1953లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది? - జనరల్ నాలెడ్జ్ బిట్స్



జనరల్ నాలెడ్జ్ బిట్స్ 

  మంత్రిత్వ శాఖల్లో 1961 నుంచి శాశ్వత ప్రాతిపదికపై సెన్సస్ వ్యవస్థగా పనిచేస్తున్న మంత్రిత్వశాఖ ఏది?
జవాబు : స్వదేశీ వ్యవహారాలు

 ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లోని 18 భాషలకు మరో నాలుగు భాషలు చేర్చి ఆ షెడ్యూల్‌లో మొత్తం భాషల సంఖ్యను 22కు పెంచారు?
జవాబు: 92వ రాజ్యాంగ సవరణ చట్టం

సరిహద్దు నిర్వహణ విభాగం కేంద్రంలోని ఏ మంత్రిత్వశాఖకు చెందిన విభాగం?
జవాబు: దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ

 1953లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది?
జవాబు: కర్నూలు

 బయోడీజిల్ మిషన్‌ను అమలుచేస్తున్న కేంద్ర మంత్రిత్వశాఖ-
జవాబు: గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

 భాషా ప్రయుక్త రాష్ట్రాల వాంఛనీయతను పరిశీలించడానికి రాజ్యాంగ పరిషత్ 1948లో భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ అధ్యక్షుడు ఎవరు?
జవాబు: జస్టిస్ ఎస్.కె.థార్

అధికార భాషా విభాగం (రాజ భాషా విభాగం) ఏ మంత్రిత్వశాఖ పరిధిలోకి వస్తుంది?
జవాబు: దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ

 సమాచారహక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
జవాబు: 2005

 1946-47 కాలంలోని తాత్కాలిక ప్రభుత్వంలో భారత ఆర్థిక మంత్రి ఎవరు?
జవాబు: ఆర్.కె. షణ్ముఖం చెట్టి

 దేశంలో తెగులు సోకిన మొక్కల ప్రవేశాన్ని నివారించడానికి క్వారంటైన్ క్రమబద్ధీకరకణను అనుసరించిన విభాగం ఏది?
జవాబు: జాతీయ వృక్ష జన్యు వనరుల బ్యూరో

 జాతీయ నదీ పరిరక్షణ డైరెక్టరేట్ ఏ మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉంది?
జవాబు: పర్యావరణ, అడవుల మంత్రిత్వశాఖ

 'స్వేచ్ఛా హక్కు'కు సముచితమైన ఆంక్షగా దేన్ని భావిస్తారు?
జవాబు: నాగాలాండ్ ప్రభుత్వం నాగాలాండ్‌లో స్థిరాస్తి కొనుగోలు చేయడానికి తాత్కాలిక నివాసులకు అనుమతించకపోవడం

 కేంద్రం, రాష్ట్రాల్లో మంత్రి మండలుల పరిమాణం లోక్‌సభ శాసనసభల మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకూడదని పేర్కొంటున్న రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
జవాబు: 91

 భారత ప్రభుత్వ పరిధిలో స్వతంత్ర విభాగం కానిది-
జవాబు: అణుశక్తి విభాగం

పార్లమెంటులో పార్టీ ఫిరాయింపులను నిషేధించే రాజ్యాంగ సవరణ ఏది?
జవాబు: 52

 ప్రాథమిక హక్కులకు, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలకు మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు రాజ్యవిధాన ఆదేశిక సూత్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంటున్న రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
జవాబు: 42

సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం దేన్ని సమకూర్చవచ్చు?
జవాబు: మేధోపరమైన సంపదకు సంబంధించిన సమాచారానికి చెందిన షరతు పూర్వక వెల్లడి

 వాన నీటి బిందువు గాలి ద్వారా కిందికి పడితే దాని వేగం-
జవాబు: కొంత సమయం పెరుగుతుంది. తర్వాత స్థిరంగా ఉంటుంది

 నిర్ణీత దూరానికి మించి టెలివిజన్  సంకేతాలు అందకపోవడానికి కారణం-
జవాబు: భూమి వక్రత

ఒక వ్యక్తి నిలిచి ఉన్న కారులో కూర్చొని ఉన్నాడు. కారు నాలుగు చక్రాల్లో ఒక్కోదాని దగ్గర రోడ్డు నుంచి ఏర్పడే ప్రతి చర్య R. కారు, రుజు స్థాయి ఉన్న రోడ్డు మీద పయనిస్తున్నప్పుడు, ముందు చక్రాల దగ్గర ప్రతిచర్య ఎలా ఉంటుంది?
జవాబు: R కు సమానం




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment