
|
| ¤ ప్రకటనలకు ప్రమాణాలు నిర్దేశించే అడ్వర్‌టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆస్కి) ఛైర్మన్‌గా ఆగ్రోటెక్ ఫుడ్స్ డైరెక్టర్ నరేంద్ర అంబ్వానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. » వైస్ ఛైర్మన్‌గా బెనాయ్ రాయ్ చౌధరి, గౌరవ కోశాధికారిగా శశిధర్ సిన్హా ఎన్నికయ్యారు. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ డైరెక్టర్ ఐ.వెంకట్ ఎన్నికయ్యారు. |
సెప్టెంబరు - 16
|
¤ ప్రపంచ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ముఖ్య ఆర్థికవేత్త, భారత్‌కు చెందిన కౌశిక్ బసు ఇంటర్నేషనల్ ఎకనామిక్ అసోసియేషన్ (ఐఈఏ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. » 'ఐఈఏ' ప్రొఫెషనల్ ఆర్థికవేత్త సంఘాల్లో ముఖ్యమైంది. అంతర్జాతీయ ఆర్థిక విధానాల రూపకల్పన, పరిశోధనల్లో ఈ సంఘం కీలక పాత్రను పోషిస్తోంది. » ఐఈఏకు గతంలో అమర్త్యసేన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఐఈఏకు అధ్యక్షత వహించనున్న రెండో భారతీయుడు కౌశిక్ బసు. |
సెప్టెంబరు - 20
|
¤ ఢిల్లీకి చెందిన సోదరులు అచిన్ నారులా, సార్థక్ నారులా కేబీసీలో రూ.7 కోట్లు గెలుచుకుని తొలిసారిగా ఈ ఘనత సాధించినవారిగా రికార్డు సృష్టించారు. » ఈ రియాల్టీ గేమ్‌షో 8వ సీజన్‌లో భాగంగా వీరు మొత్తం 14 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి రూ.7 కోట్లు గెల్చుకున్నారు. » అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కేబీసీ కార్యక్రమం సోనీ ఛానెల్‌లో ప్రస్తుతం ప్రసారమవుతోంది.¤ జమ్ముకాశ్మీర్‌పై పాకిస్థాన్ నాయకులు భారత్‌ను మరోసారి సవాల్ చేశారు. జమ్ముకాశ్మీర్ కూడా తమదేనని, దాన్ని స్వాధీనం చేసుకుంటామని పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజిర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సహ-ఛైర్మన్ బిలావత్ భుట్టో జర్దారీ హెచ్చరించారు. » బిలావత్ తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీ 2008 నుంచి 2013 వరకు పాకిస్థాన్ దేశాధ్యక్షుడిగా, తల్లి బెనజిర్ భుట్టో పాకిస్థాన్ ప్రధానిగా పనిచేశారు. 2018లో జరిగే పాకిస్థాన్ ఎన్నికల్లో బిలావత్ పోటీ చేయనున్నారు. |
సెప్టెంబరు - 21
|
¤ 'ఆసియా - పసిఫిక్' ప్రాంతంలో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాను ఫార్చ్యూన్ మ్యాగజీన్ విడుదల చేసింది. » ఈ జాబితాలో తొలి 25 మందిలో ఎనిమిది మంది భారతీయ మహిళలు స్థానం పొందారు. » ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్‌ప్యాక్ బ్యాంక్ చీఫ్ గేయిల్ కెల్లీ మొదటి స్థానాన్ని పొందగా, ఐసీఐసీఐ చీఫ్ చందా కొచ్చర్ రెండో స్థానంలో నిలిచారు. » ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య (4వ స్థానం), హెచ్‌పీసీఎల్ ఛైర్మన్, ఎండీ నిషీ వాసుదేవ (5), యాక్సిక్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ (10), బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా (19), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సీఈవో చిత్రా రామకృష్ణన్ (22), హెచ్ఎస్‌బీసీ డైరెక్టర్ (ఆసియా-పసిఫిక్) నైనా లాల్ కిద్వాయ్ (23), టఫే ఛైర్మన్, సీఈవో మల్లికా శ్రీనివాసన్ (25) ఈ జాబితాలో నిలిచారు. » ఫార్చ్యూన్ రూపొందించిన 'ప్రపంచ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితా'లో ఐబీఎం ఛైర్‌పర్సన్, సీఈఓ గిన్నీ రొమెట్టీ మొదటి స్థానాన్ని, జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బారా రెండో స్థానాన్ని పొందారు. భారత సంతతికి చెందిన పెప్సీకో సీఈవో ఇంద్రా నూయి మూడో స్థానంలో నిలిచారు. |
సెప్టెంబరు - 22
|
| ¤ పాకిస్థాన్ గూఢచార సంస్థ 'ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ (ఐఎస్ఐ)' కొత్త డైరెక్టర్ జనరల్‌గా లెఫ్టినెంట్ జనరల్ రిజ్వాన్ అఖ్తర్ నియమితులయ్యారు. » ఐఎస్ఐ ప్రస్తుత అధిపతి లెఫ్టినెంట్ జనరల్ జహీరుల్ ఇస్లాం పదవీ విరమణ అనంతరం ఆయన స్థానంలో అక్టోబరు 1న రిజ్వాన్ బాధ్యతలు చేపడతారు.¤ వివాదస్పద నవల 'లజ్జ' లో ఇస్లామ్‌పై విమర్శలు చేసినందుకే తనపై ఫత్వా విధించారని చాలామంది అనుకుంటున్నారని, కానీ ఇందులో నిజంలేదని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తెలిపారు. లజ్జ నవలలో ఇస్లాంపై ఎలాంటి విమర్శలు చేయలేదని స్పష్టం చేశారు. తాను రాసిన ఇతర పుస్తకాల్లో ఆ మతంపై విమర్శలు చేసినందుకే బంగ్లాదేశ్‌లోని ముస్లిం మత పెద్దలు ఫత్వా జారీ చేశారని ఆమె పేర్కొన్నారు. |
సెప్టెంబరు - 23
|
¤ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) ఆరుగురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రకటించింది. » శాస్త్రవేత్త, హెచ్‌సీయూ మాజీ ఉపకులపతి ఆచార్య పల్లె రామారావు, కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ ఎం.ఎస్.వలియధాన్, గణితశాస్త్ర నిపుణుడు ఆచార్య ఎం.ఎస్.రఘునాథన్, నృత్యకళాకారిణి డాక్టర్ కపిలా వాత్సాయన్, ప్రముఖ కవి, సినీ దర్శకుడు గుల్జార్‌తో పాటు సినీనటి, కొరియోగ్రాఫర్ దివంగత జోహ్రా సెహగల్‌కు గౌరవ డాక్టరేట్లు ప్రకటించింది. » అక్టోబరు 1న హెచ్‌సీయూ 26వ స్నాతకోత్సవం సందర్భంగా ఈ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నారు.
¤ ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓని జారీ చేసిన ఇ-కామర్స్ కంపెనీ 'అలీబాబా' వ్యవస్థాపకుడు జాక్ మా (50) చైనాలో అత్యంత సంపన్నుడిగా అవతరించారు. » ఏటా దేశంలోని సంపన్నుల జాబితాను ప్రచురించే హరన్‌లో జాక్ మా తొలి స్థానంలో నిలిచారు. » 24.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.50 లక్షల కోట్లు)తో ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా 'అలీబాబా' ఇటీవలే రికార్డు సృష్టించింది. » గతేడాది హరన్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన స్థిరాస్తి డెవలపర్ డాలియన్ వాండా గ్రూప్ వ్యవస్థాపకుడు వాంగ్ జియాన్ లిన్ సంపద 7 శాతం పెరిగి 145 బిలియన్ యువాన్ల (సుమారు రూ.1,30,500 కోట్లు)కు చేరినా, రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. |
సెప్టెంబరు - 24
|
¤ భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) - ఆంధ్రప్రదేశ్ విభాగం ఛైర్మన్‌గా సురేష్ చిట్టూరి ఎంపికయ్యారు. 2015 మార్చి వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. » వైస్ ఛైర్మన్‌గా అమరరాజా బ్యాటరీస్ ఛైర్మన్ డాక్టర్ రామచంద్ర ఎన్.గల్లా వ్యవహరిస్తారు.¤ న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) నూతన అధ్యక్షుడిగా ఇండియా టీవీ ఛైర్మన్, ఎడిటర్-ఇన్-చీఫ్ రజత్ శర్మ నియమితులయ్యారు.¤ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఛైర్మన్‌గా ప్రముఖ హిందీ దినపత్రిక జాగరణ్ మేనేజింగ్ ఎడిటర్ మహేంద్ర మోహన్ గుప్తా ఎన్నికయ్యారు.
|
సెప్టెంబరు - 25
|
¤ అమెరికాలో ప్రవాసాంధ్ర ప్రముఖుడు చివుకుల ఉపేంద్రకు మరో అరుదైన పదవి లభించింది. » ఉపేంద్రను ప్రజావసరాల శాఖ కమిషనర్ (బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్)గా నియమిస్తూ న్యూజెర్సీ రాష్ట్ర గవర్నరు క్రిస్‌క్రిస్టీ ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబరు 6న పదవీ బాధ్యతలు చేపట్టనున్న ఆయన ఈ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగుతారు. ¤ హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఛాతీ వైద్యశాలకు చెందిన డాక్టర్ శుభాకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ చెస్ట్ ఫిజిషియన్ సంస్థలో బాధ్యతలు నిర్వర్తించే 12 మంది గవర్నర్లలో శుభాకర్‌కు స్థానం కల్పిస్తూ సంస్థ అధ్యక్షులు కర్టిస్ సెస్‌లర్ నియామక పత్రాన్ని పంపించారు. భారత్ నుంచి ఎన్నికైన ఏకైక భారతీయుడు శుభాకర్. » అక్టోబరు 26న అమెరికాలోని ఆస్ట్రిన్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సులో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. » 100 దేశాలకు చెందిన 20 వేల మంది వైద్యనిపుణులు సభ్యులుగా ఉన్న ఈ అంతర్జాతీయ సంస్థలో కేవలం 12 మంది మాత్రమే గవర్నర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.¤ ఆసియా పసిఫిక్ దేశాల్లోని విద్యార్థులకు గూగుల్ సంస్థ ఇచ్చే ప్రతిష్ఠాత్మక 'గూగుల్ అనిత బోర్డ్ స్మారక ఉపకార వేతనం'కు మద్రాస్ ఐఐటీలో విద్యార్థిని స్పందనరాజ్ బబ్బుల ఎంపికయ్యింది. » స్పందన రాజ్ వరంగల్‌కు చెందిన అమ్మాయి.
|
సెప్టెంబరు - 26
|
¤ ప్రవాస భారతీయ కుబేరుడు అనిల్ అగర్వాల్, ఆయన కుటుంబం తమ సంపదలో 75 శాతాన్ని సమాజహితం కోసం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. » అమెరికా మ్యాగజైన్ ఫోర్బ్స్ లెక్కల ప్రకారం వేదాంత రిసోర్సెస్ ఛైర్‌పర్సన్ అనిల్ అగర్వాల్ సంపద 3.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 21,400 కోట్లు). అంటే ఇందులో 75 శాతం (2.6 బిలియన్ డాలర్లు - రూ. 15,900 కోట్లు) ప్రజల కోసం వ్యయం చేయనున్నారు. » ఈ ఏడాది భారతీయ ధనవంతుల జాబితాలో ఆయనకు 24వ స్థానం దక్కింది.¤ టాటా స్టీల్‌ను ప్రపంచ దిగ్గజ ఉక్కు కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దడంలో ముఖ్య భూమిక పోషించిన బి.ముత్తురామన్ పదవీ విరమణ చేశారు. » ఇప్పటి వరకు కంపెనీకి వైస్ ఛైర్మన్‌గా ఉన్న ముత్తురామన్ పదవీ విమరణ నిబంధనల మేరకు 70 ఏళ్లు పూర్తి కావడంతో బోర్డు నుంచి తప్పుకున్నారు.
|
సెప్టెంబరు - 28
|
¤ అసాధారణ తెలివితేటలతో మూడుసార్లు 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డు'ను సొంతం చేసుకున్న బాల మేధావి కిరణం ధీరజ్ (5 సంవత్సరాలు)కు వరల్డ్ రికార్డు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. » ధీరజ్ చెన్నైలో యూకేజీ చదువుతున్నాడు. » ధీరజ్ రెండో ఏటే 2 నిమిషాల 19 సెకన్లలో 215 జాతీయ పతకాలను గుర్తు పట్టాడు. మూడున్నరేళ్లప్పుడు 83 మంది శాస్త్రవేత్తల పేర్లను, వారి ఆవిష్కరణలను ఒక నిమిషంలో చెప్పాడు. వరల్డ్ మ్యాప్ పజిల్‌ను 3 నిమిషాల 20 సెకన్లలో పూర్తిచేశాడు. » 'వరల్డ్ రికార్డు యూనివర్సిటీ' ఢిల్లీలో ఉంది.¤ అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ క్లబ్ సొంతదారుగా భారత అపర కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. » అంబానీ ఆధ్వర్యంలోని ఐపీఎల్ టీమ్ 'ముంబయి ఇండియన్స్' విలువ 200 మిలియన్ డాలర్లని ఫోర్బ్స్ పత్రిక అంచనా వేసింది. కబడ్డీ, హాకీ, బ్యాడ్మింటన్ తదితర విభాగాల్లో క్రీడా బృందాలనూ భారత్‌లోని అత్యంత ధనవంతులు సొంతం చేసుకున్నారు.¤ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్థానంలో ఆర్థికశాఖ మంత్రి ఒ.పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టనున్నారు. » చెన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయంలో సమావేశమైన ఆ పార్టీ శాసనసభాపక్షం ఆర్థికమంత్రి సెల్వంను శాసనసభపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
|
సెప్టెంబరు - 29
|
¤ జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా లలిత కుమార మంగళం బాధ్యతలు స్వీకరించారు.
|
|
|