మార్చి - 1
|
¤ భారత్‌లో న్యాయవ్యవస్థ సహా అన్ని రంగాల్లో, అన్ని స్థాయుల్లో అవినీతి పెరిగిపోయిందని అమెరికా విడుదల చేసిన మానవ హక్కుల వార్షిక నివేదిక (2013) వెల్లడించింది. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ విడుదల చేసిన ఈ నివేదికలో భారత చట్టాల ప్రకారం అధికార వ్యవస్థలో అవినీతికి శిక్షలు, జరిమానాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని సక్రమంగా అమలు చేయడం లేదని పేర్కొన్నారు.
ముఖ్యాంశాలు
జనవరి - నవంబరు మధ్య కాలంలో సీబీఐ 583 అవినీతి కేసులను నమోదు చేసింది.
2012లో కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ)లో 7,224 కేసులున్నాయి. వీటిలో 5,528 కేసులు 2012లో స్వీకరించినవి కాగా 1,696 కేసులు 2011 నుంచి ఉన్నాయి.
5,720 కేసుల్లో చర్యలకు సీవీసీ సిఫార్సు చేసింది. అవినీతి సంబంధిత సమాచారం ఇచ్చేందుకు, ఫిర్యాదులు దాఖలు చేసేందుకు ఓ వెబ్‌సైట్‌తో పాటు టోల్‌ఫ్రీ నెంబర్‌ను సీవీసీ ఏర్పాటు చేసింది.
పోలీసు రక్షణ, పాఠశాలలో ప్రవేశం, నీటి సరఫరా లాంటివి అంశాల్లో వేగవంతంగా పొందడానికి లేదా ప్రభుత్వ సాయం కోరుతూ లంచాల చెల్లింపులు జరుగుతున్నాయి.
2జీ కుంభకోణంలో టెలికాం మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిపై దర్యాప్తు పూర్తి కాకపోవడాన్ని ప్రస్తావించింది. గుజరాత్‌లో లోకాయుక్త ఏర్పాటుకు సంబంధించిన వివాదాన్నీ ఎత్తి చూపింది. |
¤ చైనాకు చెందిన హురున్ అనే పరిశోధన సంస్థ ఈ ఏడాదికి సంబంధించి ప్రపంచ ధనికుల జాబితాను విడుదల చేసింది.
» రూ.4.2 లక్షల కోట్లు (6,800 కోట్ల డాలర్ల)తో బిల్‌గేట్స్ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచారు.
|
|
» బిల్‌గేట్స్ తరువాతి స్థానాల్లో వారన్ బఫెట్ (రూ.3.95 లక్షల కోట్లు), అమనికో ఒర్టెగా (రూ.3.82 లక్షల కోట్లు), కార్లోస్ స్లిమ్ హెలు (రూ.370 లక్షల కోట్లు), ల్యారీ ఎలిసన్ (రూ.2.96 లక్షల కోట్లు) నిలిచారు.
|
» జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ రూ.1.1 లక్షల కోట్ల వ్యక్తిగత సంపద (1,800 కోట్ల డాలర్ల)తో 41 వ స్థానం సాధించి, భారత్‌లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.
|
|
» రూ.1.05 లక్షల కోట్లతో లక్ష్మినివాస్ మిట్టల్ 49వ స్థానంలో, అజీం ప్రేమ్‌జీ, దిలీప్ సంఘ్వీ చెరో రూ.83 వేల కోట్లతో 77వ స్థానంలో, పల్లోంజీ మిస్త్రీ, ఎస్పీ హిందూజా (అండ్ ఫ్యామిలీ) చెరో రూ.74 వేల కోట్లతో 93వ స్థానంలో నిలిచారు. |
¤ ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) నిర్వహించిన 2014 అంతర్జాతీయ జీవన ప్రమాణ సర్వే ప్రకారం జీవించడానికి ప్రపంచంలో అత్యంత చవకైన నగరంగా ముంబయి నిలిచింది. ఆహారం, పానీయాలు, దుస్తులు, వ్యక్తిగత సంరక్షణ వస్తువులు, ఇళ్ల అద్దెలు, రవాణా, వినోద వ్యయాలు, ఉత్పత్తులు, సేవల ధరలను పరిగణనలోకి తీసుకుని ఈఐయూ ఈ సర్వే నిర్వహించింది. |
|
» అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్ నిలిచింది. గతేడాది మొదటి స్థానంలో ఉన్న టోక్యో ఈ ఏడాది జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది.
» అత్యంత ఖరీదైన నగరాల్లో సింగపూర్ తర్వాత స్థానాల్లో ప్యారిస్, ఓస్లో, జ్యూరిచ్, సిడ్నీలు నిలిచాయి. లండన్ 15వ స్థానంలో నిలిచింది.
¤ భారత మీడియా, వినోద పరిశ్రమ గతేడాది 12% వృద్ధితో రూ.92,800 కోట్లకు చేరిందని ఫిక్కీ-కేపీఎంజీ నివేదిక పేర్కొంది.
» 2013లో ముద్రణరంగం 8.5% చక్రీయ వృద్ధితో రూ.24,300 కోట్లకు పెరిగింది.
¤ వర్షాలపై ఎల్‌నినో ప్రభావం చూపితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఆర్థికవృద్ధి 5.2 శాతమే ఉంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
» వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థికవృద్ధి 6 శాతంగా ఉండగలదని ఈ సంస్థ ఇంతకు ముందు అంచనా వేసింది.
» ఎల్‌నినో అనేది స్పానిష్ భాషా పదం. |
మార్చి - 5
|
¤ ఐరోపాలో ప్రతి పదిమంది మహిళల్లో ఒకరు లైంగిక హింసకు గురవుతున్నారని, వారిలో సగం మంది అత్యాచార బాధితులని ఐరోపా అనుబంధ సంస్థ నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది.
» యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో 42 వేల మంది మహిళలతో ఈ సర్వే చేపట్టారు. 10 కోట్ల మందికి పైగా మహిళలు నిత్యం వివిధ రూపాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఈ నివేదికలో పేర్కొన్నారు. 15 నుంచి 74 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళల్లో 90 లక్షల మంది అత్యాచారానికి గురయినట్లు పేర్కొన్నారు. తమ సన్నిహిత భాగస్వాముల చేతిలో లైంగిక హింసకు గురవుతున్న ప్రతి ఏడుగురిలో ఒక్కరే ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. |
మార్చి - 6
|
¤ పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ రూపొందించిన 'డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా అనే నివేదికను హోంశాఖ సెక్రటరీ అనిల్ గోస్వామి న్యూఢిల్లీలో విడుదల చేశారు. |
ముఖ్యాంశాలు » దేశంలో గత ఏడు సంవత్సరాల్లో జనాభా వృద్ధి 15.38% కాగా, మంజూరు చేసిన పోలీస్ బలం 50.40% పెరిగింది. ఫలితంగా 2002లో 718 మంది ప్రజలకు ఒక పోలీస్ ఉంటే, 2012 నాటికి 551 మంది ప్రజలకు ఒక పోలీస్ ఉన్నాడు.
|
|
» పోలీసుల సంఖ్య పెరిగినప్పటికీ ఉగ్రవాదం, మత హింస, నక్సలిజం తదితర భద్రతకు ముప్పు వాటిల్లే సంఘటనలు గణనీయంగా పెరిగాయి.
» 2013 జనవరి 1 వరకు 24.82% ఖాళీలు ఉండటం వల్ల పోలీసుల సంఖ్య కూడా మరింత తగ్గిపోయింది.
» 11 ఏళ్ల కాలంలో రాష్ట్రాల సాయుధ పోలీస్ బలగాలు 27.26% వృద్ధి చెందాయి. 2002లో సాయుధ పోలీసుల సంఖ్య 3.48 లక్షలు కాగా, 2012లో 4.62 లక్షలకు చేరుకుంది.
» ప్రస్తుతం జాతీయ స్థాయిలో సగటున ప్రతి 1.43 చదరపు కిలోమీటర్లకు ఒక కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు.
¤ ట్రిప్ అడ్వైజర్ అనే ట్రావెల్ పోర్టల్ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలోని నగరాల్లో అత్యంత అభద్రతా నగరం ఢిల్లీ అని మహిళా పర్యటకులు తేల్చారు. ఢిల్లీని అభద్రతా నగరంగా పేర్కొనడం వరుసగా ఇది రెండోసారి.
సర్వేలోని ముఖ్యాంశాలు |
| » దేశంలోని పది నగరాల్లో సర్వే నిర్వహించగా, 95% మహిళలు ఢిల్లీని అభద్రతా నగరంగా పేర్కొన్నారు. 2013లో 84% మహిళలు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆ తర్వాతి స్థానాల్లో కోల్‌కతా, జైపూర్ నిలిచాయి.
|
» కొండ ప్రాంతాలు, బీచ్‌లతో పోల్చుకుంటే నగరాల్లో పర్యటనకే మహిళలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఈ సర్వేలో తేలింది. నగరాల్లో శాంతిభద్రతలు, రక్షణ ఎక్కువగా ఉంటాయని వారు భావిస్తున్నారు. గత రెండేళ్లలో బృందాలతో కలసి విహార యాత్రలకు వెళ్లామని 47% పర్యటకులు చెప్పగా, ఒంటరిగా వెళ్లామని 35% చెప్పారు. ఒంటరిగా పర్యటనలకు ఇష్టపడుతున్న మహిళలు యోగా, ఇతర ఆధ్యాత్మిక పర్యటనలకు ప్రాధాన్యం ఇస్తుండగా, బృందాలుగా వస్తున్న వారు సైట్ సీయింగ్, షాపింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.
|
¤ టైమ్స్ ఉన్నత విద్య మేగజీన్ 2014 సంవత్సరానికి ప్రకటించిన 100 ప్రపంచ ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల జాబితాలో తొలి ర్యాంకును అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ దక్కించుకుంది.
|
|
» హార్వర్డ్ తర్వాతి స్థానాల్లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
(ఎంఐటీ), స్టాన్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, కాలిఫోర్నియా, బర్కెలీ వర్సిటీలు
ఉన్నాయి.
» చైనాకు చెందిన రెండు వర్సిటీలు టాప్ - 50లో ఉండగా రష్యా, బ్రెజిల్‌ల నుంచిఒక్కో వర్సిటీ చొప్పున ఉన్నాయి. భారత్ నుంచి ఏ యూనివర్సిటీ
కూడా తొలి 100స్థానాల్లో చోటు పొందలేకపోయింది.
» ప్రధాని మన్మోహన్ సింగ్ చదువుకున్న పంజాబ్ వర్సిటీ 226 - 300ర్యాంకుల విభాగంలో ఉంది. దాని తర్వాత ఢిల్లీ, కాన్పూర్,
ఖరగ్‌పూర్,రూర్కీవర్సిటీలు 351 - 400 ర్యాంకుల విభాగంలో నిలిచాయి.
¤ భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2014-15 ఆర్థిక సంవత్సరంలో5.6 శాతానికి పుంజుకోగలదని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ నివేదికవెల్లడించింది.
» గత రెండేళ్లతో పోలిస్తే 2014లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కూడా
మెరుగ్గాఉంటుందని నివేదిక వెల్లడించింది.
» 2014-15లో భారత వృద్ధికి పారిశ్రామిక రంగం నుంచి ప్రధానంగా చేయూత
లభిస్తుందని నివేదిక వెల్లడించింది. ఈ రంగం 4.1% మేర వృద్ధి చెందగలదని
అంచనా వేసింది.
» భారత ఎగుమతులు 8% నుంచి 10% వరకు వృద్ధి చెందుతాయని నివేదికవెల్లడించింది. |
మార్చి - 7
|
¤ 'వివిధ సంస్థల్లోని ఉన్నతోద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం' అనే అంశంపై 'గ్రాంట్ థ్రాంటన్' అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఉన్నతోద్యోగాల్లో భారత మహిళల ప్రాతినిధ్యం కేవలం 14 శాతానికే పరిమితమైంది. ఇది ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ. పదేళ్ల కిందట ప్రపంచ సగటు 19% కాగా, నేడు 24% గా ఉంది.
» 2014 అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ఈ సర్వే ఫలితాలను విడుదల చేశారు.
» పని ప్రదేశాల్లో లింగ సమానత్వం, తదితర అంశాల కోసం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నప్పటికీ కంపెనీల్లో ఉన్నతోద్యోగాల స్థాయికి వెళ్లే భారత మహిళల ప్రాతినిధ్యం తగ్గుతోందని సర్వే వెల్లడించింది.
» సర్వే ప్రకారం తూర్పు యూరప్‌లో 37%, ఆగ్నేయాసియాలో 35%, చైనాలో 38% మహిళల ప్రాతినిధ్యం ఉంది.
» దేశంలోని పలు సంస్థలు ఏటా 13% మహిళా గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా ఇది 21% గా ఉంది.
