'ఫొటోగ్రఫీ ' అనే గ్రీకు మాటకి 'కాంతి రాత' అని అర్థం. ఈ మాటకు తొలిసారిగా 1837లో
సర్ జాన్ హెర్షల్ వాడుకలోకి తీసుకొచ్చారు. క్రీ.పూ. 5వ శతాబ్ధంలో ఒక చైనా తాత్వికుడు కాగితంలాంటి ఓ తలపై తొలిసారిగా ఒక చిత్రాన్ని నమోదు చేయగలిగాడు.
గుండుసూది మొనంత సన్నని రంధ్రం గుండా ఓ చీకటి గదిలోకి కాంతిని పంపించడం
ద్వారా, ఒక బొమ్మ తాలూకూ తల కిందులుగా ఉండే చిత్రాన్ని అతను పొంద గలిగాడు.
ఒక విధంగా ప్రపంచంలో దీనినే మొట్టమొదటి ఫోటో అని చెప్పాల్సి ఉంటుంది. ఆ తరువాత
21 వందల సంవత్సరాలకు, 17వ శతాబ్ధంలో నిప్సీ అనే ఒక వ్యక్తి ఎండలో పెట్టినప్పుడు గట్టిగా
మారే ఒక పదార్థం మీద బొమ్మల తాలూకూ 'చిత్రం' పడేలా చేయగలిగాడు.
శాశ్వతంగా (సుదీర్ఘకాలం) ఉంటుంది అన్న నిజాన్ని కూడా అతను కనుగొన్నాడు.
ఇక దానితో వాడవాడలా ఫోటో స్టూడియోలు వెలియడం మొదలయ్యింది.
అనేక నూతన ఆవిష్కరణలలాగే 'ఫోటోగ్రఫీ' కూడా మొదట్లో చాలా వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. లోహపు పలకల మీద మనుషుల ముఖాలను ముద్రించడం అనేది దెయ్యాలు
చేసే పని అంటూ చర్చి అధికారులు దానిని తీవ్రంగా వ్యతిరేకించారు.
తమ ఉపాధి అవకాశాలు పోతాయంటూ చిత్రకారులు కూడా దీనిని గట్టిగా అడ్డుకున్నారు.
ఏమైతేనేం ఇలాంటి అడ్డంకు లన్నింటినీ అధిగమించి ఫోటోగ్రఫీ పరిశ్రమ మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లడం మొదలుపెట్టింది. 1850 నుంచి నేటి దాకా ఫోటోగ్రఫీ విజ్ఞానం
ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందింది.
ఇంకా చదవండి :
పర్వత శ్రేణులు |
ఎడారులు |
పీఠభూముల |
జలసంధులు |
సౌర కుటుంబం |
దేశాలు - మారిన పేర్లు |
ప్రపంచ నగరాలు - వాడుక పేర్లు |
వివిధ ప్రదేశాలు - నామాంతరాలు |
విపత్తు నిర్వహణ |
భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు |