జులై - 2014 నివేదికలు - సర్వేలు


జులై - 1
¤  మహిళలపై నేరాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా, సైబర్ నేరాల్లో రెండో స్థానంలో నిలిచింది.

   »    దేశవ్యాప్తంగా 2013లో జరిగిన నేరాలపై జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది.

   »    2013లో సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై 32,809 నేరాలు జరిగాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ స్థాయిలో మహిళల పట్ల నేరాలు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మహిళలపై నేరాల్లో దేశంలో 10.06 శాతం తెలుగు గడ్డపైనే జరిగాయి.

   »    గత కొన్ని రోజులుగా మహిళలకు రక్షణ లేకుండా పోతోందని మారుమోగుతున్న ఉత్తరప్రదేశ్ ఈ విషయంలో రెండో స్థానంలో (32,546 కేసులు) ఉంది. మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిపాలిస్తున్న పశ్చిమ బెంగాల్ మహిళలపై నేరాల్లో మూడో స్థానంలో నిలిచింది.

   »    సైబర్ నేరాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో (635) ఉంది. ఈ విషయంలో మహారాష్ట్ర (681) తొలిస్థానంలో, కర్ణాటక (513) మూడో స్థానంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ నాలుగో స్థానంలో, కేరళ అయిదో స్థానంలో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, నాగాలాండ్, సిక్కింలలో ఒక్క సైబర్ కేసు కూడా నమోదు కాకపోవడం సానుకూలాంశం.
జులై - 2
¤  2013లో దేశవ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యల గణాంకాలతో నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికను వెలువరించింది.

ముఖ్యాంశాలు:

 గతేడాది దేశవ్యాప్తంగా 11,772 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మహారాష్ట్రలో అత్యధికంగా 3,146 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

 2,014 మంది రైతుల ఆత్మహత్యలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. వీరిలో 460 మంది మహిళలు కూడా ఉండటం గమనార్హం.

 రైతు ఆత్మహత్యల్లోనే కాకుండా కుటుంబ కలహాలు, ఆర్థిక నష్టాలు, అనారోగ్యం, గుప్త వ్యాధులు, ఇలా అనేక కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. 2011లో నాలుగో స్థానంలో ఉన్న రాష్ట్రం 2012, 13 సంవత్సరాల్లో తృతీయ స్థానానికి చేరింది.

 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువకులు 34.4 శాతం అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు.

 మొత్తం మీద గతేడాది దేశవ్యాప్తంగా 1,34,799 మంది ఆత్మహత్యలకు పాల్పడగా వారిలో తెలుగువారి సంఖ్య 14,607. 2013లో మహారాష్ట్రలో 16,622 మంది, తమిళనాడులో 16,601, ఆంధ్రప్రదేశ్‌లో 14,607, పశ్చిమబెంగాల్‌లో 13,055, కర్ణాటకలో 11,266 మంది ఆత్మహత్య చేసుకున్నారు.

¤  నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2013కు సంబంధించి విడుదల చేసిన గణాంకాల ప్రకారం...నేరాల్లో దేశవ్యాప్తంగా 2.34 లక్షల నేరాలతో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది. 2.18 లక్షల నేరాలతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది.

   »    హత్యల్లోనూ (2,484) మనది నాలుగో స్థానమే. ఆర్థిక నేరాలు (14,810 నేరాలు); దోపిడీలు, దొంగతనాల్లో (41,691 ఘటనలు) మూడో స్థానంలో ఉంది.

   »    మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో 32,809 నేరాలతో ఉమ్మడి రాష్ట్రం జాతీయ స్థాయిలో మొదట నిలిచింది. అత్యాచారాల్లో మధ్యప్రదేశ్ (4,335) మొదటి స్థానంలో ఉండగా 1635 ఘటనలతో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది. వరకట్న హత్యల్లో 492 సంఘటనలతో మనది నాలుగో స్థానం.

   »    నేరాల ఫిర్యాదుల విషయంలో మహారాష్ట్ర (17.99 లక్షల ఫిర్యాదులు) ప్రథమ స్థానంలో ఉండగా 2.65 లక్షల ఫిర్యాదులతో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో లిలిచింది.
జులై - 6
¤  దేశంలో పదిమందిలో ముగ్గురు పేదలేనని ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి మాజీ ఛైర్మన్ రంగరాజన్ నేతృత్వంలోని కమిటీ పేర్కొంది. పేదరికంపై సురేష్ టెండూల్కర్ కమిటీ అంచనాలను ఈ కమిటీ తోసిపుచ్చింది.

   »    ప్రణాళిక శాఖ మంత్రి రావ్ ఇందర్‌జిత్‌సింగ్‌కు రంగరాజన్ కమిటీ సమర్పించిన నివేదికలో 2011-12లో దేశంలో 29.5 శాతం జనాభా పేదరికంలో ఉందని తెలిపింది. పట్టణాల్లో రోజుకు రూ.47, గ్రామాల్లో రూ.32 కంటే తక్కువ వెచ్చించే వారిని పేదలుగా పరిగణించాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది.

   »    సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం పట్టణాల్లో రోజుకు రూ.33, గ్రామాల్లో రూ.27 కంటే తక్కువగా వెచ్చించే వారినే పేదలుగా పరిగణించాలి. సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం
2009-10లో 29.8 శాతం పేదరికం ఉండగా, 2011-12లో 21.9 శాతం ఉంది. పేదరికంపై టెండూల్కర్ కమిటీ అంచనాలపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి.


   »    ఆ నివేదికను సమీక్షించేందుకు, దేశంలో పేదల సంఖ్యపై సందిగ్ధతను తొలగించేందుకు గతేడాది రంగరాజన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. 2009-10లో 38.2 శాతం పేదరికం ఉండగా, 2011-12లో 29.5కు తగ్గినట్లు రంగరాజన్ కమిటీ అంచనా వేసింది.

¤  'మోర్ పవర్ టు ఇండియా - ది ఛాలెంజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్' పేరుతో ప్రపంచబ్యాంకు ఒక నివేదికను వెలువరించింది. ఈ నివేదికలో భారతదేశ విద్యుత్‌రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను వివరించింది. పలు అంశాల్లో రాష్ట్రాల వారీగా విశ్లేషణలు ఇచ్చింది. విద్యుదుత్పత్తి, సరఫరాను మెరుగుపరచి ఆదాయం పెంచుకోవాలంటే విప్లవాత్మక సంస్కరణల అమలు అవసరమని స్పష్టం చేసింది.

ముఖ్యాంశాలు: 

  'విద్యుత్ లభ్యత - సంస్కరణల' విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో ఉంది.

   సంప్రదాయేతర ఇంధనం అంశంలో ఒడిశా దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.

  నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకు సరఫరా అంశంలో సంస్కరణలు తేవడంలో మిజోరాం అగ్రస్థానంలో ఉంది.

  2010-11 నాటికి చూస్తే విద్యుత్ సరఫరా నష్టాల్లో 'ఏపీ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) 8 శాతంతో దేశంలో అతి తక్కువ నష్టాలతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత స్థానంలో ఏపీఎన్‌పీడీసీఎల్ ఉండటం గమనార్హం. 

  దేశంలో సరఫరా నష్టాల సగటు 21 శాతం కాగా అతి తక్కువగా 12 శాతంతో కేరళ అగ్రస్థానంలో ఉంది.

  గోవా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌లలో సరఫరా నష్టాలు 15 శాతంగా ఉన్నాయి.
   ప్రస్తుతమున్న విద్యుత్ ఛార్జీలను సగటున ఏటా 6 శాతం చొప్పున ప్రభుత్వాలు పెంచుతూ పోయినా 2017 నాటికి ఇంకా విద్యుత్ సంస్థలు రూ.లక్షా 25 వేల కోట్ల నష్టాల్లో ఉంటాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
జులై - 7
¤  ప్రపంచంలోని 500 పెద్ద కంపెనీలతో ఫార్చ్యూన్ పత్రిక 'గ్లోబల్ 500' జాబితాను విడుదల చేసింది.

   »    ఈ జాబితాలో 8 భారత కంపెనీలకు స్థానం లభించింది. అవి: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (96వ స్థానం) రిలయన్స్ ఇండస్ట్రీస్ (114), బీపీసీఎల్ (242), హెచ్‌పీసీఎల్ (284), టాటా మోటార్స్ (287), ఎస్‌బీఐ (303), ఓఎన్‌జీసీ (424), టాటాస్టీల్ (486).

   »    గతేడాది స్థానాలతో పోలిస్తే ఒక్క టాటా మోటార్స్ స్థానం మాత్రమే పెరిగింది. మిగిలిన కంపెనీల స్థానాలు తగ్గాయి.

   »    భారత కంపెనీల్లో మొదటి స్థానంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆదాయం 8,132 కోట్ల డాలర్లు.

   »    జాబితాలో టాటా మోటార్స్ స్థానం 316 నుంచి 287కు పెరిగింది.

   »    జాబితా మొత్తం మీద వాల్‌మార్ట్ అగ్రస్థానంలో నిలిచింది. రాయల్ డచ్‌షెల్‌ను రెండో స్థానానికి నెట్టి ఇది అగ్రస్థానానికి చేరింది. రెండేళ్ల తర్వాత మళ్లీ వాల్‌మార్ట్ ప్రథమ స్థానాన్ని పొందింది. దీని ఆదాయం 47,629 కోట్ల డాలర్లు.

   »    మూడు, నాలుగు స్థానాల్లో చైనాకు చెందిన సినోపెక్ గ్రూప్, చైనా నేషనల్ పెట్రోలియం నిలిచాయి. ఎక్సాన్ మొబిల్ అయిదో స్థానాన్ని దక్కించుకుంది.

   »    జాబితాలో కంపెనీల మొత్తం ఆదాయం 31.1 లక్షల కోట్ల డాలర్లు.

   »    జాబితాలో మొత్తం అమెరికా (128), చైనా (95), యూరప్(150) కంపెనీలు ఉన్నాయి.
జులై - 8
¤  దేశంలో కెల్లా చత్తీస్‌గఢ్ అత్యంత నిరుపేద రాష్ట్రమని రంగరాజన్ కమిటీ తెలిపింది. ఆ రాష్ట్ర జనాభాలో 47.9 శాతం మంది పేదలేనని పేర్కొంది. ఆ తర్వాత స్థానాల్లో మణిపూర్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, అసోం ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో సగటున 40 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువున ఉన్నారని కమిటీ వెల్లడించింది.

   »    2012 జూన్‌లో ప్రణాళికా సంఘం నియమించిన ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి (పీఎంఈఏసీ)కి సి.రంగరాజన్ ఛైర్మన్‌గా ఉన్నారు. పేదరిక అంచనాలపై సురేష్ టెండూల్కర్ సారధ్యంలోని కమిటీ అనుసరించిన విధానాలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దీనిపై పునఃసమీక్షకు రంగరాజన్ కమిటీని ఏర్పాటు చేశారు.

   »    రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత సంపన్నమైన రాష్ట్రం గోవా. ఇక్కడ అత్యంత తక్కువగా 6.3 శాతం మంది మాత్రమే పేదలు ఉన్నారు. గ్రామీణ పేదరికం 1.4 శాతం.

   »    నగరాల్లోనే పేదలు అధిక సంఖ్యలో ఉంటున్నారని కమిటీ వెల్లడించింది. నగర జనాభాలో 73.4 శాతం మంది పేదలే.

   »    బీహార్ నగరాల్లో 50.8 శాతం మంది పేదలని కమిటీ తెలిపింది. ఇక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరు నిరుపేద అని కమిటీ పేర్కొంది.

   »    రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం వివిధ రాష్ట్రాల్లోని పేదలు (శాతాల్లో): చత్తీస్‌గఢ్ (47.9), మణిపూర్ (46.7), ఒడిశా (45.9), మధ్యప్రదేశ్ (44.3), జార్ఖండ్ (42.4), బీహార్ (41.3), అసోం (40.9).
జులై - 11
¤  'ప్రపంచ పట్టణీకరణ అవకాశాలు - 2014' పేరుతో ఐక్యరాజ్యసమితి ఒక నివేదికను విడుదల చేసింది.

ముఖ్యాంశాలు:
 2014లో ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న నగరాల్లో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో టోక్యో ఉంది. 1990 నుంచి ఢిల్లీ జనాభా రెట్టింపై 2.5 కోట్లకు చేరింది. 3.8 కోట్ల జనాభాతో టోక్యో అగ్రస్థానంలో ఉంది.

 ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న నగరాల్లో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న ముంబయి 2030 నాటికి నాలుగో స్థానానికి చేరుకుంటుంది.

 భారత్‌లోని అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో ప్రస్తుతం 50 లక్షల నుంచి కోటి వరకూ నివాసితులు ఉండగా, రాబోయే కాలంలో మెగాసిటీలుగా అవతరిస్తాయి.

 2030 నాటికి కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, పుణె, సూరత్ 2.7 కోట్ల జనాభాను కలిగి ఉంటాయి.

 2030 నాటికి కోల్‌కతా, బెంగళూరు, చెన్నై హైదరాబాద్ ప్రపంచంలోని 30 అగ్రశ్రేణి నగరాల్లో చోటు సంపాదిస్తాయి.

 2050 నాటికి భారత్ అత్యధిక పట్టణ జనాభాతో చైనాను దాటేస్తుంది.

 2014-2050 మధ్య భారత్, చైనా, నైజీరియాల్లో భారీ ఎత్తున పట్టణాభివృద్ధి జరుగుతుంది.

 ప్రపంచంలోని సగం పట్టణ జనాభా భారత్, చైనా, అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా, జపాన్, రష్యాల్లోనే ఉంది.

 ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 54 శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 2050 నాటికి 66 శాతానికి పెరుగుతుంది.

 ఆఫ్రికా, ఆసియాల్లో పెరుగుదల అధికంగా ఉంటుంది.

 1950 నుంచి గ్రామీణ జనాభా నెమ్మదిగా పెరిగినప్పటికీ, 2020 తర్వాత క్షీణత మొదలవుతుంది.
జులై - 12 
¤  దేశంలో గృహోపకరణాలు, వస్తువుల వినియోగంపై జాతీయ నమూనా 
సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్‌వో) నిర్వహించిన సర్వే ఫలితాలను విడుదల చేశారు.   

»    దేశ వ్యాప్తంగా 7,469 గ్రామాలు, 5,268 పట్టణ ప్రాంతాల్లోని 1,01,651 గృహాల 
నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి వివరాలు వెల్లడించింది.

ముఖ్యాంశాలు:
 దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో గృహోపకరణాలు, రవాణా సాధనాల వినియోగం 
బాగా పెరిగింది. గ్రామాల్లో 2011-12 నాటికి సగం మంది ఇళ్లలో టీవీలు కొలువు 
దీరాయి. రిఫ్రిజిరేటర్ల వినియోగం మాత్రం 10 శాతం దాటలేదు. అయితే 2004-05
తో పోల్చితే గ్రామాల్లో వీటి వినియోగం రెట్టింపయింది.

 పట్టణ ప్రాంతాల్లో 80 శాతం నివాసాల్లో టీవీలుండగా, 43.8 శాతం ఇళ్లలో రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి.

 పట్టణాల్లో 71 శాతం, గ్రామాల్లో 21 శాతం ఇళ్లలో వంటకు గ్యాస్ (ఎల్‌పీజీ) వినియోగిస్తున్నారు.

 విద్యపై తలసరి వ్యయం నెలకు గ్రామాల్లో రూ.50, పట్టణ ప్రాంతాల్లో రూ.181.50గానమోదయింది.


 2004-05లో గ్రామాల్లో తలసరి బియ్యం వినియోగం 6.38 కిలోలు ఉండగా తాజా 

సర్వే నాటికి5.98 కిలోలకు తగ్గిందిపట్టణ ప్రాంతాల్లోనూ 4.71 కిలోల నుంచి 4.49 
కిలోలకు తగ్గిందిఅయితేప్రజా పంపిణీ బియ్యం వినియోగంలో మాత్రం ఏడేళ్లకు 
ముందుతో పోల్చితే భారీ వృద్ధి కనిపించింది.
 బియ్యం వాడకం తగ్గినప్పటికీ గోధుమల తలసరి వినియోగం కొంచెం పెరిగింది

గ్రామీణ ప్రాంతాల్లో2004-2005 తో పోలిస్తే 0.1 కిలోలు పెరిగిన గోధుమ వినియోగంనగరాల్లో మాత్రం
 0.35 కిలోలుతగ్గింది.
జులై - 14
¤  ప్రపంచంలో అత్యధికంగా యాంటీ బయోటిక్స్ వాడుతున్న దేశంగా భారత్ నిలిచింది. తర్వాతి స్థానంలో చైనా, అమెరికా ఉన్నాయి.

   »    ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు 71 దేశాల్లో 16 రకాల యాంటీ బయోటిక్స్‌పై అధ్యయనం చేసి ఈ నివేదికను వెలువరించారు.

   »    2000 - 10 మధ్య ప్రపంచ వ్యాప్తంగా వీటి వినియోగం 36% పెరిగినట్లు గుర్తించారు.

   »    బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాలు ప్రపంచంలో మూడోవంతుకు పైగా యాంటీ బయోటిక్స్‌ను వినియోగిస్తున్నాయి.

   »    విచ్చలవిడి వినియోగంతో యాంటీ బ్యాక్టీరియా మందులు పనిచేయని పరిస్థితి వచ్చిందని నివేదిక వెల్లడించింది
జులై - 16
¤  ట్రిప్ అడ్వైజర్ సంస్థ ట్రావెలర్స్ ఛాయిస్ సర్వేను నిర్వహించి, ఆసియాలోని టాప్ 25 అమ్యూజ్‌మెంట్ పార్కుల జాబితాను రూపొందించింది.

  »    ఈ జాబితాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీ పదో స్థానంలో నిలిచింది. ఆసియా వ్యాప్తంగా ఎక్కువ మందిని ఆకట్టుకున్న థీమ్ పార్కుల్లో హైదరాబాద్‌లోని ఆర్ఎఫ్‌సీ పదోస్థానంలో నిలవడం విశేషం.

   »    బెంగళూరులోని వండర్ లా అమ్యూజ్‌మెంట్ పార్క్ 7వ స్థానంలో, కోలకతాలోని సైన్స్‌సిటీ 14వ స్థానంలో, ముంబయిలోని ఎస్సెల్ వరల్డ్ 20వ స్థానాల్లో నిలిచాయి.

   »    సింగపూర్‌లోని యూనివర్సల్ స్టూడియోస్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. హాంకాంగ్‌లోని ఓషన్ పార్క్ రెండో స్థానంలో నిలిచింది.
జులై - 20
¤  జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీవిడుదల చేసిన గణాంకాల ప్రకారం
 దేశంలోరోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరుసగా 
రెండో ఏడాదిఅయిదో స్థానంలో నిలిచింది.

   »    2013
లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 31,228 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు.
 2012తో (29,852 మంది మరణించారుపోలిస్తే 2013లో మృతుల సంఖ్య 1376 పెరిగింది.

   »    2013
లో రోడ్డు ప్రమాద మృతులు ఎక్కువగా ఉన్న మొదటి 4 రాష్ట్రాల్లో 
మహారాష్ట్ర(62,770 మరణాలు), మధ్యప్రదేశ్ (37,456), తమిళనాడు (33,295),
 ఉత్తరప్రదేశ్(32,971) ఉన్నాయి.
జులై - 21
¤  'ఎన్నికల అనర్హతలు' అనే అంశంపై లా కమిషన్ రూపొందించిన నివేదికను కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.   

»    నేరస్థులను ఎన్నికలకు దూరంగా ఉంచడానికి ఉద్దేశించిన ప్రస్తుత నిబంధన పనికిరాకుండా తయారైందని, ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలను తీసుకురావాలని సిఫార్సు చేసింది.   

»    అయిదేళ్లు అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో అభియోగాలు దాఖలైన వ్యక్తులను ఎన్నికలకు అనర్హులుగా ప్రకటించాలని సూచించింది.   

»    తప్పుడు అఫిడవిట్లను సమర్పించడాన్ని అవినీతిగా పరిగణించాలని, ఆ పని చేసిన వారిపై ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం వేటు వేయాలని లా కమిషన్ ఈ నివేదికలో సిఫార్సు చేసింది.
జులై - 22
¤  భారత్, దక్షిణాసియా, ఆఫ్రికాలోని పలుదేశాల్లో బాల్య వివాహాలు అధికమని
 'యునిసెఫ్' తాజా నివేదిక వెల్లడించింది.


ముఖ్యాంశాలు:

 బాల్య వివాహాల సంఖ్య అత్యధికంగా ఉన్న పది దేశాల్లో భారత్నైగర్బంగ్లాదేశ్
ఛాద్మాలి,సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్గినియాఇథియోపియాబుర్కినాఫాసో
నేపాల్ ఉన్నాయి.

పంచవ్యాప్తంగా జరిగే బాల్య వివాహాల్లో సుమారు 42 శాతం దక్షిణాసియాలోనే

జరుగుతున్నాయి.

చవ్యాప్తంగా జరిగే బాల్య వివాహాల్లో మూడింట ఒక వంతు భారతదేశంలోనే

జరుగుతున్నాయి.

జులై - 24
¤  ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ) మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ) - 2013 నివేదికను టోక్యోలో విడుదల చేసింది.

   »    ఈ నివేదిక ప్రకారం 2013 సంవత్సరానికి మొత్తం 187 దేశాల్లో భారత్ 135వ స్థానంలో నిలిచింది. 2012లో 136వ స్థానంలో ఉన్న భారత్ ప్రజల జీవన ప్రమాణాల్లో కాస్త మెరుగుదలను సాధించి 135వ స్థానాన్ని చేరిందని యూఎన్‌డీపీ వెల్లడించింది.

   »    ఆరోగ్యకరమైన దీర్ఘ ఆయుఃప్రమాణం, జ్ఞానసముపార్జనకు అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణం అనే మూడు అంశాల్లో ఆయా దేశాల దీర్ఘకాలిక అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని యూఎన్‌డీపీ మానవాభివృద్ధి సూచికను రూపొందిస్తుంది.

   »    హెచ్‌డీఐ నివేదిక - 2013 ప్రకారం 0.586 (0 - 1 సూచీలో) విలువతో 'సాధారణ అభివృద్ధి'ని చూపే కేటగిరీలో భారత్ నిలిచింది. 1980 నుంచి 2013 మధ్య భారత్ హెచ్‌డీఐ విలువ 0.369 నుంచి 0.586 కు పెరిగింది.

   »    2013 హెచ్‌డీఐ నివేదికలో తొలి మూడు స్థానాల్లో నార్వే (0.944), ఆస్ట్రేలియా (0.933), స్విట్జర్లాండ్ (0.917) ఉన్నాయి.

   »    భారత్ సహా బ్రిక్స్ దేశాలేవీ అధిక అభివృద్ధి సాధించిన దేశాల జాబితాలో లేవు. బ్రిక్స్ దేశాల్లో కూడా భారత్ చివర్లో ఉంది. బ్రిక్స్ దేశాల్లో రష్యా 57వ ర్యాంకుతో తొలి స్థానంలో ఉంది. బ్రెజిల్ 79, చైనా 91 ర్యాంకుల్లో నిలిచాయి.

   »    కొన్ని దేశాలు మినహా దాదాపు అన్ని దేశాలు గత ఏడాది ర్యాంకుల వద్దే నిలిచాయి. భారత్‌లో 1980 - 2013 మధ్య జనన సమయంలో ఆయుఃప్రమాణం 11 ఏళ్లు పెరిగింది.

   »    సాధారణ అభివృద్ధి కేటగిరీలో ఉన్న దేశాల సగటు కూడా భారత్ కంటే ఎక్కువగా 0.614గా ఉంది. దక్షిణాసియా దేశాల సగటు అయిన 0.588 కంటే కూడా భారత్ హెచ్‌డీఐ విలువ తక్కువగా ఉండటం గమనార్హం.

   »    మన పొరుగు దేశాల్లో మన కంటే తక్కువగా పాకిస్థాన్ (142), బంగ్లాదేశ్ (146) ఉన్నాయి.

   »    లింగ అసమానత సూచీ (జీఐఐ) లోనూ భారత్ దిగువనే ఉంది. జీఐఐను పరిగణనలోకి తీసుకున్న 152 దేశాలకుగాను భారత్ 127వ స్థానంలో నిలిచింది.

   »    కొత్తగా ప్రారంభించిన 'స్త్రీ, పురుష అభివృద్ధి (జీడీఐ)' సూచీలో భారత్‌లోని మహిళల విలువ 0.519 కాగా పురుషుల విలువ 0.627గా ఉంది. దేశంలోని స్త్రీ, పురుష నిష్పత్తిని తెలిపే సూచీ ఇది.

   »    ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 220 కోట్లకు పైగా ప్రజలు పేదరికంలో మగ్గుతున్నట్లు యూఎన్‌డీపీ నివేదిక తెలిపింది.

   »    మానవాభివృద్ధి దృష్టి కోణం నుంచి చూసి, విశ్లేషించి ఈ దఫా నివేదికను తయారుచేసినట్లు యూఎన్‌డీపీ ప్రకటించింది.

   »    యూఎన్‌డీపీ సారధి హెలెన్ క్లార్క్.
జులై - 28
¤  2014 ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ది లక్ష్యాల సాధన నివేదికను విడుదల చేశారు.

   »    2000 సంవత్సరంలో మొదలు పెట్టి 2015 నాటికి ఎనిమిది సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని అప్పటి ఐరాస ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ సారథ్యంలో 189 సభ్యదేశాలు నిర్ణయించాయి. ఇప్పుడు ఆ సభ్యదేశాల సంఖ్య 193కు చేరింది.

   »    ఆకలి, దుర్భర దారిద్య్రాలను పారదోలడం; అందరికీ ప్రాథమిక విద్య; లింగపరమైన సమానత్వం - మహిళలకు సాధికారత; శిశు మరణాల తగ్గింపు; తల్లుల ఆరోగ్య సంరక్షణ; హెచ్ఐవీ - ఎయిడ్స్, మలేరియా తదితర రోగాల నివారణ; పర్యావరణ పరిరక్షణ; అంతర్జాతీయ భాగస్వామ్యంతో అభివృద్ధి సాధన అనేవి సహస్రాబ్ది లక్ష్యాలు.

   »    సహస్రాబ్ది లక్ష్యాలను సాధించడానికి 1990 నాటి స్థాయులను ప్రామాణికంగా తీసుకున్నారు. 2015 నాటికి అంతకంటే 50 శాతం ఎక్కువ ఫలితాలు సాధించాలని తలపెట్టారు.

   »    2014 నాటికి ప్రపంచంలోని ఏ దేశమూ అన్ని లక్ష్యాలనూ సంపూర్ణంగా సాధించలేకపోయిందని ఐరాస సహస్రాబ్ది లక్ష్యాల నివేదిక - 2014 వెల్లడించింది. కొన్ని దేశాలు కొన్ని లక్ష్యాల సాధనలో గొప్ప పురోగతి సాధించినా, మిగతా వాటిలో వెనకబడ్డాయి.
జులై - 29
¤  రంగరాజన్ కమిటీ విడుదల చేసిన 2011 - 12 పేదరిక లెక్కల నివేదిక ప్రకారం గుజరాత్, మహారాష్ట్ర లాంటి ఆర్థిక వృద్ధి బాగా ఉన్న రాష్ట్రాల్లోనూ పేదరికం ఎక్కువగా ఉంది.

   »    మౌలిక వసతులు, ఆధునిక సాంకేతికాభివృద్ధి బాగున్నప్పటికీ సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై అక్కడి ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడం వల్ల ఆయా రాష్ట్రాల్లో పేదరికం ఎక్కువగా ఉంది.

   »    అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన గుజరాత్‌లో పేదల శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

   »    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేదల శాతం 13.7 శాతం అయితే, గుజరాత్‌లో ఇది ఏకంగా 27.4 శాతం ఉంది.
             
జులై - 30
¤  'భారత పర్యాటక పరిశ్రమ: భవిష్యత్ పథం' పేరుతో అసోచామ్ నిర్వహించిన అధ్యయన ఫలితాలను విడుదల చేశారు.

ముఖ్యాంశాలు: 

  »    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశీయ పర్యాటకులకు అత్యంత ప్రాధాన్య గమ్య స్థానంగా ఉంది. 2012లో దేశవ్యాప్తంగా దేశీయ పర్యాటకులు 103 కోట్లకు పైగా ఉంటే ఇందులో దాదాపు 20 శాతం మంది పర్యాటకులను ఆకర్షించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.

   »    2006లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేసిన దేశీయ పర్యాటకులు 11 కోట్ల మంది ఉండగా 2012 నాటికి ఇది 20 కోట్లను దాటింది.

   »    విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెనకబడింది. మొదటి పది రాష్ట్రాల స్థానాల్లో చోటు దక్కలేదు.

   »    2011లో 2.6 లక్షల మంది విదేశీ పర్యాటకులు విచ్చేయగా 2012లో దాదాపు 11 శాతం మాత్రమే పెరిగి 2.9 లక్షల మందికి చేరారు.

   »    20 ప్రధాన రాష్ట్రాలు హోటళ్లు, పర్యాటక పరిశ్రమలో రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా అప్పటి ఆంధ్రప్రదేశ్‌కు రూ.6,800 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి.

¤  దేశంలో 2005 నుంచి 2013 నాటికి ఉద్యోగుల సంఖ్య 34.25 శాతం మేర పెరిగి 12.77 కోట్లకు చేరింది.

   »    'ఆరో ఆర్థిక గణన' ప్రకారం ఎనిమిదేళ్లలో ఉపాధి కల్పనలో 34.25% వృద్ధి జరిగిందని జాతీయ గణాంకాల కమిషన్ తెలిపింది.

¤  ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి తీవ్ర నీటికొరత ఏర్పడనుందని  డెన్మార్క్, అమెరికా పరిశోధకులు హెచ్చరించారు. అప్రమత్తంగా లేకపోతే 2020 నాటికే 30-40 శాతం భూభాగంలో నీటికి ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు.

   »    భారత్, చైనా, ఫ్రాన్స్, అమెరికాలో మూడేళ్లపాటు అధ్యయనం చేసి ఈ నివేదికను విడుదల చేశారు.