¤ సీఎంఎస్ సంస్థ 'ఇండియా కరప్షన్ సర్వే-2013' ఫలితలను మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది.
ముఖ్యాంశాలు
లంచం ఇవ్వందే పౌర సేవలను అందుకోవడం నానాటికీ కష్టమవుతోందని 56% మహిళలు వెల్లడించారు. విద్యుత్, తాగునీరు, ప్రజాపంపిణీ, వైద్యం, మున్సిపాలిలీ, పోలీస్, న్యాయసేవల కోసం లంచం ఇవ్వాల్సి వస్తోందని వారు వెల్లడించారు.
బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 'ప్రభుత్వ సేవలను పొందడానికి మహిళలు లేదా వారి సంబంధీకులు లంచం ఇవ్వాల్సి వచ్చిందా' అనే అంశంపై సర్వే నిర్వహించారు.
2008లో ఇదే సర్వే నిర్వహించినపుడు, పౌరసేవల కోసం లంచం ఇచ్చినట్లు 44% ప్రజలు చెప్పగా, ఇప్పుడది 56 శాతానికి పెరిగింది. |
మార్చి - 11
|
¤ 'భారత మానవ వనరుల అభివృద్ధి నివేదిక - 2011'ను యునిసెఫ్ విడుదల చేసింది.
» ఈ నివేదిక ప్రకారం ఇటీవలికాలంలో దాదాపు 8 కోట్ల మంది చిన్నారులు ప్రాథమిక విద్యను పూర్తి చేయకుండానే బడులు మానేశారు. దాదాపు 80 లక్షల మంది అసలు పాఠశాలలకే వెళ్లలేదు.
» భారత్‌లో అర్ధంతరంగా బడి మానేస్తున్న చిన్నారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని, ఇలాంటి వారిలో ఎక్కువమంది ఆడపిల్లలే ఉంటున్నారని యునిసెఫ్ నివేదిక వెల్లడించింది. |
మార్చి - 13
|
¤ భారత విమానయాన రంగం 2030 నాటికి ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఆవిర్భవించనుందని ఫిక్కీ-కేపీఎంజీ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లో జరుగుతున్న 'ఇండియా ఏవియేషన్ షో - 2014' సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. 2020 నాటికి భారత విమానయాన రంగం ప్రపంచంలో మూడో స్థానానికి, ఆ తర్వాత మరో పదేళ్లకు అగ్రస్థానానికి చేరుకుంటుందని తెలియజేసింది. దేశంలోని విమానయాన సంస్థల విస్తరణ ప్రణాళికలు, ప్రతిపాదిత మౌలిక ప్రాజెక్టులు దీనికి కారణమని నివేదికలో పేర్కొన్నారు. |
మార్చి - 17
|
¤ ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో మన దేశంలోని లూధియానా, కాన్పూర్ చేరాయి. 2011 ఏడాదికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
» ఒక ఘనపు మీటరు గాలిలో కాలుష్యాలు ఎంత మైక్రోగ్రామ్ కాన్సంట్రేషన్ (ఎంసీజీ)తో ఉన్నాయనే విషయం ప్రకారం అక్కడి కాలుష్య స్థాయిని లెక్కిస్తారు.
» ఘనపు మీటరులో 20 ఎంసీజీకి మించి కాలుష్యాలు ఉంటే ఆరోగ్యానికి చేటు చేస్తాయని డబ్ల్యుహెచ్‌వో చెబుతోంది. కానీ ప్రపంచంలోని తొలి పది కాలుష్య నగరాల్లో ఈ స్థాయికి అనేక రెట్లు అధికంగా వ్యర్థాలు పేరుకుపోవడం గమనార్హం.
అత్యంత కాలుష్య నగరాల జాబితా
అహ్వాజ్, ఇరాన్ - ఘనపు మీటరుకు 372 ఎంసీజీఉలాన్ బాటోర్, మంగోలియా - 279 ఎంసీజీసనందాజ్, ఇరాన్ - 254 ఎంసీజీలూధియానా (భారత్), క్వెట్టా (పాకిస్థాన్) - 251 ఎంసీజీకెర్మాన్‌షాష్, ఇరాన్ - 229 ఎంసీజీపెషావర్, పాకిస్థాన్ - 219 ఎంసీజీగాబోరోనె, బోత్స్వానా - 216 ఎంసీజీయసూజ్, ఇరాన్ - 215 ఎంసీజీకాన్పూర్, భారత్ - 209 ఎంసీజీలాహోర్, పాకిస్థాన్ - 200 ఎంసీజీ . |
మార్చి - 19
|
¤ ఆర్థిక స్వేచ్ఛ గల రాష్ట్రాల్లో గుజరాత్ అగ్ర స్థానంలో నిలిచినట్లు 'భారత రాష్ట్రాల్లో ఆర్థిక స్వేచ్ఛ' అనే తాజా సర్వే నివేదిక తేల్చింది. ఈ నివేదికను ఆర్థిక వేత్తలు అశోక్ గులాటి, బిబేక్ డెబ్రాయ్, లవీష్ భండారితో పాటు పాత్రికేయులు స్వామినాథన్ అయ్యర్ రూపొందించారు.
» ప్రభుత్వ పరిమాణం, న్యాయ నిర్మాణం, మేధో సంపత్తి హక్కులకు భద్రత, కార్మికులు, వ్యాపార నియంత్రణ లాంటి పరామితుల ఆధారంగా ఈ విషయాన్ని తేల్చారు.
» ఆర్థిక స్వేచ్ఛ విషయంలో 0 నుంచి 1.0 వరకు నిర్దేశించిన సూచీలో గుజరాత్ 0.65 స్కోర్ సాధించినట్లు నివేదిక తెలిపింది.
» తమిళనాడు 0.54 స్కోరుతో రెండో స్థానంలో నిలిచినా, గుజరాత్‌కు దూరంగానే ఉండిపోయింది. ఈ వరసలో తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ (0.50) నిలిచింది.
» వేగంగా మెరుగుపడిన రాష్ట్రం విషయంలో ఆంధ్రప్రదేశ్ 0.40 నుంచి 0.50 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది.
|
¤ మన దేశంలోని స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీవోలు) విదేశాల నుంచి ఏటా రూ.11,500 కోట్లకు పైగా నిధులను విరాళంగా స్వీకరిస్తున్నాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ నిధుల విషయంలో పారదర్శకతను పాటించకపోతే ఉగ్రవాద సంస్థలు, మనీ ల్యాండరింగ్ శక్తులకు ఒక వేదికగా ఉపయోగపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
|
|
» 'ఎన్‌జీవోలు స్వీకరిస్తున్న విదేశీ విరాళాలు' అనే అంశంపై కేంద్ర హోంశాఖ వార్షిక నివేదికను వెల్లడించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు:
విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం కింద 2012, మార్చి 31 నాటికి 43,527
స్వచ్ఛంద సంస్థలు నమోదయ్యాయి.
విదేశీ నిధులు అత్యధికంగా (రూ.945.77 కోట్లు) గ్రామీణాభివృద్ధి రంగానికి
అందుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో శిశు సంక్షేమం (రూ.929.99 కోట్లు) ,విద్యాసంస్థల నిర్మాణం, నిర్వహణ (రూ.824.11 కోట్లు), పరిశోధన (రూ.539.14కోట్లు) రంగాలు ఉన్నాయి.
2011-12 ఆర్థిక సంవత్సరంలో 22,702 ఎన్‌జీవోలు మొత్తం రూ.11,546 కోట్లవిరాళాలను స్వీకరించాయి.
భారతదేశంలో మొత్తం ఎన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయన్నదానిపై
స్పష్టతలేనప్పటికీ, అనధికారిక సమాచారం ప్రకారం దాదాపు 20 లక్షల
ఎన్‌జీవోలుఉండవచ్చని తెలుస్తోంది. వీటిలో విదేశీ విరాళాలు తీసుకుంటున్నవి 43,527సంస్థలు. |
మార్చి - 20
|
¤ దేశంలో బ్యాంకుల నుంచి తీసుకుంటున్న వ్యక్తిగత రుణాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్ధానంలో ఉంది. మొదటి స్ధానంలో మహారాష్ట్ర నిలిచింది. మూడు, నాలుగు, అయిదో స్థానాల్లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు ఉన్నాయి. దేశంలోనే మొదటి రుణ సమాచార సేవల సంస్థ అయిన 'సిబిల్' పదేళ్ల కాలాన్ని పూర్తి చేసింది. ఈ సందర్భంగా రుణ గ్రహీతలకు సంబంధించి ఆసక్తికరమైన ధోరణులను విడుదల చేసింది.
» క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్, సిబిల్ గణాంకాల ప్రకారం, గత మూడేళ్లలో రుణ దరఖాస్తుల సంఖ్య 200 శాతం పెరిగింది. ఇందులో యుక్తవయస్కుల నుంచి వచ్చిన దరఖాస్తులే అధికం. నలభై ఏళ్ల వయస్సు లోపు ఉన్న వారి నుంచి వచ్చిన దరఖాస్తులు 60 శాతం ఉన్నాయి. 2014లో 35 ఏళ్ల లోపు వయస్కుల నుంచి 40 శాతం దరఖాస్తులు వచ్చాయి. అదే 2008లో ఇది 30 శాతమే.
|
» గత అయిదేళ్లుగా అధిక వృద్ధిని కనబరిచిన విభాగాల్లో వ్యక్తిగత రుణాలు, ద్విచక్ర వాహన రుణాలు, గృహ రుణాలు ఉన్నాయి. ఈ విధమైన వృద్ధికి తాము అందించే రుణ సమాచారం ఎంతగానో దోహదపడినట్లు సిబిల్ పేర్కొంది. |
|
» రిటైల్ రుణాల్లో బ్యాంకుల నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏలు) రేటు 2010లో 1.9 శాతం ఉండగా, 2013 నాటికి ఇది 1.3 శాతానికి తగ్గింది. దీన్ని బట్టి గత నాలుగేళ్లలో ఎన్‌పీఏలు 40 శాతం తగ్గినట్లు స్పష్టమవుతోందని సిబిల్ పేర్కొంది. » 33 కోట్ల మంది వ్యక్తులు, 1.7 కోట్ల వ్యాపార సంస్థల రుణ సమాచారం సిబిల్ వద్ద ఉంది. |
మార్చి - 23
|
¤ దేశంలోని స్వచ్ఛంద సంస్థలు ఏటా వేల కోట్ల రూపాయల విదేశీ నిధులను విరాళాలుగా పొందుతున్నప్పటికీ వాటిలో కేవలం 2 శాతం సంస్థలు మాత్రమే ప్రభుత్వం వద్ద తమ పేర్లు నమోదు చేయించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం వద్ద స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీవో)ల వివరాలు, అవి అందుకుంటున్న విరాళాల సంపూర్ణ సమాచారం లేనప్పటికీ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం, ట్రస్టుల చట్టం, ఇతర నిబంధనల ప్రకారం నమోదైన సంస్థలు 20 లక్షల వరకు ఉంటాయని అంచనా. వీటిలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద నమోదైన సంస్థలు మాత్రం 2 శాతానికి మించి లేవని కేంద్ర హోంశాఖ ఒక నివేదికలో తెలిపింది.
» విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద 2012 మార్చి నాటికి 43,527 సంస్థలు నమోదు చేసుకోగా, అందులో 22,702 సంస్థలు ఒక్క 2011-12లోనే రూ.11,546.29 కోట్ల విదేశీ నిధులను పొందినట్లు సమాచారం అందించాయి.
» 9509 సంస్థలు ఎలాంటి విదేశీ నిధులు స్వీకరించలేదంటూ రిటర్నులు దాఖలు చేయగా, మిగిలినవి ఎలాంటి నివేదికలూ ఇవ్వలేదు.
» విదేశీ నిధులను ఢిల్లీలో ఉన్న సంస్థలు అధికంగా (1482 సంస్థలు రూ.2285.75 కోట్లు) పొందాయి. తమిళనాడుకు చెందిన 3341 సంస్థలు రూ.1704.76 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 2527 సంస్థలు రూ.1258.52 కోట్లు, మహారాష్ట్రకు చెందిన 2056 సంస్థలు రూ.1107.52 కోట్లు అందుకున్నాయి.
» విరాళాలు పంపించిన దేశాల్లో అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్ మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. |
మార్చి - 27
|
¤ ప్రపంచవ్యాప్తంగా 2013లో 778 మందికి ఉరి శిక్ష అమలు చేసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. వీటిలో భారత్‌లో ఒక ఉరి శిక్ష అమలైనట్లు పేర్కొంది. లండన్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్' తాజా నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు
2012 గణాంకాలతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా మరణ శిక్షలు 15 శాతం పెరిగాయి.
2013 చివరికి 17 దేశాల్లో కొత్తగా 1030 ఉరిశిక్షలను విధించారు. వాటిలో భారత్‌లో 72 మందికి ఉరిశిక్ష విధించగా, 400మందికి ఉరిశిక్ష విధించే అవకాశం ఉంది.
అత్యధికంగా పాకిస్థాన్‌లో 226, బంగ్లాదేశ్‌లో 220, అఫ్ఘానిస్థాన్‌లో 174 మందికి ఉరిశిక్షలను విధించారు.
ఆసియా - పసిఫిక్ ప్రాంతంలోని దేశాలు మరణ శిక్ష వివరాలను గోప్యంగా ఉంచుతున్నాయి.
భారత్‌లో పార్లమెంటుపై దాడి చేసిన తీవ్రవాది అఫ్జల్ గురును గతేడాది ఉరి తీశారు.
చైనా, భారత్, ఇండోనేషియా, జపాన్, మలేసియా, వియత్నాం దేశాలు మరణ శిక్ష విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను, పారదర్శకతను పాటించడం లేదు. ఆ వివరాలను వెల్లడించడానికిగానీ, కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, సాధారణ ప్రజానీకానికి తెలియజేయడానికి అవి నిరాకరిస్తున్నాయి.
|
¤ గత డిసెంబరు చివరి నాటికి భారత విదేశీ రుణం రూ.25,56,000 కోట్లకు (42,600 కోట్ల డాలర్లు) చేరింది. 2013 మార్చి ఆఖరున నమోదైన విదేశీ రుణంతో పోలిస్తే ఇది రూ.1,26,600 కోట్లు (5.2%) ఎక్కువ. దీర్ఘకాలిక రుణం ముఖ్యంగా ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) డిపాజిట్లు పెరగడమే విదేశీ అప్పు పెరగడానికి కారణమని తాజా త్రైమాసిక నివేదికలో ఆర్థిక శాఖ వెల్లడించింది. 2013 సెప్టెంబరు - నవంబరులో 'స్వాప్' పథకం కింద సమీకరించిన ఎఫ్‌సీఎన్‌ఆర్ (బి) డిపాజిట్లు ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు పెరగడానికి దోహదం చేశాయని పేర్కొంది.
|
» 2013 మార్చి చివరకు విదేశీ అప్పు జీడీపీలో 21.8 శాతంగా నమోదు కాగా డిసెంబరు చివరి నాటికి 23.3 శాతానికి చేరింది.
| |
» దీర్ఘకాలిక విదేశీ రుణం 8.1 శాతం పెరిగి రూ.19,99,800 కోట్లకు చేరగా స్వల్పకాలిక రుణం 4.1 శాతం తగ్గి రూ.5,56,200 కోట్లకు పరిమితమైంది. » మొత్తం విదేశీ రుణాల్లో దీర్ఘకాలిక రుణం వాటా 78.2 శాతం కాగా స్వల్పకాలిక రుణం 21.8 శాతం. » ప్రభుత్వ విదేశీ అప్పు (సావరిన్) రూ.4,58,400 కోట్లుగా నమోదైంది. మొత్తం విదేశీ రుణంలో ఇది 17.9 శాతం. » డాలర్ల రూపంలో అత్యధికంగా 63.6 శాతం అప్పు తీసుకోగా రూపాయి రూపేణా 19.4 శాతం, ఎస్‌డీఆర్‌లలో 7.1 శాతం, జపాన్ యెన్‌లో 5 శాతం, యూరోలలో 3.1 శాతం చొప్పున విదేశీ రుణం నమోదైంది. » మొత్తం విదేశీ అప్పులో భారత విదేశీ మారక నిల్వలు 69 శాతానికి సరిపోతాయి. గత మార్చిలో ఇది 72.1 శాతంగా ఉంది. |
మార్చి - 31
|
¤ పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల భారతదేశ ఆహార భద్రతా వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని వాతావరణ మార్పులపై ఏర్పాటైన 'అంతర్ ప్రభుత్వ సంఘం (ఐపీసీసీ)' హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులపై అధ్యయనం చేసే ఈ సంస్థ అయిదో అంచనా నివేదికలోని రెండో అధ్యాయాన్ని జపాన్‌లో విడుదల చేసింది.
» కర్బన ఉద్గారాల్లో కార్బన్‌డయాక్సైడ్‌తోపాటు ఉండే ఓజోన్ వల్ల భారత్‌లో వరి, మొక్కజొన్న పంటల ఉత్పత్తి పడిపోతుందని ఈ నివేదిక పేర్కొంది. |
|
|