General Knowledge - 5

1.    కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ ఇకపై ఏటా ఏ తేదీని జాతీయ క్యాన్సర్‌ అవగాహన 
      దినంగా నిర్వహిస్తామని వెల్లడించారు? 
 - నవంబర్‌ 7

2.    ఐక్యరాజ్య సమితికి చెందిన ‘ద ఇండిపెండెంట్‌ కమిషన్‌ ఆన్‌ మల్టీలేటరలిజం’

      విభాగానికి సెక్రటరీ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
 - హర్‌దీప్‌ సింగ్‌పూరి

3.    వెండితెరపై మొట్టమొదటి టార్జాన్‌గా సినీజనాన్ని అలరించిన       అలనాటి హాలీవుడ్‌

   నటుడు ఇటీవల మరణించాడు. ఆయన పేరేమిటి?
 - డెనీ మిల్లర్‌

4.    మారుమూల గ్రామాల్లో ఉన్న వైద్య ఉపకేంద్రాలు మొదలుకుని అన్ని ఆస్పత్రుల్లో

    రోగులకు ఉచితంగా మందులు సరఫరా చేయాలని మిజోరాం రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది?
    ఈ పథకం పేరేమిటి?
       - ముఖ్యమంత్రి ఉచిత మందుల పథకం

5.    ‘సింగపూర్‌ ఫ్రమ్‌ థర్డ్‌ వరల్డ్‌ టూ ఫస్ట్‌’ అనే పుస్తకాన్ని రాసిందెవరు?

 - లీక్వాన్‌ యూ

6.    ఫార్చ్యూన్‌ పత్రిక రూపొందించిన వ్యాపార రంగంలో 2014కి అత్యంత శక్తిమంతమైన

    మహిళల జాబితాలో అగ్రస్థానం ఎవరికి దక్కింది?
 - ఐబిఎం చైర్మన్‌, సిఇవొ - జిన్నీ రొమెట్టీ

7.    అమెరికాకు చెందిన అత్యంత ధనికులతో ఫోర్బ్స్‌ పత్రిక రూపొందించిన ‘ద రిచెస్ట్‌

     పీపుల్‌ ఇన్‌ అమెరికా- 2014’ జాబితాలో అగ్రస్థానం ఎవరికి దక్కింది?
- మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌(బిల్ గేట్స్‌)

8.    ‘ఎలకా్ట్రనిక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?

 - ఈసిఐఎల్‌  సిఎండి  పి.సుధాకర్‌

9.    ప్రముఖ మాండలిన్‌ కళాకారుడు ఉప్పలపు శ్రీనివాస్‌ 2014, సెప్టెంబర్‌ 19న చెన్నైలో

     మరణించారు. భారతప్రభుత్వం ఏ సంవత్సరంలో శ్రీనివాస్‌ని పద్మశ్రీతో సత్కరించింది?
 - 1998

10.  అఫ్ఘానిస్తాన్‌ నూతన అధ్యక్షుడిగా 2014 సెప్టెంబర్‌ 29న బాధ్యతలు స్వీకరించింది ఎవరు?

 - అష్రాఫ్‌ఘనీ

11. దేశాన్ని 2019 నాటికి పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 2014 అక్టోబర్‌ 2న ప్రధాని

     నరేంద్రమోదీ ప్రారంభించిన కార్యక్రమం పేరేమి?
- స్వచ్ఛ భారత్‌

12. ‘పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌’ జన్మదినమైన సెప్టెంబర్‌ 25ని ఏ విధంగా పాటించాలని

       కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
- అంత్యోదయ దివస్‌

13. అరవై ఏళ్లు దాటిన మహిళల పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వారిని ఆదుకునేందుకు

      ఆహార పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?
- ఉత్తరాఖండ్‌

14. 
మలేషియాఓపెన్‌ టెన్నిస్‌-2014 టోర్నీలో పురుషుల డబుల్స్‌ టైటిల్‌ గెలుచుకున్నది ఎవరు ?

 - లియాండర్‌పేస్‌ (భారత్‌), మార్టిన్‌ మట్కోవ్‌స్కీ (పోలండ్‌)

15. టీ-20 క్రికెట్‌లో ఐదువేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా

      ఘనత సాధించింది ఎవరు?
 - సురేష్‌ రైనా

16. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) జనరల్‌గా ఎవరు నియ మితులయ్యారు?

 - ఒ.పి సింగ్‌

17. అంతర్జాతీయంగా ఉన్న ‘18’ మెట్రో వ్యవస్థల్లో వివిధ విషయాల్లో వినియోగదారుల సంతృప్తికి

    సంబంధించి నానో, కోమెట్‌ సంస్థలు నిర్వహించిన ఆన్‌లైన్‌ వినియోగదారుల సర్వేలో 
    మెట్రో ‘లండన్‌ డిఎల్‌ఆర్‌’ అగ్రస్థానంలో ఉంది. మరి రెండో స్థానంలో  ఏది నిలిచింది?
 - ఢిల్లీ మెట్రో రైల్వే

18. ‘బీల్బావో చెస్‌ మాస్టర్‌-2014’ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?

 - విశ్వనాథన్‌ ఆనంద్‌

19. పద్దెనిమిదేళ్లలోపు బాలికలను వివాహం చేసుకొంటే, రెండేళ్ల జైలుశిక్ష విధించే చట్టానికి

      2014, సెప్టెంబర్‌ 15న ఆమోదం తెలిపిన దేశం ఏది?
 - బంగ్లాదేశ్‌

20. వివిధ ప్రాంతాల్లో హోటళ్ల వివరాలు, విడిది వసతులకు సంబంధించి ఆన్‌లైన్‌సైట్‌

      ‘ట్రివాగో’ నిర్వహించిన అధ్యయనంలో  ప్రథమ స్థానంలో నిలిచిన ప్రాంతం ఏది?
- బంగ్లాదేశ్‌

21. మైనారిటీ వర్గాల పేద యువతుల వివాహాలకు రూ.51 వేల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకం పేరేమి?
- షాదీ ముబారక్‌

22. వరంగల్‌ జిల్లాలో ఎవరి పేరుతో ఆరోగ్య వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ

      రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ?
 - కాళోజీ నారాయణరావు

23. 12వ ప్రపంచ జీవ వైవిద్య సదస్సు అక్టోబర్‌ 12 నుంచి 14 వరకు ఎక్కడ నిర్వహించారు?

 - దక్షిణ కొరియాలోని యాంగ్‌చాంగ్‌

24. క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?

 - అదిల్‌ జైనుల్‌బాయ్‌

25. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి

      జయలలితకు బెంగళూర్‌లోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఎన్నేళ్ళు జైలుశిక్ష విధించారు?
 - నాలుగేళ్లు

26. 2015 ఆరంభంలో యూరోజోన్‌లో 19వ సభ్యదేశంగా చేరనున్న దేశం ఏది?

- లిథువేనియా

27. ‘వెల్త్‌-ఎక్స్‌’ యుబిఎస్‌ సెన్సస్‌ 2014లో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశంగా మొదటి

       స్థానంలో నిలిచిన దేశం ఏది?
- అమెరికా

28.  వృద్ధ కళాకారుల పింఛన్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.500 నుంచి ఎంతకు పెంచింది?

 - రూ.1,500

29.  మహరాష్ట్రలో ఎప్పటి నుంచి రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది?

- 2014, సెప్టెంబర్‌ 28

30. కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన పథకం పరిధిలోకి దేశంలోని ఎన్ని పట్టణాలను

      తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది?
- 4,041

31. 2014, అక్టోబర్‌ 2న ఏ రాష్ట్ర సచివాలయం వద్ద భారీ గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు?

- కర్ణాటక సచివాలయం

32. భారతదేశంలో బంగ్లాదేశ్‌ రాయబారిగా బంగ్లాదేశ్‌ ప్రభుత్వం 2014సెప్టెంబర్‌ 28న

      ఎవరిని నియమించింది?
 - సయ్యద్‌ మొవజ్జం ఆలీ

33. మలయాళంలో ప్రతిష్ఠాత్మకమైన ‘మాతృభూమి’ సాహిత్య పురస్కారానికి ఇటీవల

     ఎవరు ఎంపికయ్యారు?
 - సుగతా కుమారి

34. 2014, సెప్టెంబర్‌ 23న సరస్వతీ సమ్మాన్‌ పురస్కారం 2013ను అందుకున్న హిందీ

     రచయిత ఎవరు?
 - గోవింద్‌ మిశ్రా

35. జస్టిస్‌ మంజుల ఛెల్లూర్‌ ఏ హైకోర్టుకు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా

     నియమితులయ్యారు?
 - కలకత్తా హైకోర్టు

36. 2014, అక్టోబర్‌లో 11వ వరల్డ్‌ మెట్రో పోలిస్‌ కాంగ్రెస్‌ ఎక్కడ జరిగింది?

- హైదరాబాద్‌

37. ప్రస్తుత నార్వే ప్రధాని ఎవరు?

 - ఎర్నా సోల్‌బర్గ్‌

38. బ్రిటన్‌తో స్కాట్లాండ్‌ కలిసి ఉండాలా? వద్దా?అనే విషయంపై జరిగిన రెఫరెండమ్‌లో

       55.3 శాతం మంది స్కాట్లాండ్‌ వాసులు బ్రిటన్‌లో కలిసి ఉండడడానికి ఓటు వేశారు.
      అయితే ఈ విషయమై రెఫరెండమ్‌ ఎప్పుడు జరిగింది?
  - 2014, సెప్టెంబర్‌ 18

39. సంప్రదాయ కర్రల సమరం (బన్నీ ఉత్సవం) అక్టో బర్‌ 3న ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో జరిగింది?

- కర్నూల్‌

40. శాసీ్త్రయ విధానంలో స్వదేశీ ఆవుల రకాల వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన

       మిషన్‌ ఏది?
 - రాషీ్ట్రయ గోకుల్‌ మిషన్‌

41. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరిగిన 17వ ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి
       స్వర్ణ పతకాన్ని జీతురాయ్‌ అందించాడు. అయితే జీతురాయ్‌ ఏ క్రీడాంశంలో ఈ పతకాన్ని
      సాధించాడు?
- షూటింగ్‌

42. బ్రహ్మోస్‌ క్షిపణి పితామహుడు ఎ. శివథాను పిళ్లైకి 2014 అక్టోబర్‌ 7న రాష్ట్రపతి

       ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా ఏ పురస్కారాన్ని అందుకున్నారు?
- లాల్‌బహదూర్‌శాసి్త్ర అవార్డు

43. ఇండో-
నేపాల్, ఇండో - భూటాన్‌ సరిహద్దుల వద్ద పహారా విధులను నిర్వర్తించే ‘సశస్త్ర
      సీమాంబల్‌’ (ఎస్‌ఎస్‌బి)కు నూతన అధిపతిగా ఎవరు నియమితులయ్యారు?
 - బి.డి. శర్మ

44. ఏ భారత మాజీ క్రికెటర్‌ ‘ఇండో - యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌

      అవార్డు’ను సెప్టెంబర్‌ 24న ‘హౌస్‌ ఆఫ్‌ లార్స్డ్‌’లో అందుకున్నారు?
- కపిల్‌దేవ్‌

45. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 4న రామగుండం, కొత్తగూడెం, మణుగూరులలో మూడు

      థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందాలు
       కుదుర్చుకుంది?
 - భారత్‌ హెవీ ఎలకి్ట్రకల్స్‌ లిమిటెడ్‌

46. వ్యవసాయ సాంకేతిక సమాచారాన్ని రైతులకు అందించే లక్ష్యంతో ‘కిసాన్‌వాణి’ 
       సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన బ్యాంక్‌ ఏది?
 - ఆంధ్రాబ్యాంక్‌

47. భారత్‌లో అమెరికా రాయాబారిగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 18న నియమితులైనది ఎవరు?
 - రిచర్డ్‌ రాహుల్‌ వర్మ

48. చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్‌ మూడు రోజుల భారత్‌ పర్యటన సందర్భంగా (సెప్టెంబర్‌, 2014)
      భారత్‌తో ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు?
 - పన్నెండు  

49. 18వ ఆసియా క్రీడలను 2018లో నిర్వహించే దేశం ఏది?
 - ఇండోనేషియా

50. ప్రస్తుత ఆసియా ఒలింపిక్‌ మండలి అధ్యక్షుడు ఎవరు?
 - షేక్‌ అహ్మద్‌

51. ఇటీవల అంగారక కక్ష్యలోకి ప్రవేశించిన ‘మార్స్‌ అట్మాస్పియర్‌ అండ్‌ వోలటైన్‌ ఎవల్యేషన్‌
      (మావెన్‌)’ ఉపగ్రహం ఏ దేశానికి చెందింది?
 - అమెరికా

52. ‘యూఎస్‌ నేషనల్‌ మోడల్‌ ఆఫ్‌ సైన్స్‌’కు ఎంపికైన ప్రవాస భారతీయుడు ఎవరు?
 - థామస్‌ కైలత్‌

53. ప్రస్తుత భారత హాకీ జట్టు కెప్టెన్‌ పేరేమిటి ? 
- సర్ధార్‌సింగ్‌

54. గాంధీ జయంతి సందర్భంగా అమె రికాలోని ఏ నగరం లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని 
     ఆవిష్కరించారు?
 - డల్లాస్‌

55. గుర్తింపు పొందిన మైనారిటీ వర్గాల విద్యార్థులు విదేశాల్లో విద్య అభ్య సించేందుకు ఇచ్చే 
     రుణాల వడ్డీ సబ్సిడీ కోసం కేంద్ర ప్రభు త్వం ప్రారంభించిన పథకం పేరేమిటి?
 - ఏడో పరదేశ్‌

56. సిడ్నీలో జరిగిన ‘బి 20 ఆసే్ట్రలియా సదస్సు’లో ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ 2014’ను 
      విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం స్విట్జర్లాండ్‌ ప్రథమ స్థానంలో నిలవగా భారత్‌ ఎన్నో
       స్థానంలో ఉంది?
 - 76

57. 2014లో స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన 20వ కామన్వెల్త్‌ క్రీడల్లో మిల్కాసింగ్‌ తరవాత 
       56 ఏళ్లకు భారత్‌కు బంగారు పతకాన్ని సాధించిన భారతీయ అథ్లెట్‌ ఎవరు ? 
 - వికాస్‌గౌడ్‌

58. కాస్ట్‌ రికార్డులు, కాస్ట్‌ ఆడిట్‌కు సంబంధించి కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ  
       ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్‌ ఎవరు? 
- ఆర్‌.ఎస్‌. శర్మ

59. కేంద్ర ప్రభుత్వం త్వరలో ‘ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజివ్‌ మిషన్‌’ను అమలు చేయనుంది.
     దేశంలోని అన్ని కుటుంబాల వారికి బ్యాంకింగ్‌ సేవలను నిర్ణీత కాలంలో అందుబాటులోకి
      తీసుకొని రావడమే ఈ మిషన్‌ లక్ష్యం. అయితే ఈ మిషన్‌ పేరేమిటి?
 - సంపూర్ణ విత్తీయ సమావేశన్‌ మిషన్‌

60. విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థుల కోసం ట్రావెల్‌కార్డులు ప్రవేశపెట్టిన బ్యాంక్‌ ఏది?
 - ఐసిఐసిఐ బ్యాంక్‌

61. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ‘వరిష్ఠ పింఛన్‌ బీమా యోజన పథకాన్ని’ పున:ప్రారంభించారు.
      అయితే ఈ పథకాన్ని నిర్వహించే సంస్థ ఏది?
 - ఎల్‌ఐసి

62. ‘ల్యాండ్‌ ఆఫ్‌ కో ఆపరేటివ్స్‌’గా ఏ దేశాన్ని పిలుస్తారు?
 డెన్మార్క్

63. భారతదేశంలో ఏ నగరాన్ని ‘పిట్స్‌బర్గ్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తారు?
 - జంషెడ్‌పూర్‌

64. బీహార్‌లో రాజ్‌గిరిలో ప్రారంభమైన నలంద విశ్వవిద్యాలయ తొలి ఉపకులపతి ఎవరు?
 - గోపా సభర్వాల్‌

65. విశ్వం గురించి అధ్యయనం చేసే శాసా్త్రన్ని ఏమని పిలుస్తారు ?
 - కాస్మాలజీ

66. 2006లో అంతర్జాతీయ ఖగోళసమాఖ్య ఏ గ్రహాన్ని మరుగుజ్జు గ్రహంగా ప్రకటించింది?
 - ప్లూటో

67. భూకేంద్రిక సిద్ధాంతాన్ని ఎవరు ప్రారంభించారు? 
- టాలమీ

68. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? 
- కోపర్నికస్‌

69. 2022 సంవత్సరానికి హవాయ్‌ దీవిలో నిర్మించనున్న ప్రపంచంలోనే అతిపెద్ద టెలీస్కోప్‌ 
      నిర్మాణంలో పాలుపంచుకుంటున్న దేశాలు ఏవి?
- జపాన్‌, అమెరికా, చైనా, కెనడా, భారత్‌

70. అక్టోబర్‌ 9న ఢిల్లీలో జరిగిన ‘ఇంటర్నెట్‌ డాట్‌ ఆర్గ్‌’ సదస్సులో పాల్గొన్న ఫేస్‌బుక్‌ సిఇఒ, సహ 
      వ్యవస్థాపకుడు ఎవరు? 
- మార్క్‌ జుకర్‌బెర్గ్‌