ఫిబ్రవరి - 2015 వార్తల్లో ప్రదేశాలు - February 2015 - Locations in News



ఫిబ్రవరి - 5 
¤ భారత్-అమెరికా భాగస్వామ్యంలో భాగంగా రక్షణ రంగంలో అభివృద్ధి, ఉత్పత్తిని సంయుక్తంగా చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో దక్షిణాదిలో కీలకమైన హైదరాబాద్, బెంగళూరు నగరాలను అమెరికా డిఫెన్స్ కేంద్రాలుగా ఎంపిక చేసింది.      » దిల్లీలో వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన ఒక సదస్సులో పాల్గొన్న భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ ఈ విషయాన్ని వెల్లడించారు.      » రక్షణకు సంబంధించిన అత్యాధునిక టెక్నాలజీల అభివృద్ధికి అమెరికన్ కంపెనీలు హైదరాబాద్, బెంగళూరు నగరాలను కీలక స్థావరాలుగా మలచుకుంటాయని రిచర్డ్ పేర్కొన్నారు.¤ టెలికం పరికరాలు, మొబైల్ ఫోన్స్ తయారీలో ప్రపంచ దిగ్గజంగా నిలుస్తున్న చైనా కంపెనీ హువాయ్ బెంగళూరులో తన పరిశోధన అభివృద్ధి (ఆర్అండ్‌డీ) కేంద్రాన్ని ప్రారంభించింది.
      »
 ఇది భారత్‌లో ఒక చైనా కంపెనీ నెలకొల్పిన తొలి క్యాంపస్ మాత్రమే కాకుండా చైనా వెలుపల హువాయ్‌కి అతిపెద్ద ఆర్అండ్‌డీ కేంద్రం.
 
ఫిబ్రవరి - 7 
¤  ఖమ్మం జిల్లాలో అయిదు వేల ఏళ్ల నాటి అరుదైన రాతి చిత్రాలు ఉన్నట్లు చరిత్రకారుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ ప్రకటించారు.      » ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం నల్లముడి శివారు అడవుల్లోని గుహల్లో రాతి చిత్రలేఖనాలను కనుక్కున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక్కడ చరిత్ర పూర్వయుగపు చిత్ర లేఖనాలున్న గుహను స్థానిక నాయకపోడు గిరిజనులు 'అక్షరాల లొద్ది' అని పిలుస్తారని ఆయన తెలిపారు.      » సుమారు పది మీటర్ల పొడవు, ఏడు మీటర్ల ఎత్తుతో దక్షిణాది ముఖంగా సెలయేరు ఒడ్డున ఉన్న ఈ గుహలో ఎరుపు రంగు చిత్రాలు, రేఖా చిత్రాలు (తొలిచినవి), తొలిచిన చిత్రాల్లో రంగు పూసినవి మొత్తం మూడు రకాల చిత్ర లేఖనాలున్నాయని ఆయన వెల్లడించారు. ఇవి మధ్య రాతి యుగానివని..... అంటే కనీసం అయిదువేల సంవత్సరాల కిందటివని వివరించారు. ఈ గుహలో చిత్రించిన చిత్రాల్లో ప్రధానంగా జంతువులు, దేవతలు, మానవ కార్యకలాపాలున్నాయి.      » దేవతా చిత్రాలు, త్రిశూలం, పల్లకీ మోత, స్వస్తిక్, ఎద్దు - ఏనుగుల రేఖా చిత్రాలు ఈ గుహలో కనిపిస్తాయి. ఎద్దు రేఖా చిత్రాలు నవీన శిలా యుగానికి చెందినవి కాగా, ఏనుగులు, దేవతా సంబంధ చిత్రాల్లో చాలా వరకు రాక్షసగుళ్ల యుగానికి చెందినవని ప్రాథమిక పరిశోధనలో తేలింది.¤ కరీంనగర్ జిల్లా కాళేశ్వరం సరిహద్దులోని మహారాష్ట్ర సిరొంచా తాలూకాలోని వడిదం అటవీ ప్రాంతంలో క్రీస్తుపూర్వం 14-16 శతాబ్దం నాటి అవశేషం బయటపడింది. ఇది సుమారు 30 నుంచి 35 అడుగుల పొడవుతో భారీ వృక్షాన్ని పోలి, గట్టి బండరాయిలాగ నిలువుగా భూమిలో కూరుకుపోయి ఉంది.      » ఇదే అటవీ ప్రాంతంలో 1959లో డైనోసార్ (రాక్షస బల్లులు) ఆనవాళ్లు భారతదేశంలో మొదటిసారిగా కనుక్కున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. 
ఫిబ్రవరి - 9 
¤ హైదరాబాద్‌కు కేవలం 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న రాచకొండ గుట్టల్లో గతంలో లభించిన శాసనాలు 14వ శతాబ్దానికి చెందినవిగా నిపుణులు నిర్ధరించారు. పద్మనాయక రాజుల కాలం నాటివని తాజాగా నిపుణులు తేల్చారు.      » ఇటీవల అక్కడ గుర్తించిన గుహ చిత్రాలు, రేఖా చిత్రాల (పెట్రోగ్లిప్స్)ను అధ్యయనం చేసిన నిపుణులు ఆ రంగు చిత్రాలు కొత్తరాతి (మూడు వేల ఏళ్ల క్రితం), బృహత్ శిలా (క్రీ.పూ.1000 ఏళ్లు) యుగాలకు చెందినవిగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. 
ఫిబ్రవరి - 12 
¤ యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లో మహిళలపై హింసను నివారించేందుకు వీలుగా ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ లండన్‌లో ఒక కేంద్రాన్ని ప్రారంభించారు.      » మహిళలు, శాంతి భద్రతలపై ఏర్పాటైన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కేంద్రం యుద్ధ ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను నిరోధించేందుకు ఇకపై పరిశోధనలు చేపట్టనుంది.      » గతంలో ఇరాక్‌లో తాను కలిసిన అత్యాచార బాధితురాలైన ఓ టీనేజీ యువతికి ఈ కేంద్రాన్ని ఆమె అంకితమిచ్చారు.
ఫిబ్రవరి - 17
¤ 'సాంభా డ్రోమ్' కార్నివాల్ ఉత్సవాలు బ్రెజిల్లోని రియోడిజనీరోలో నిర్వహించారు. అయిదు రోజులపాటు జరిగిన ఈ ఉత్సవాలకు సుమారు కోటి మంది హాజరయ్యారు. 
ఫిబ్రవరి - 21 
¤ మూడో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్యనాయుడు మహాసభలను ప్రారంభించారు.¤ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన జన్‌దన్ యోజన పథకం కింద బ్యాంకు ఖాతాలు తెరవడంలో అనంతపురం జిల్లా ధర్మవరం స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా శాఖ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.      » మొత్తం మూడు అంశాల్లో ధర్మవరం ఎస్‌బీఐ శాఖ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇక్కడ 34 వేల జన్‌ధన్ యోజన ఖాతాలు తెరిచారు. వీటిలో మహిళల పేర్లతోనే అత్యధిక ఖాతాలు ఉన్నాయి. ఖాతాదారులకు రూపే కార్డులను కూడా అందజేశారు.      » హరియాణాలోని ఫరీదాబాద్ ఎస్‌బీఐ మొదటి స్థానంలో నిలిచింది. 

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment