ఫిబ్రవరి - 1
¤ సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) - 5 ట్రోఫీ విజేతగా తెలుగు వారియర్స్ జట్టు నిలిచింది.
» హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో తెలుగు వారియర్స్ జట్టు 7 వికెట్ల తేడాతో చెన్నై రైనోస్ జట్టును ఓడించింది.
» తెలుగు వారియర్స్ జట్టు ఈ ట్రోఫీని గెలవడం ఇదే తొలిసారి.
» ఫైనల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' సుధీర్ బాబు, తెలుగు వారియర్స్.
» 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా సచిన్ జోషి (తెలుగు వారియర్స్) నిలిచాడు.
» తెలుగు వారియర్స్ జట్టు కెప్టెన్ వెంకటేష్, వైస్ కెప్టెన్ అఖిల్ అక్కినేని.
¤ ఆస్ట్రేలియా ఓపెన్ - 2015 విజేతగా నొవాక్ జకోవిచ్ (సెర్బియా) నిలిచాడు. మెల్‌బోర్న్‌లోని రాడ్ లేవర్ ఎరీనాలో జరిగిన ఫైనల్లో జకోవిచ్ 7-6, 6-7, 6-3, 6-0తో బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రేను ఓడించాడు.
» జకోవిచ్‌కు ఇది అయిదో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. ఇక్కడ ఆడిన అయిదు ఫైనల్లలోనూ జకోవిచ్ విజేతగా నిలిచాడు. మొత్తం మీద జకోవిచ్‌కు ఇది ఎనిమిదో గ్రాండ్‌స్లామ్ టైటిల్.
» రాయ్ ఎమర్సన్, ఆస్ట్రేలియా(6 టైటిళ్లు) తర్వాత ఎక్కువ సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఘనత జకోవిచ్‌దే.
» ఛాంపియన్ జకోవిచ్‌కు 31 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.14 కోట్ల 96 లక్షలు), రన్నరప్ ఆండీ ముర్రేకు 15 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.7 కోట్ల 48 లక్షలు) ఫ్రైజ్‌మనీగా లభించింది.
» టెన్నిస్‌లో ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను అయిదోసారి నెగ్గిన తొలి క్రీడాకారుడిగా జకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఓపెన్ శకం ప్రారంభం కాకముందు రాయ్ ఎమర్సన్ ఈ ఘనత సాధించాడు.
» జకోవిచ్ గతంలో 2008, 2011, 2012, 2013ల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచాడు. రెండుసార్లు వింబుల్డన్, ఒకసారి యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించాడు.
» ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను లియాండర్ పేస్ (భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ నెగ్గింది. 41 సంవత్సరాల వయసులో పేస్ మరో వెటరన్ 34 ఏళ్ల హింగిస్‌తో కలిసి ఈ విజయం సాధించడం విశేషం.
» పేస్ కెరీర్లో ఇది 15వ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్.
» తాజా ఫైనల్లో పేస్ జోడీ 6-4, 6-3తో డానియల్ నెస్టర్ (కెనడా) - క్రిస్టినా మ్లెడనోవిచ్(ఫ్రాన్స్) జోడీని ఓడించింది.
» పేస్ మొత్తం మీద 7 మిక్స్‌డ్ టైటిల్స్, 8 పురుషుల డబుల్స్ టైటిల్స్ నెగ్గాడు. పేస్ ఖాతాలో ఇది మూడో ఆస్ట్రేలియన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్.
» లియాండర్ చివరిగా 2013లో యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచాడు.
» పురుషుల డబుల్స్ టైటిల్‌ను సిమోనీ బోలెల్లీ, ఫ్యాబియో ఫోనిని (ఇటలీ) జోడీ నెగ్గింది.
» మహిళల డబుల్స్ టైటిల్‌ను బెథానీ మాటెక్ (అమెరికా), లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) జోడీ నెగ్గింది.
¤ జాతీయ క్రీడల తొలి రోజు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు నెగ్గారు.
» పురుషుల 56 కిలోల విభాగంలో వల్లూరి శ్రీనివాసరావు స్వర్ణం నెగ్గాడు. స్నాచ్‌లో 106 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 137 కిలోలతో తన పేరిట ఉన్న జాతీయ క్రీడల రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తం 243 కిలోలు మోశాడు.
» మహిళల 48 కిలోల విభాగంలో బంగారు ఉష, 53 కిలోల విభాగంలో కాతిల వెంకటలక్ష్మి కాంస్యాలు నెగ్గారు.
ఫిబ్రవరి - 4
¤ జాతీయ క్రీడల్లో తెలంగాణ రెండు రజతాలు సాధించింది.
» టెన్నిస్‌లో తెలంగాణ పురుషులు, మహిళల జట్లు రన్నరప్‌లుగా నిలిచాయి. పురుషుల ఫైనల్లో తెలంగాణ 1-2తో తమిళనాడు చేతిలో ఓడింది. మహిళల ఫైనల్లో గుజరాత్ 2-0తో తెలంగాణపై నెగ్గింది.
» మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరుణ రాణి 69 కిలోల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. మొత్తం 190 కిలోల బరువువెత్తి కాంస్యం నెగ్గింది.
ఫిబ్రవరి - 5
¤ తిరువనంతపురంలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు రెండు స్వర్ణాలు నెగ్గారు. పురుషుల సింగిల్ స్కల్‌లో 500 మీటర్ల రేసులో అస్రార్ పాటిల్ స్వర్ణం సొంతం చేసుకుని జాతీయ క్రీడల్లో తెలంగాణకు తొలి స్వర్ణం అందించాడు. పురుషుల కాక్స్‌లెస్ పెయిర్‌లో మంజీత్ సింగ్-దలిందర్ సింగ్ జోడీ స్వర్ణం నెగ్గింది.
» పురుషుల బీచ్ వాలీబాల్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తెలంగాణ జట్టుపై నెగ్గి స్వర్ణం సాధించింది.
» జిమ్నాస్టిక్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మేఘనరెడ్డి ఒక స్వర్ణం, ఒక కాంస్యం నెగ్గింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో క్రీడాకారిణి అరుణ ఒక కాంస్యాన్ని నెగ్గింది.
ఫిబ్రవరి - 9
¤ జాతీయ క్రీడల కనోయింగ్ - కయాకింగ్‌లో తెలంగాణకు స్వర్ణం లభించింది. 1000 మీటర్ల మెన్ 4 కయక్‌లో షమి శర్మ, ప్రేమ్ చంద్రసింగ్, కేశరి నందన్, లైతోంజమ్ నవోఛ లతో కూడిన జట్టు స్వర్ణం నెగ్గింది.
» జాతీయ క్రీడల్లో ఆర్చరీలో ఝార్ఖండ్ మూడు స్వర్ణాలు దక్కించుకుంది.
ఫిబ్రవరి - 12
¤ 2015 క్రికెట్ ప్రపంచకప్ ఆరంభ వేడుకలను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఘనంగా నిర్వహించాయి. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లోని లీఫీహాగ్లే ఓవల్ పార్క్‌లో జరిగిన వేడుకలకు ప్రేక్షకులు వేలల్లో హాజరయ్యారు. న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జాన్‌కీ, అనేక మంది ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు ఆరంభోత్సవానికి హాజరయ్యారు.
» ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి డేవిడ్ రిచర్డ్‌సన్ ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించారు. నాలుగు జట్ల కెప్టెన్లు (దక్షిణాఫ్రికా, శ్రీలంక, జింబాబ్వే, న్యూజిలాండ్) ఇక్కడ జరిగిన వేడుకలకు హాజయ్యారు.
» మెల్‌బోర్న్‌లోని మైయర్ మ్యూజిక్ బౌల్ మైదానంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలకు 10 జట్ల (ఇండియా, ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, పాకిస్థాన్, స్కాట్లాండ్, యూఏఈ, వెస్టిండీస్) సారధులు హాజరయ్యారు.
ఫిబ్రవరి - 13
¤ జాతీయ క్రీడల్లో బాక్సింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు శ్యాంకుమార్ కాకర 49 కిలోల విభాగంలో స్వర్ణం నెగ్గాడు.
» బ్యాడ్మింటన్‌లో పురుషుల డబుల్స్ (సుమీత్ రెడ్డి - నందగోపాల్), మహిళల డబుల్స్ (సిక్కిరెడ్డి - రితుపర్ణ దాస్)లో తెలంగాణకు రెండు స్వర్ణాలు దక్కాయి.
ఫిబ్రవరి - 14
¤ 11వ వన్డే క్రికెట్ ప్రపంచకప్ పోటీలు ప్రారంభమయ్యాయి.
» న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్, శ్రీలంకల మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 98 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.
» ఈ మ్యాచ్‌లో శ్రీలంక క్రికెటర్ సంగక్కర వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో (13,732 పరుగులు) రెండో స్థానానికి చేరాడు. ఈ క్రమంలో పాంటింగ్ (13,704)ను అధిగమించాడు. వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు (18,426) సచిన్ పేరిట ఉంది.
» మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా111 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.
» ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ హ్యాట్రిక్ నమోదు చేశాడు.
» 11వ ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 14 జట్లు పాల్గొంటున్నాయి. 14 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 49.
» తొలిసారిగా అఫ్ఘానిస్థాన్ ప్రపంచకప్‌లో పాల్గొంటోంది. ప్రపంచకప్ ఆడుతున్న 20వ జట్టుగా అఫ్గానిస్థాన్ నిలిచింది.
» ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ రూ.63 కోట్ల 33 లక్షలు. విజేతకు లభించే మొత్తం రూ.23 కోట్ల 60 లక్షలు. రన్నరప్‌కు లభించే మొత్తం రూ. 10.8 కోట్లు.
» సెమీస్ చేరితే లభించే మొత్తం రూ.3 కోట్ల 72 లక్షలు.
» ఈ ప్రపంచకప్‌లో ఆడుతున్న వారిలో 43 ఏళ్ల ఖుర్రమ్ ఖాన్(యూఏఈ) పెద్ద వయస్కుడు. 18 ఏళ్ల ఉస్మాన్ ఘనీ (అఫ్ఘానిస్థాన్)చిన్న వయస్కుడు.
» ఈ ప్రపంచకప్‌లో ఆడుతున్న వారిలో అత్యంత పొడగరి మొహమ్మద్ ఇర్ఫాన్ (పాకిస్థాన్ - 7 : 1 అడుగులు). పొట్టి ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ (బంగ్లాదేశ్ - 5.3 అడుగులు)
¤ కేరళలో 15 రోజుల పాటు జరిగిన జాతీయ క్రీడలు ముగిశాయి. ఆ రాష్ట్ర గవర్నర్ రిటైర్డ్ జస్టిస్ పి.సదాశివం ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ క్రీడలు ముగిశాయని ప్రకటించారు.
» ఈ క్రీడల్లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్ఎస్‌సీబీ) 159 పతకాలతో (91 స్వర్ణాలు, 33 రజతాలు, 35 కాంస్యాలు) ఓవరాల్ విజేతగా నిలిచింది. కేరళ - 162 (54 + 48 + 60), ద్వితీయ, హరియాణా - 107 (40 + 40 + 27)తో తృతీయ స్థానాల్లో నిలిచాయి.
» తెలంగాణ 33 పతకాలతో (8 + 14 + 11) 12వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 16 పతకాలతో (6 + 3 + 7) 18వ స్థానంలో నిలిచాయి.
» 2011 రాంచీ జాతీయ క్రీడల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం 49 పతకాలు సాధించింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు కలిపి 49 పతకాలే గెలిచాయి.
» పురుషుల విభాగంలో స్విమ్మర్ సజన్ ప్రకాష్, మహిళల విభాగంలో స్విమ్మర్ ఆకాంక్ష వోరా 'ఉత్తమ అథ్లెట్స్' పురస్కారాలను గెలుచుకున్నారు. ఈ క్రీడల్లో ప్రకాష్ 6 స్వర్ణాలు నెగ్గాడు.
» తదుపరి జాతీయ క్రీడలు 2016లో గోవాలో జరగనున్నాయి.
ఫిబ్రవరి - 15
¤ ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్‌లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ధోని సేన 76 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి ఘనంగా బోణీ కొట్టింది.
» ప్రపంచకప్ మ్యాచుల్లో పాక్‌పై భారత్‌కు ఇది వరుసగా ఆరో విజయం.
» విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 107 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో పాక్‌పై సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడు కోహ్లీనే.
» మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: విరాట్ కోహ్లీ.
ఫిబ్రవరి - 16
¤ ప్రపంచకప్‌లో భాగంగా నెల్సన్‌లో వెస్టిండీస్, ఐర్లాండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 4 వికెట్లు తేడాతో నెగ్గింది.
» మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: స్టిర్లింగ్ (ఐర్లాండ్).
¤ బెంగళూరులో ఐపీఎల్ - 8 కోసం నిర్వహించిన వేలం లో యువరాజ్ సింగ్ అత్యధికంగా రూ.16 కోట్లు పలికి వార్తల్లో నిలిచాడు. ఇతడిని దిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకుంది.
» గతేడాది రూ.14 కోట్లకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు సొంతమై ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించిన యువరాజ్ తాజాగా తన రికార్డును తానే అధిగమించాడు.
ఫిబ్రవరి - 17
¤ క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌లోని డునెడిన్‌లో జరిగిన పోటీలో ఆతిధ్య న్యూజిలాండ్ 3 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించింది.
ఫిబ్రవరి - 22
¤ ప్రపంచకప్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
» మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: శిఖర్ ధావన్.
» శిఖర్ ఈ మ్యాచ్‌లో 137 పరుగులు చేశాడు. కెరీర్లో ఇది ఏడో వన్డే సెంచరీ. (ఇప్పటి వరకు అతడు శతకం సాధించిన అన్ని మ్యాచుల్లో భారత్ గెలిచింది).
¤ ఎం.ఎస్.ధోనీ సహయజమానిగా ఉన్న రాంచీ రేస్ జట్టు హాకీ ఇండియా లీగ్-3 టైటిల్ కైవసం చేసుకుంది. దిల్లీలో జరిగిన ఫైనల్లో 3-2తో పంజాబ్ వారియర్స్‌ను ఓడించింది.
ఫిబ్రవరి - 24
¤ 2015 క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా కాన్‌బెర్రాలో జింబాబ్వేతో జిరిగిన మ్యాచ్‌లో వెస్టిండిస్ 73 పరుగుల తేడాతో విజయం సాధించింది.
» ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్ ఆటగాడు క్రిస్‌గేల్ 215 పరుగులు చేశాడు. 147 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో ఈ స్కోరు చేశాడు. ప్రపంచకప్‌లో తొలి ద్విశతకం చేసిన ఆటగాడిగా, వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయేతర క్రికెటర్‌గా క్రిస్‌గేల్ రికార్డులకెక్కాడు. శామ్యూల్స్ (133 నౌటౌట్)తో కలిసి రెండో వికెట్‌కు 372 పరుగుల భాగస్వామ్య రికార్డును గేల్ తిరగరాశాడు.
» టెస్టుల్లో300, వన్డేల్లో 200, టీ 20ల్లో 100 పరుగులు చేసిన ఏకైక ఆటగాడు క్రిస్‌గేల్.
ఫిబ్రవరి - 26
¤ ప్రపంచకప్‌లో భాగంగా డునెడిన్‌లో స్కాట్లాండ్, అఫ్గానిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ ఒక వికెట్ తేడాతో నెగ్గింది.
» తొలిసారిగా ప్రపంచకప్ ఆడుతున్న అఫ్గాన్‌కు ఇదే తొలి విజయం.
» మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: సమీవుల్లా షెన్వారి, అఫ్గాన్.
ఫిబ్రవరి - 27
¤ ప్రపంచకప్‌లో భాగంగా సిడ్నీలో దక్షిణాఫ్రికా, వెస్టిండిస్‌ల మధ్య జరిగిన వన్డేలో దక్షిణాఫ్రికా 257 పరుగుల తేడాతో విజయం సాధించింది.
» మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 408 పరుగులు చేసింది. వెస్టిండిస్ 151 పరుగులకే ఆలౌట్ అయింది.
» ప్రపంచకప్ క్రికెట్ లో 408 పరుగులు రెండో అత్యధిక స్కోరు. 2007లో బెర్ముడాపై భారత్ అత్యధికంగా 413 పరుగులు చేసింది.
» ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ 66 బంతుల్లో 162 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 64 బంతుల్లో 150 పరుగులు చేసి వన్డేల్లో వేగవంతమైన 150 పరుగుల రికార్డును సాధించాడు.
» వన్డేల్లో వేగవంతమైన 50 (16 బంతులు), వేగవంతమైన శతకం (31 బంతులు) రికార్డులు కూడా డివిలియర్స్ పేరిటే ఉన్నాయి.
ఫిబ్రవరి - 28
¤ ప్రపంచకప్‌లో భాగంగా పెర్త్‌లో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో నెగ్గింది.
» మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: రవిచంద్రన్ అశ్విన్
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment