జనరల్ నాలెడ్జ్ బిట్స్
ఎలక్ట్రిక్ ల్యాంప్‌ను కనుక్కున్న థామస్ ఆల్వా ఎడిసన్ ఏ దేశస్థుడు?
జ: అమెరికా
'ఎ సూటబుల్ బాయ్' గ్రంథ రచయిత?
జ: విక్రమ్ సేథ్
అబిసీనియా దేశం నూతన నామం?
జ: ఇథియోపియా
ప్రపంచంలో తొలి మహిళా ప్రధానమంత్రిగా సిరిమావో బండారు నాయకే చరిత్ర కెక్కారు. ఈమె ఏ దేశానికి ప్రధాన మంత్రిగా వ్యవహరించారు?
జ: శ్రీలంక
ప్రముఖులు - సమాధులకు సంబంధించి సరైన జతలను గుర్తించండి.
1. మహాత్మాగాంధీ - రాజ్‌ఘాట్
2. చరణ్‌సింగ్ - కిసాన్ ఘాట్
3. మొరార్జీ దేశాయ్ - అభయ్ ఘాట్
4. బాబూ జగ్జీవన్‌రామ్ - సమతాస్థల్
జ: 1, 2, 3, 4
కేంద్ర పాలిత ప్రాంతాలు - రాజధానుల జతలకు సంబంధించి సరైనవి గుర్తించండి.
1. అండమాన్ నికోబార్ - పోర్ట్ బ్లెయిర్
2. దాద్రానగర్ హవేలి - సిల్వస్సా
3. డామన్ డయ్యూ - డామన్
4. లక్షద్వీప్ - కవరత్తి
జ: 1, 2, 3, 4
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటుపొందిన దేశంలోని జాతీయ పార్కులు-
జ: 1. కజిరంగా జాతీయ పార్కు - అసోం (1985)
2. కిలాడియో ఘనా జాతీయ పార్కు - రాజస్థాన్ (1985)
3. మానస్ శాంక్చ్యురీ - అసోం (1985)
4. సుందర్బన్స్ జాతీయ పార్కు - పశ్చిమ బెంగాల్ (1987)
5. నందాదేవి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కు- ఉత్తరాఖండ్ (1988)
నోబెల్ బహుమతి గెలుచుకున్న రెండో భారతీయుడు ఎవరు? (1913లో నోబెల్ బహుమతి గెలుచుకున్న తొలి భారతీయుడు, తొలి ఆసియావాసిగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఘనత సాధించారు.)
జ: సి.వి.రామన్
ప్రభుత్వ ఉద్యోగ ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు-
జ: 117వ రాజ్యాంగ సవరణ బిల్లు
సరైన జతలను గుర్తించండి.
1. తొలి రాష్ట్రపతి - రాజేంద్రప్రసాద్
2. తొలి ఉపరాష్ట్రపతి - సర్వేపల్లి రాధాకృష్ణన్
3. తొలి భారత ప్రధాన న్యాయమూర్తి - హీరాలాల్ జె. కానియా
4. తొలి లోక్‌సభ స్పీకర్ - సుకుమార్ సేన్
జ: 1, 2, 3
ఆఫ్రికా ఖండంలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం?
జ: కిలిమంజారో " రోబో " సినిమా పాటలో ఉన్న
'గాడ్ ఆఫ్ అగ్రికల్చర్' గా ఏ గ్రహాన్ని పిలుస్తారు?
జ: శని
'మహామాన్య' బిరుదు ఎవరికి కలదు ?
జ:మదన్ మోహన్ మాలవ్యా
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment